టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా ఇంగ్లండ్ కౌంటీల్లో నార్తాంప్టన్‌షైర్ తరపున అరంగేట్రం చేశాడు. శుక్రవారం రాయల్ లండన్ వన్డే కప్‌లో భాగంగా గ్లౌసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌తో ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్‌లో పృథ్వీ షా అడుగుపెట్టాడు. అయితే తన తొలి మ్యాచ్‌లోనే విచిత్రమైన రీతిలో పృథ్వీషా ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో 35 పరుగులు చేసిన పృథ్వీషా హిట్‌వికెట్‌గా వెనుదిరిగాడు.
ఏం జరిగిందంటే?
నార్తాంప్టన్‌షైర్ ఇన్నింగ్స్ 16 ఓవర్‌లో గ్లౌసెస్టర్‌షైర్ పేసర్ పాల్ వాన్ మీకెరెన్ ఆఖరి బంతిని బౌన్సర్‌గా సంధించాడు. ఆ బంతిని ఫుల్‌షాట్ ఆడిబోయిన పృథ్వీ.. తన నియంత్రణను కోల్పోయి కిందపడిపోయాడు. ఈ క్రమంలో అతడి షూ స్టంప్స్‌కు తాకింది. దీంతో ఊహించని రీతిలో పృథ్వీ షా హిట్‌వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అతడి ఔట్‌పై నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. "ఏంటి భయ్యా నీ అదృష్టం, ఎక్కడ ఆడినా ఇంతేనా" అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి జాతీయ జట్టుకు దూరంగా ఉన్న పృథ్వీ షా.. తన రిథమ్‌ను తిరిగి పొందేందుకు ఇంగ్లీష్ కౌంటీల్లో ఆడాలని నిర్ణయించకున్నాడు. ఈ క్రమంలోనే నార్తాంప్టన్‌షైర్‌తో జతకట్టాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో కూడా పృథ్వీ షా తీవ్ర నిరాశపరిచాడు.
చదవండి: Triple Century Hero: అరంగేట్రంలో 4 రన్స్! మూడో మ్యాచ్‌లో ఏకంగా ట్రిపుల్ సెంచరీ.. కానీ ఏడాదిలోనే ముగిసిన కెరీర్! అలా ప్రపంచంలో నం.1గా..
HIT WICKET!!!! 🚀
— Gloucestershire Cricket (@Gloscricket) August 4, 2023
Paul van Meekeren with a fierce bumper that wipes out Prithvi Shaw who kicks his stumps on the way down. What a delivery! Shaw goes for 34.
Northants 54/6.#GoGlos 💛🖤 pic.twitter.com/EMYD30j3vy
Comments
Please login to add a commentAdd a comment