వైరల్‌: కోహ్లి, ధావన్‌ ఏం చేశారో చూడండి | Virat Kohli Enter the Ground in Style Against Essex  | Sakshi
Sakshi News home page

Published Sat, Jul 28 2018 12:39 PM | Last Updated on Sat, Jul 28 2018 5:08 PM

Virat Kohli Enter the Ground in Style Against Essex  - Sakshi

బ్యాండ్‌తో కోహ్లిసేనకు స్వాగతం

చెమ్స్‌ఫోర్డ్‌ :  టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మైదానంలో చిందేసాడు. సుదీర్ఘ సిరీస్‌కు ముందు టీమిండియా కౌంటీ జట్టు ఎస్సెక్స్‌తో మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడింది. ఈ మ్యాచ్‌ సందర్భంగా ఫీల్డింగ్‌ కోసం మైదానంలోకి వస్తున్న కోహ్లి సేనకు పంజాబీ స్టైల్‌లో బ్యాండ్‌ కొడుతూ నిర్వాహకులు స్వాగతం పలికారు. అయితే ఈ బ్యాండ్‌ చప్పుడు విన్న కోహ్లికి తనలోని డ్యాన్సర్‌ నిద్ర లేచాడు. ఎవరూ ఊహించిన విధంగా బాంగ్రా స్టెప్పుతో అదరగొట్టాడు. ఇక ఈ కెప్టెన్‌కు జతగా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ సైతం చిందేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఎస్సెక్స్‌ జట్టు తమ అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తోంది.

ఇక ఈ ఏకైక సన్నాహక మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. శుక్రవారం వర్షం కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన కేఎల్‌ రాహుల్‌ (64 బంతుల్లో 36 నాటౌట్‌; 7 ఫోర్లు)తో పాటు అజింక్య రహానే (27 బంతుల్లో 19 నాటౌట్‌; 3 ఫోర్లు) నిలకడ చూపారు. అయితే, మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (0) మరోసారి డకౌట్‌గా వెనుదిరిగాడు. డిపెండబుల్‌ బ్యాట్స్‌మన్‌ పుజారా (23) ఎక్కువసేపు నిలవలేకపోయాడు.

చదవండి: సన్నాహం సమాప్తం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement