
భారత సీనియర్ ఓపెనర్ మురళీ విజయ్ ఇంగ్లండ్‌లోని కౌంటీ క్రికెట్‌లో బరిలోకి దిగనున్నాడు. ఈ నెలలో ఎస్సెక్స్ కౌంటీ తరఫున అతను మూడు 4 రోజుల మ్యాచ్‌లు ఆడనున్నాడు. ఇంగ్లండ్ టూర్‌లో ఫామ్‌లో లేక సతమతమవుతున్న అతనికి బీసీసీఐ కౌంటీలాడే ఏర్పాటు చేసింది.
ఈ నెల 10 నుంచి నాటింగ్‌హమ్‌షైర్‌తో తొలి మ్యాచ్, 18 నుంచి వార్సెస్టెర్‌షైర్‌తో రెండో మ్యాచ్, 24 నుంచి సర్రేతో మూడో మ్యాచ్‌లో విజయ్ బరిలోకి దిగుతాడు. దీనిపై అతను స్పందిస్తూ కౌంటీలాడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు.