Somerset
-
రాయల్ లండన్ వన్డే కప్ విజేత గ్లామోర్గన్
రాయల్ లండన్ వన్డే కప్ (ఇంగ్లండ్ దేశవాలీ వన్డే కప్) 2024 ఎడిషన్ విజేతగా గ్లామోర్గన్ జట్టు అవతరించింది. నిన్న జరిగిన ఫైనల్లో ఆ జట్టు సోమర్సెట్పై 15 పరుగుల తేడాతో గెలుపొందింది. వర్షం కారణంగా షెడ్యూల్డ్ తేదీన మ్యాచ్ రద్దు కాగా రిజర్వ్ డేలో నిర్వహించారు. ఈ రోజు కూడా వరుణుడు ఆటంకం కలిగించడంతో 20 ఓవర్స్ ఫార్మాట్లో మ్యాచ్‌ను జరిపారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గ్లామోర్గన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. సామ్ నార్త్ఈస్ట్ అజేయ అర్ద సెంచరీతో (49 బంతుల్లో 63; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. బిల్లీ రూట్ (39), విలియమ్ స్మేల్ (28), వాన్ డెర్ గుగ్టెన్ (26 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సోమర్సెట్ బౌలర్లలో జార్జ్ థామస్, అల్ఫీ ఒగ్బోమ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. బెన్ గ్రీన్, అల్డ్రిడ్జ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సోమర్సెట్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేయగలిగింది. సోమర్సెట్ ఇన్నింగ్స్‌లో ఆండ్రూ ఉమీద్ (45), సీన్ డిక్సన్ (44), ఆర్చీ వాన్ (32 నాటౌట్) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. గ్లామోర్గన్ బౌలర్లలో ఆండీ గార్విన్, బెన్ కాల్లావే తలో రెండు వికెట్లు పడగొట్టగా.. డేనియల్ డౌట్వెయిట్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. రెండు నెలల పాటు సాగిన ఈ టోర్నీలో నిన్నటితో ముగిసింది. గ్లామోర్గన్ వన్డే కప్ టైటిల్ సాధించడం ఇది రెండో సారి. 2021 సీజన్లో ఈ జట్టు డర్హమ్‌పై విజయం సాధించి, తొలి టైటిల్ చేజిక్కించుకుంది. ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా లీసెస్టర్‌ఫైర్ ఉంది. చదవండి: రాణించిన గబ్బర్.. అయినా డీకే జట్టు చేతిలో ఓటమి -
టీ20 బ్లాస్ట్ విజేత గ్లోసెస్టర్‌షైర్
ఇంగ్లండ్ వేదికగా జరిగే వైటాలిటీ టీ20 బ్లాస్ట్ 2024 ఎడిషన్ టైటిల్‌ను గ్లోసెస్టర్‌షైర్ గెలుచుకుంది. నిన్న జరిగిన ఫైనల్లో గ్లోసెస్టర్‌షైర్ సోమర్సెట్ను 8 వికెట్ల తేడాతో ఓడించి విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సోమర్సెట్ 19.4 ఓవర్లలో 124 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది.డేవిడ్ పేన్, మ్యాట్ టేలర్ తలో మూడు, జోష్ షా రెండు వికెట్లు తీసి సోమర్సెట్ను దెబ్బకొట్టారు. ఒలివర్ ప్రైస్, టామ్ ప్రైస్ తలో వికెట్ దక్కించుకున్నారు. సోమర్సెట్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ లెవిస్ గ్రెగరీ ఒక్కడే అర్ద సెంచరీతో (53) రాణించాడు. కాడ్మోర్ (21), ఏబెల్ (19) రెండంకెల స్కోర్లు చేయగలిగారు.Maiden T20 Blast title for Gloucestershire🏆#ICYMI: Half-centuries from Cameron Bancroft and Miles Hammond powered Gloucestershire to their first T20 Blast title with a comfortable win over Somerset in Birmingham on Saturday. pic.twitter.com/Wsw9Qqsdkx— CricTracker (@Cricketracker) September 15, 2024అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గ్లోసెస్టర్‌షైర్.. 15 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి విజయతీరాలకు చేరింది. మైల్స్ హామండ్ (58 నాటౌట్), కెమరూన్ బాన్‌క్రాఫ్ట్ (53) తొలి వికెట్‌కు 112 పరుగులు జోడించి గ్లోసెస్టర్‌షైర్‌ను గెలిపించారు. జోష్ డేవి, జేక్ బాల్‌లకు తలో వికెట్ దక్కింది. టీ20 బ్లాస్ట్ టైటిల్‌ను గెలవడం గ్లోసెస్టర్‌షైర్‌కు ఇది మొదటిసారి. -
64 బంతుల్లోనే 135 రన్స్: 5 వికెట్లతో దుమ్ములేపిన లబుషేన్
Glamorgan vs Somerset: టీ20 బ్లాస్ట్ లీగ్-2024లో భాగంగా సోమర్‌సెట్‌తో మ్యాచ్‌లో గ్లామోర్గాన్ జట్టు దుమ్ములేపింది. సమిష్టి ప్రదర్శనతో ఏకంగా 120 పరుగుల తేడాతో సోమర్సెట్ను చిత్తు చేసింది.ఇంగ్లండ్‌కు చెందిన ఈ టీ20 లీగ్‌లో భాగంగా సౌత్ గ్రూపు జట్లు గ్లామోర్గాన్- సోమర్సెట్ శుక్రవారం రాత్రి తలపడ్డాయి. కార్డిఫ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గ్లామోర్గాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.64 బంతుల్లోనేఈ క్రమంలో కెప్టెన్, ఓపెనర్ కిరాన్ కార్ల్సన్ సంచలన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. కేవలం 64 బంతుల్లోనే 14 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 135 పరుగులు సాధించాడు.అతడి తోడుగా మరో ఓపెనర్ విలియమ్ స్మాలే(34 బంతుల్లో 59 రన్స్) కూడా దంచికొట్టాడు. వన్‌డౌన్ బ్యాటర్ ఇంగ్రామ్ 21, వికెట్ కీపర్ కూకీ 16 రన్స్‌తో ఫర్వాలేదనిపించగా.. బెన్ కెల్లావే 5 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయిన గ్లామోర్గాన్ 243 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన సోమర్సెట్కు గ్లామోర్గాన్ బౌలర్లు ఆది నుంచే చుక్కలు చూపించారు. 2.3 ఓవర్ల బౌలింగ్‌లోనే ఐదు వికెట్లువీరి దెబ్బకు సోమర్సెట్ కేవలం 123 పరుగులు మాత్రమే చేసి కుప్పకూలింది. 13.3 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. గ్లామోర్గాన్ బౌలర్లలో ఆస్ట్రేలియా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మార్నస్ లబుషేన్ సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.కేవలం 2.3 ఓవర్ల బౌలింగ్‌లోనే ఐదు వికెట్లు పడగొట్టాడు. 11 పరుగులు మాత్రమే ఇచ్చి సోమర్సెట్ లోయర్ ఆర్డర్‌ను కకావికలం చేశాడు. ఇక ఐదు వికెట్ల హాల్లో ఒక్కటి మినహా మిగిలిన నాలుగు ప్రత్యర్థి బ్యాటర్లను బౌల్డ్ చేయడం ద్వారా వచ్చిన వికెట్లే కావడం విశేషం.లబుషేన్ ఆకాశమే హద్దుగా చెలరేగుతూ వికెట్లు తీసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈ సీజన్లో సోమర్సెట్ ఇప్పటి వరకు 8 విజయాలతో సౌత్ గ్రూపులో మూడోస్థానంలో ఉండగా.. గ్లామోర్గాన్ విజయాల సంఖ్య తాజాగా ఆరుకు చేరుకుంది. ప్రస్తుతం ఈ జట్టు పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది.2003లో ఈ పొట్టి లీగ్ మొదలుకాగా టీ20 బ్లాస్ట్ లీగ్‌ను ఇంగ్లండ్- వేల్స్ క్రికెట్ బోర్డు 2003లో ఈ పొట్టి లీగ్‌ను మొదలుపెట్టింది. ఈ లీగ్‌లో 18 ఫస్ట్‌క్లాస్ క్రికెట్ దేశాలు పాల్గొంటాయి. వీటిని నార్త్, సౌత్ గ్రూపులుగా విభజిస్తారు. మే- సెప్టెంబరు మధ్య కాలంలో ఈ లీగ్‌ను నిర్వహిస్తారు. తాజా సీజన్ మే 30న మొదలైంది. సెప్టెంబరు 14న ఫైనల్ మ్యాచ్‌కు షెడ్యూల్ ఖరారైంది.నార్త్ గ్రూప్ జట్లుడెర్బీషైర్ ఫాల్కన్స్, దుర్హాం, లంకాషైర్ లైటెనింగ్, లీసెస్టర్‌షైర్ ఫాక్సెస్, నార్తాంప్టన్‌షైర్ స్టీల్‌బాక్స్, నాట్స్ అవుట్లాస్(నాటింగ్హాంషైర్), బర్మింగ్‌హాం బేర్స్(విర్విక్షైర్), వర్సెస్టైర్షైర్ ర్యాపిడ్స్, సార్క్షైర్ వికింగ్స్.సౌత్ గ్రూపు జట్లుఎసెక్స్ ఈగల్స్, గ్లామోర్గాన్, గ్లౌసెస్టర్షైర్, హాంప్‌షైర్, కెంట్ స్పిట్‌ఫైర్స్, మిడిల్సెక్స్, సోమర్సెట్, సర్రే, ససెక్స్ షార్క్స్.చదవండి: NCAకు వీవీఎస్ లక్ష్మణ్ గుడ్‌బై.. కొత్త హెడ్ అతడే! View this post on Instagram A post shared by FanCode (@fancode) -
విశాఖలో అమెరికా యుద్ధనౌక సోమర్సెట్..
-
USS Somerset Crew Photos: విశాఖలో అమెరికా నౌక (ఫొటోలు)
-
విశాఖ పర్యటనను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం
విశాఖపట్నం: టైగర్ ట్రయంఫ్లో భాగంగా తమ విశాఖపట్నం పర్యటనను, భారత నౌకాదళంతో సంయుక్తంగా జరిపిన విన్యాసాల గొప్ప అనుభవాన్ని తాము ప్పటికీ గుర్తుంచుకుంటామని యూఎస్ఎస్ సోమర్సెట్ నౌక సిబ్బంది పేర్కొన్నారు. విశాఖపట్నం పోర్టులో శనివారం మీడియాతో మాట్లాడారు. యూఎస్ఎస్ సోమర్సెట్ నౌక గురించి వివరించారు. డజన్ల కొద్దీ సైనిక వాహనాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఈ ఓడలో 1,000 మందికి పైగా నావికులు, మెరైన్లు ప్రయాణిస్తారని, పడవలను రిపేర్ చేసే వర్క్‌షాప్‌తో పాటు ఫ్లైట్ డెక్‌లో ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హెలికాప్టర్లు ల్యాండ్ అవుతాయని షిప్ పైలట్ ఆష్లే అంబుహెల్ తెలిపారు. “విశాఖపట్నంలో భారత నౌకాదళ సిబ్బందితో గడపడం ఆనందంగా ఉంది. మేము వారి నుండి చాలా నేర్చుకున్నాం. మంచి జ్ఞాపకాలు పొందాం” అని సోమర్సెట్లోని సర్ఫేస్ వార్ఫేర్ ఆఫీసర్ బ్రన్జిక్ చెప్పారు. -
ఫస్ట్–రేట్ రచయిత
సెకండ్–రేట్ రచయితల్లో తాను మొదటి వరుసలో ఉంటానని చెప్పుకొన్నాడట సోమర్సెట్ మామ్. ఆయన దృష్టిలో బాల్జాక్, డికెన్ ్స, టాల్‌స్టాయ్, దోస్తోవ్స్కీ ప్రపంచం చూసిన నలుగురు గొప్ప నవలాకారులు. పాఠకులను సాహిత్యం వైపు ఆకర్షించడమే కొందరు రచయితల విలువైన కాంట్రిబ్యూషన్ అవుతుంది. ఇక్కడ కూడా మామ్ మొదటి వరుసలో ఉంటారు. ఆంగ్ల అనువాద కథలతో పరిచయం ఉండే తెలుగు పాఠకులకు దాదాపుగా తగిలే మొదటిపేరు విలియమ్ సోమర్సెట్ మామ్. అత్యధిక కాపీల అమ్మకం, అత్యంత పేరు, అత్యధిక సంపాదనలతో చాలా విధాలుగా ఒక కమర్షియల్ రచయిత కూడా కలలు కనలేని జీవితాన్ని మామ్ అనుభవించాడు. హాలీవుడ్ సినిమాలకు పనిచేశాడు, దేశదేశాలు తిరిగాడు, అత్యంత ప్రముఖులతో విలాసవంతమైన టూర్లు, డిన్నర్లల్లో పాల్గొన్నాడు. తన గురించి మామ్ ఏమని చెప్పుకొన్నా, ఆయన ‘ద మూన్ అండ్ సిక్స్పెన్ ్స’, ‘ద పేంటెడ్ వీల్’, ‘కేక్స్ అండ్ ఎయిల్’, ‘ద రేజర్స్ ఎడ్జ్’ గొప్ప నవలలుగా పేరొందాయి. ఇక మామ్ మాస్టర్‌పీస్‌గా చెప్పే ‘ఆఫ్ హ్యూమన్ బాండేజ్’ ప్రపంచ గొప్ప నవలల్లో ఒకటిగా నిలిచిపోయింది. నూటికి పైగా కథలు, పదులకొద్దీ నాటకాలు, నవలలు... ఎంత విస్తృతంగా రాశాడో అంత ఆదరణ పొందిన మామ్‌కు ఇది నూటా యాభయ్యో జయంతి సంవత్సరం. మామ్ జీవితంలోనూ ఒక రచనకు కావాల్సినంత డ్రామా, కన్నీళ్లు, కష్టాలు, ట్విస్టులు ఉన్నాయి. గొప్ప ఆంగ్ల రచయితల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్న ఆయన ఆంగ్లాన్ని చిన్నతనంలో సాటి విద్యార్థులు హేళన చేసేవారు. కారణం, జన్మకు ఆంగ్లేయుడు అయినా, పుట్టింది ఫ్రెంచ్ గడ్డ మీద. అలా ఫ్రెంచ్ ఆయన మొదటి భాష అయింది. ఫ్రెంచ్ గడ్డ మీద పుట్టిన అందరూ ఫ్రెంచ్‌వాళ్లే అవుతారనీ, తప్పక మిలిటరీలో చేరాల్సిందేననీ శాసనం వచ్చినప్పుడు ఆ స్థానీయతను తప్పించుకోవడానికి మామ్ కుటుంబం ఫ్రాన్ ్సలోని బ్రిటిష్ దౌత్య కార్యాలయాన్ని ఆశ్రయించింది. అందులోనే మామ్‌కు జన్మనిచ్చింది(1874 జనవరి 25) వాళ్ల తల్లి. అలా బ్రిటన్ ఎంబసీలో జన్మించడం వల్ల మామ్ బ్రిటనీయత స్థిరపడిపోయింది. వాళ్ల గ్రేట్–అంకుల్ గుర్తుగా పెట్టిన సోమర్సెట్ అనే మధ్యపేరు ఆయనకు నచ్చలేదు. ఇంట్లో విల్లీ అని పిలిచేవాళ్లు. మామ్‌కు ఎనిమిదేళ్ల వయసున్నప్పుడే తల్లి క్షయవ్యాధితో చనిపోయింది. ఆ లోటు ఆయనకు ఎప్పుడూ తీరలేదు. ‘అది ఎప్పడూ పూర్తిగా మానని గాయం’గానే ఉండిపోయింది. వృద్ధుడయ్యాక కూడా తల్లి ఫొటోను మంచం పక్కనే ఉంచుకునేవాడు. ఆ తర్వాత రెండేళ్లకే తండ్రి చనిపోవడం మరో దెబ్బ. అప్పుడు బ్రిటన్ లోని చిన్నాన్న దగ్గరికి వచ్చాడు. ఆ కొత్త ఇల్లు, వాతావరణం బాగున్నప్పటికీ, తల్లిదండ్రులు లేని చింత, కొత్త సమాజంలో కలవలేకపోవడం, సిగ్గరి కావడం వంటి కారణాల వల్ల ఇట్టే మాట్లాడేవాడు కాదు. అది క్రమంగా నత్తిగా మారి జీవితాంతం ఆయనతో ఉండిపోయింది. తాత, తండ్రి న్యాయవాదులు అయినప్పటికీ మామ్ ఆ బాటలోకి పోకపోవడానికి ఈ నత్తి కూడా ఒక కారణం. డాక్టర్ కాబోయి యాక్టర్ అవడంలా కాకుండా, నిజంగానే డాక్టరీ చదివినా దాని జోలికి పోకుండా రంగస్థలంలో ప్రాక్టీస్ చేశాడు మామ్. నాటకాలతో ముందు ప్రజాదరణ పొందినా తర్వాత నవలలు, కథల మీద మాత్రమే దృష్టిసారించాలని నిశ్చయించుకున్నాడు. ఒక చదవదగ్గ కథకు మెటీరియల్ రాకపోతే తానెవరి సమక్షంలోనూ గంటసేపు కూడా గడపనని అనేవాడు. ఆయనకు ఏదైనా కథావస్తువే. దానికి తగినట్టే ఆయన జీవితం కూడా అనుభవాల పుట్ట. యువకుడిగా మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ సీక్రెట్ ఇంటెలిజెన్ ్స సర్వీస్ కోసం కొన్నాళ్లు స్విట్జర్లాండ్‌లో గూఢచారిగా పనిచేశాడు. ఫ్రెంచ్ నాటక రచయిత అన్నది అప్పుడు ఆయన కవర్. తర్వాత, రష్యాలోనూ బోల్షివిక్కులకు వ్యతిరేకంగా, జర్మన్ నిఘా నెట్వర్క్ మీద సమాచారాన్ని పంపాడు. మెన్షివిక్కులకు మద్దతు ఇవ్వాలన్నది బ్రిటన్ ఆలోచన. జర్మనీలో చదువుకున్నందువల్ల మామ్‌కు జర్మన్ వచ్చు. ఈసారి అమెరికా పబ్లిషర్ అనేది కవర్. అయితే ఈ అనుభవాలను రచనలుగా తెచ్చాడుగానీ అధికార రహస్యాల చట్టాన్ని ఇవి ఉల్లంఘిస్తుండటంతో చాలావాటిని కాల్చేశాడు. అయినా గూఢచర్య కథలు రాసిన తొలి గూఢచార రచయిత మామ్ అయ్యాడు. జేమ్స్ బాండ్ సిరీస్ రాయడానికి ఇయాన్ ఫ్లెమింగ్‌కు ప్రేరణగా నిలిచాడు. కానీ గూఢచర్యంలో పనిరోజులు ఒకేవిధంగా ఉండి విసుగు పుట్టిస్తాయనీ, చాలా రోజులు నిరర్థకమనీ వ్యాఖ్యానించాడు. ఇటీవల వచ్చిన మలయాళ సినిమా ‘కాదల్’లో హోమోసెక్సువల్ అయినప్పటికీ హీరోకు ఒక కూతురు ఉంటుంది. దాంపత్య బంధపు ఒత్తిడి అది. మామ్ కూడా లైంగిక ధోరణి రీత్యా హోమోసెక్సువల్. పదేళ్ల వివాహ బంధంతో ఆయనకు ఒక కూతురు. కానీ తర్వాత వివాహం నుంచి విముక్తం అయ్యి స్నేహితులతో స్వేచ్ఛాజీవితం గడిపాడు. తల్లి దూరమవడం మొదలు తన జీవితంలోని అపసవ్యతలన్నింటి కారణంగా, జీవితాంతం దేవుడి మీద అవిశ్వాసిగా ఉన్న మామ్ తన ఆత్మకథాత్మక నవలను చివరి దశలో చదువుకున్నా కన్నీళ్లు కార్చకుండా పూర్తిచేసేవాడు కాదు. ఇంకేది కలిపినా డిజైన్ పాడవుతుందని తెలిసినప్పుడు ఆర్టిస్ట్ ఇక దాన్ని వదిలేసినట్టుగా, తాను రచయితగా సంతృప్తికర దశలో ఉన్నప్పుడే జీవితాన్ని చాలించాలని మామ్ ఆశపడ్డాడు. అన్నింటి విషయంలో జరిగినట్టుగానే ప్రకృతికి ఆయన విషయంలో వేరే లెక్ఖుంది. కోరుకున్న ముప్పై సంవత్సరాల తర్వాత, అన్ని వృద్ధాప్యపు సమస్యలతో పాటు 91 ఏళ్ల నిండుతనం కూడా ఇచ్చిగానీ ఆయన్ని సాగనంపలేదు. -
టీ20 బ్లాస్ట్ 2023 విజేత సోమర్సెట్.. ఫైనల్లో ఎసెక్స్‌పై గెలుపు
2023 సీజన్ టీ20 బ్లాస్ట్ విజేతగా సోమర్సెట్ జట్టు నిలిచింది. నిన్న (జులై 15) జరిగిన ఫైనల్లో సోమర్సెట్.. ఎసెక్స్‌పై 14 పరుగుల తేడాతో గెలిచి, ఛాంపియన్‌గా అవతరించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సోమర్సెట్ నిర్ణీత ఓవర్లలో 145 పరుగులకు ఆలౌట్ కాగా.. స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేని ఎసెక్స్ 18.3 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. సోమర్సెట్ బౌలర్లు మ్యాట్ హెన్రీ (4/25), ఐష్ సోధి (3/22), లెవిస్ గ్రెగరీ (2/25), క్రెయిగ్ ఓవర్టన్ (1/30) ఎసెక్స్ పతనాన్ని శాశించారు. ఎసెక్స్ ఇన్నింగ్స్‌లో డేనియల్ సామ్స్ (45), ఆడమ్ రోసింగ్టన్ (19), డేనియల్ లారెన్స్ (16), పాల్ వాల్టర్ (26) రెండంకెల స్కోర్లు చేయగా, మిగతా వారంతా దారుణంగా విఫలమయ్యారు. అంతకుముందు సీన్ డిక్సన్ (53) రాణించడంతో సోమర్సెట్ నిర్ణీత ఓవర్లలో 145 పరుగులు చేసి ఆలౌటైంది. సోమర్సెట్ ఇన్నింగ్స్‌లో టామ్ బాంటన్ (20), కోహ్లెర్ క్యాడ్మోర్ (19), గ్రెగరీ (11) రెండంకెల స్కోర్లు చేశారు. ఎసెక్స్ బౌలర్లలో స్నేటర్, పాల్ వాల్టర్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. డేనియల్ సామ్స్, క్రిచ్లీ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
ఇరగదీస్తున్న సామ్ కర్రన్.. ఈసారి బంతితో విజృంభణ
టీ20 బ్లాస్ట్-2023లో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ ఇరగదీస్తున్నాడు. ఈ సీజన్లో పలు మ్యాచ్‌ల్లో బ్యాట్‌తో రాణించిన కర్రన్.. నిన్న (జూన్ 16) సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో బంతితో (4-0-26-5) చెలరేగాడు. ఫలితంగా అతను ప్రాతినిధ్యం వహించిన సర్రే టీమ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సర్రే.. విల్ జాక్స్ (60), ఆఖర్లో క్రిస్ జోర్డాన్ (12 బంతుల్లో 36 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. సోమర్సెట్ బౌలర్లలో బెన్ గ్రీన్ 4, డేవీ 3, మ్యాట్ హెన్రీ, వాన్ డెర్ మెర్వ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం బరిలోకి దిగిన సోమర్సెట్.. సామ్ కర్రన్ (5/26), క్రిస్ జోర్డాన్ (2/31), అట్కిన్సన్ (1/19) ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులకే పరిమితమై, ఓటమిపాలైంది. సోమర్ సెట్ ఇన్నింగ్స్‌లో టామ్ బాంటన్ (53), టామ్ అబెల్ (39) పర్వాలేదనిపించారు. ఐపీఎల్లో 18.50 కోట్లు పెడితే తేలిపోయాడు.. ఇక్కడేమో ఇరగదీస్తున్నాడు ఐపీఎల్ 2023లో సామ్ కర్రన్‌పై పంజాబ్ కింగ్స్ 18.50 కోట్ల పెట్టుబడి పెడితే, అందులో పావు భాగానికి కూడా న్యాయం చేయలేకపోయాడు. అక్కడ బ్యాట్‌తో బంతితో తేలిపోయిన కర్రన్ స్వదేశంలో జరిగే టీ20 బ్లాస్ట్‌లో మాత్రం రెండు విభాగాల్లోనూ ఇరగదీస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 9 మ్యచ్‌లు ఆడిన కర్రన్.. ఓ ఫైఫర్ సాయంతో 12 వికెట్లు పడగొట్టి, బ్యాటింగ్‌లో 3 అర్ధసెంచరీల సాయంతో 252 పరుగులు చేశాడు. ఈ లీగ్‌లో కర్రన్ చేసింది తక్కువ పరుగులే అయినా, పలు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. అలాగే కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి, తన జట్టు విజయాలకు దోహదపడ్డాడు. చదవండి: 546 పరుగులతో బంగ్లా గెలుపు.. 21వ శతాబ్దంలో అతిపెద్ద విజయం -
సిరాజ్‌కు ఐదు వికెట్లు.. అరంగేట్రం అదుర్స్
టీమిండియాకు దూరమైన మహ్మద్ సిరాజ్ కౌంటీల్లో వార్విక్షైర్ తరపున అరంగేట్రం చేశాడు. కాగా డెబ్యూ మ్యాచ్‌లోనే సిరాజ్ అదరగొట్టే ప్రదర్శన ఇచ్చాడు. సోమర్‌సెట్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సిరాజ్ ఐదు వికెట్లతో ఆకట్టుకున్నాడు. 24 ఓవర్లు వేసి 82 పరుగులిచ్చి ఐదు వికెట్ల ఫీట్ అందుకున్నాడు. కాగా సిరాజ్ దెబ్బకు సోమర్సెట్ 219 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన వార్విక్షైర్ 196 పరుగులకే కుప్పకూలింది. సిరాజ్ 21 పరుగులు చేసి బ్యాటింగ్‌లోనూ మెరిశాడు. ఇక రెండోరోజు ఆట ముగిసే సమయానికి సోమర్సెట్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 13 పరుగులు చేసింది. సిరాజ్ ఒక వికెట్ తీశాడు. -
తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు.. వీడియో వైరల్
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ టీమిండియా తరపున టెస్టుల్లో మాత్రమే ఆడుతున్నాడు. కొంతకాలంగా టెస్టులకు మాత్రమే పరిమితమైన సిరాజ్.. ప్రస్తుతం టీమిండియా పరిమిత ఓవర్ల ఆటలో బిజీగా ఉండడం.. టి20 జట్టులో చోటు లేకపోవడంతో అతను కౌంటీ క్రికెట్లో ఆడుతున్నాడు. కౌంటీల్లో వార్విక్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరాజ్ సోమర్‌సెట్‌తో మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. తొలిరోజు ఆటలో 19 ఓవర్లు వేసిన సిరాజ్ 54 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. అయితే పాకిస్తాన్ బ్యాటర్ ఇమాముల్ హక్‌ను సిరాజ్ ఔట్ చేసిన విధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్నింగ్స్ 10వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన సిరాజ్.. ఇమాముల్ హక్‌ను తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు. లెగ్ స్టంప్‌కు ఆవల ఊరిస్తూ వేసిన బంతిని ఇమాముల్ హక్ అంచనా వేయడంలో పొరబడ్డాడు. అంతే బ్యాట్ ఎడ్జ్‌కు తగిలిన బంతి కీపర్ చేతిలో పడింది. అంపైర్ సిగ్నల్ ఇవ్వకముందే సిరాజ్ సెలబ్రేషన్స్‌లో మునిగిపోగా.. బ్యాటర్ మాత్రం క్రీజులోనే ఉన్నాడు. అయితే అంపైర్ కూడా ఓట్ సిగ్నల్ ఇవ్వడంతో చేసేదేం లేక ఇమాముల్ హక్ నిరాశగా పెవిలియన్ చేరాడు. కాగా పాక్ తరపున 16 టెస్టులు, 54 వన్డేలు, రెండు టి20లు ఆడిన ఇమాముల్ ఫామ్ కోల్పోవడంతో జట్టుకు దూరమయ్యాడు. ఇక సిరాజ్ నాలుగు వికెట్లతో చెలరేగడంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి సోమర్సెట్ 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. View this post on Instagram A post shared by County Championship (@countychampionship) చదవండి: Shane Warne: 'భౌతికంగా మాత్రమే దూరం'.. హ్యాపీ బర్త్‌డే సౌతాఫ్రికా క్రికెట్‌కు భారీ షాక్ -
క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సోమర్సెట్ లెజెండ్!
వెటరన్ ఇంగ్లీష్ బ్యాటర్, సోమర్సెట్ లెజెండ్ జేమ్స్ హిల్డ్రెత్ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గురువారం రిటైర్మెంట్ ప్రకటించాడు. 2022 కౌంటీ సీజన్‌తో తన కాంట్రాక్ట్ గడువు ముగియనుండడంతో హిల్డ్రెత్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. 37 ఏళ్ల హిల్డ్రెత్ 2003లో సోమర్సెట్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. 16 ఏళ్ల వయస్సులోనే హిల్డ్రెత్ సోమర్సెట్ క్లబ్లో చేరాడు. అతడు దాదాపు 20 ఏళ్ల పాటు సోమర్సెట్ క్రికెట్‌కు తన సేవలు అందించాడు. తన కెరీర్లో సోమర్సెట్ తరపున 713 మ్యాచ్‌లు ఆడిన హిల్డ్రెత్.. 27000 పైగా పరుగులు సాధించాడు. టీ20 బ్లాస్ట్-2005 టోర్నీను సోమర్సెట్ కైవసం చేసుకోవడంలో హిల్డ్రెత్ కీలక పాత్ర పోషించాడు. అదే విధంగా 2019 రాయల్ లండన్ వన్డే ప్రపంచకప్‌ను కూడా సోమర్సెట్ సొంతం చేసుకోవడంలోనూ హిల్డ్రెత్ తన వంతు కృషి చేశాడు. అయితే అతడు కెరీర్లో ఇప్పటి వరకు సోమర్సెట్ కౌంటీ ఛాంపియన్షిప్ టైటిల్ మాత్రం సాధించలేకపోయింది. ఇక ఇప్పటి వరకు సోమర్సెట్ తరపున దేశీవాళీ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా హిల్డ్రెత్ నిలిచాడు. చదవండి: ముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్! -
విజయానికి 9 పరుగులు.. కనివినీ ఎరుగని హైడ్రామా
ఆఖరి ఓవర్లో విజయానికి 9 పరుగులు.. చేతిలో ఆరు వికెట్లు.. ఈ దశలో ఎవరైనా సరే ఈజీగా విజయం సాధిస్తుందని అనుకుంటారు. కానీ ఇది టి20 మ్యాచ్. మరుక్షణం ఏం జరుగుతుందన్నది ఎవరు ఊహించలేరు. ఒక బంతికి రన్ తీస్తే.. మరుసటి బంతికి వికెట్ పడడం.. ఆ తర్వాత బౌండరీ.. మరోసారి వికెట్.. ఇలా ఆఖరి ఓవర్ ఒక థ్రిల్లర్‌ను తలపించింది. ఈ ఘటన విటాలిటీ టి20 బ్లాస్ట్‌లో సోమర్సెట్, సర్రీ మధ్య మ్యాచ్‌లో చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన సోమర్సెట్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. టామ్ బాండన్ 39, గోల్డ్‌వార్తి 27, లామోన్బీ 21 పరుగులు చేశారు. అనంతరం 145 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సర్రీ ఇన్నింగ్స్ 19వ ఓవర్ వరకు సజావుగానే సాగింది. 19 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. ఇక ఆఖరి ఓవర్లో విజయానికి 9 పరుగులు అవసరమయ్యాయి. పీటర్ సిడిల్ వేసిన ఆఖరి ఓవర్లో తొలి బంతికి సింగిల్ వచ్చింది. రెండో బంతికి 14 పరుగులు చేసిన జోర్డాన్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఇక క్రీజులోకి వచ్చిన నికో రీఫర్ మూడో బంతిని బౌండరీ తరలించాడు. విజయానికి మూడు బంతుల్లో నాలుగు పరుగులు అవసరమైన దశలో రెండు వరుస బంతుల్లో సర్రీ రెండు వికెట్లు కోల్పోయింది. ఇక ఆఖరి బంతికి ఫోర్ అవసరం కాగా.. కాన్ మెకర్ బౌండరీ కొట్టి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అలా కనివినీ ఎరుగని హైడ్రామాలో సర్రీ విజేతగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 9️⃣ runs to win from the final over... What happens next is just 🤯#Blast22 pic.twitter.com/PMI0HXMdw9 — Vitality Blast (@VitalityBlast) June 21, 2022 చదవండి: కరోనా బారిన పడ్డా.. కోహ్లి చేసింది కరెక్టేనా! -
భారీ సిక్సర్.. బర్గర్ వ్యాన్‌లోకి దూసుకెళ్లిన బంతి
టి20 క్రికెట్ అంటేనే హిట్టింగ్‌కు మారుపేరు. క్రీజులో ఉన్నంతసేపు బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లు బాదడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. పనిలో పనిగా బ్యాటర్లు కొట్టే సిక్సర్లు ఒకసారి స్టేడియం అవతల పడితే.. మరికొన్ని సార్లు మ్యాచ్ చూడడానికి వచ్చే ప్రేక్షకుల తలల పగిలేలా చేశాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిక్సర్ మాత్రం కాస్త విచిత్ర పద్దతిలో వెళ్లింది. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టి20 బ్లాస్ట్ టోర్నమెంట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్లో బ్యాట్స్మెన్లు అవలీలగా భారీ సిక్సర్లు బాదుతున్నారు. తాజాగా మే 30న హాంప్‌షైర్, సోమర్సెట్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. హాంప్‌షైర్ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో జేమ్స్ ఫుల్లర్ వాండర్‌మెర్వ్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ మీదుగా కళ్లు చెదిరే సిక్స్ కొట్టాడు. భారీ ఎత్తులో వెళ్లిన సిక్స్ నేరుగా స్టాండ్స్‌లో బర్గర్ వ్యాన్‌లోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ ప్రేక్షకులు ఎక్కువ లేకపోవడంతో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. కాగా బర్గర్ సర్వ్ చేస్తున్న వ్యక్తి వ్యాన్‌లోకి దూసుకొచ్చిన బంతిని చేతిలోకి తీసుకొని ఒక స్టిల్ ఇవ్వడం మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే జేమ్స్ ఫుల్లర్ 42 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికి హాంప్‌షైర్ 123 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేసిన సోమర్సెట్ 25 బంతులు మిగిలిఉండగానే ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. చదవండి: 'అవమానాలు తట్టుకుని నా భర్త విజయం సాధించాడు.. అందుకే' ఐదేళ్ల స్నేహం! వివాహ బంధంతో ఒక్కటైన ఇంగ్లండ్ మహిళా క్రికెటర్లు James Fuller gets hold of this 😳@James_Fuller246 | @hantscricket | #Blast22 pic.twitter.com/jB2ke5mRuT — Vitality Blast (@VitalityBlast) May 31, 2022 Guess which player hit the match ball into a burger van at the Ageas Bowl tonight? 😆#Blast22 pic.twitter.com/YXBICflW3J — Vitality Blast (@VitalityBlast) May 30, 2022 -
చేదు అనుభవం.. తన గోతిని తానే తవ్వుకున్నాడు
''తన గోతిని తానే తవ్వుకున్నాడు'' అనే సామెత చాలాసార్లే వినుంటారు. తాజాగా ఈ సామెత మనం చెప్పుకోబోయే బ్యాటర్‌కు సరిగ్గా వర్తిస్తుంది. కౌంటీ చాంపియన్‌షిప్‌లో భాగంగా సోమర్సెట్, హాంప్‌షైర్ మధ్య మ్యాచ్ జరిగింది. హాంప్‌షైర్ బౌలర్ మమ్మద్ అబ్బాస్ సోమర్సెట్ ఇన్నింగ్స్ 25వ ఓవర్ వేశాడు. ఆ ఓవర్లో ఒక బంతిని అబ్బాస్ గుడ్ లెంగ్త్‌తో ఆఫ్‌స్టంప్ ఔట్‌సైడ్ దిశగా వేశాడు. క్రీజులో ఉన్న బ్యాటర్ టామ్ ఎబెల్ బంతిని డిఫెన్స్ చేద్దామనే ప్రయత్నం చేశాడు. అయితే బంతి రోల్ అయి వికెట్ల వైపు వెళ్లడం చూసి దానిని అడ్డుకునే ప్రయత్నంలో తన కాలితో బంతిని తన్నడం.. అది వికెట్లను గిరాటేయడం జరిగిపోయాయి. ఇంకేముంది ఒక రకంగా తనకు తానుగా ఔట్ అయిన టామ్ ఎబెల్.. అనవసరంగా బౌలర్‌కు వికెట్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సోమర్సెట్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. తొలిరోజే 211 పరుగులకే ఆలౌట్ అయిన సోమర్సెట్ ఇన్నింగ్స్‌లో క్రెయిగ్ ఓవర్టన్(44) టాప్ స్కోరర్. హాంప్‌షైర్ బౌలర్లలో సీన్ అబాట్ మూడు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ అబ్బాస్, హాలండ్, జేమ్స్ పుల్లర్ తలా రెండు వికెట్లు తీశారు. చదవండి: Ravichandran Ashwin: 'రాసిపెట్టుకోండి.. రాజస్తాన్ కప్ కొట్టబోతుంది..' This sport is crap pic.twitter.com/kgqrKwm134 — Alasdair 🇳🇦 (@kohli_fraud) May 19, 2022 -
బౌండరీ లోపలే క్యాచ్ పట్టాడు.. అయినా సిక్స్ ఇచ్చారు
లండన్: విటాలిటీ బ్లాస్ట్ క్రికెట్లో భాగంగా సోమర్సెట్, కెంట్ మధ్య జరిగిన టి20 ఫైనల్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌లో సోమర్సెట్ బ్యాట్స్‌మన్ డీప్ స్వేర్‌లెగ్ దిశగా భారీ షాట్ ఆడాడు.కెంట్ ఫీల్డర్లు జోర్డాన్ కాక్స్, డేనియల్ బెల్లు మిస్ కమ్యునికేషన్ వల్ల క్యాచ్ తీసుకునేందుకు పరిగెత్తుకు వచ్చారు. కాక్స్ క్యాచ్ పట్టాడు.. అయితే బెల్ అప్పటికే బౌండరీ లైన్‌ను తాకుతూ వెళ్లాడు.. అతనితో కాక్స్ కూడా తగిలాడు. దీంతో ఫీల్డ్ అంపైర్స్ తమ నిర్ణయంపై క్లారిటీ లేక థర్డ్ అంపైర్‌ను ఆశ్రయించారు. ఈ విషయంలో థర్డ్ అంపైర్ బ్యాట్స్‌మన్‌కు అనుకూలంగా వ్యవహరించాడు. అతను ఔట్ కాదంటూ సిక్స్ ఇచ్చేశాడు. క్లుప్తంగా ఇది జరిగింది. చదవండి: ఇకపై బ్యాట్స్‌మన్ కాదు.. బ్యాటర్.. క్రికెట్ రూల్స్‌లో కీలక మార్పు ఇక ఒక బ్యాట్స్‌మన్ కొట్టిన బంతిని ఫీల్డర్ బౌండరీ రోప్‌కు తాకుకుండా పట్టకుంటే క్లియర్ అవుట్ అని అందరికి తెలిసిందే. ఒకవేళ బౌండరీ రోప్ తాకితే ఔట్ ఇవ్వకుండా సిక్సర్ ఇవ్వడం క్రికెట్ పుస్తకాల్లో ఆనవాయితీ. మరి ఒక ఫీల్డర్ సేఫ్‌గా క్యాచ్ పట్టినప్పటికి మరో ఫీల్డర్ వచ్చి బౌండరీ లైన్ తాకడం.. అదే సమయంలో క్యాచ్ పట్టిన ఆటగాడిని ముట్టుకుంటే ఔట్ ఇస్తారా లేక బౌండరీ ఇస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అభిమానులు కామెంట్స్ చేశారు. అది కచ్చితంగా ఔటేనని కొందరు అభిప్రాయపడితే.. కాదు అని మరికొందరు అడ్డు తగిలారు. చదవండి: IPL 2021: మాతో టెస్టు రద్దు చేసుకున్నారు.. ఐపీఎల్ కూడా రద్దు చేస్తారా! క్రికెట్ పుస్తకాల్లో.. 19.5.1 లా ప్రకారం ఒక ఫీల్డర్ బౌండరీ లైన్ వద్ద క్యాచ్ అందుకునే క్రమంలో మరో ఫీల్డర్‌కు అనుకోకుండా తగిలితే బ్యాట్స్‌మన్‌ను ఔట్‌గానే పరిగణిస్తారు.. కానీ ఆ నిర్ణయం ఫీల్డ్ అంపైర్‌పై ఆధారపడి ఉంటుంది. నిజానికి ఇక్కడ ఇద్దరు కావాలని తగిలినట్లు ఎక్కడా కనిపించలేదు. అయితే ఇక్కడ ఫీల్డ్ అంపైర్ నిర్ణయం తీసుకోకుండా థర్డ్ అంపైర్‌ను ఆశ్రయించాడు. థర్డ్ అంపైర్ ఏ నిర్ణయం ఇచ్చినా ఫీల్డ్ అంపైర్ పాటించాలా వద్దా అన్నది అతనిపైనే ఆధారపడి ఉంటుంది. ఇక మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ నిర్ణయమే తన నిర్ణయమని ఫీల్డ్ అంపైర్ అనుకున్నాడు. అందుకే సోమర్సెట్ జట్టు బ్యాట్స్‌మన్ ఔట్ కాలేదు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కెంట్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. అనంతరం సోమర్సెట్ 20 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటై 25 పరుగులతో పరాజయం పాలైంది. Out or not? 🤔#Blast21 #FinalsDay pic.twitter.com/J8luyZMV6o — Vitality Blast (@VitalityBlast) September 18, 2021 -
చెలరేగిన అశ్విన్.. 69 పరుగులకే ప్రత్యర్ధి ఆలౌట్
లండన్: ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2021 ఫైనల్లో తేలిపోయిన టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఇంగ్లండ్ గడ్డపై సత్తాచాటాడు. ప్రస్తుతం కౌంటీ క్రికెట్లో సర్రే తరఫున ఆడుతున్న అశ్విన్ ఒకే ఇన్నింగ్స్‌లో 6 వికెట్లతో చెలరేగాడు. సోమర్‌సెట్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లు వేసిన యాష్.. 6 వికెట్లు తీసి ప్రత్యర్ధి నడ్డి విరిచాడు. అశ్విన్‌కి మరో స్పిన్నర్ డేనియల్ మోరియార్టీ (4 వికెట్లు) తోడవ్వడంతో సోమర్సెట్ 69 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్ ధాటికి ముగ్గురు బ్యాట్స్‌మన్ మాత్రమే రెండంకెల స్కోర్ సాధించగా, జె హిల్డ్రెత్ (14) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే, జులై 11న (ఆదివారం) మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సోమర్సెట్, తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. హిల్డ్రెత్(107) శతకానికి మరో అయిదుగురు ఆటగాళ్లు 40లు సాధించడంతో సోమర్సెట్ తొలి ఇన్నింగ్స్‌లో 429 పరుగులకు ఆలౌటైంది. సర్రే బౌలర్లు జోర్డాన్ క్లార్క్, అమర్ విర్ధి చెరో 3 వికెట్లు పడగొట్టగా, డేనియల్ మోరియార్టీ 2, అశ్విన్, ఆర్ క్లార్క్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సర్రే జట్టులో ఓపెనర్లు రోరీ బర్న్స్(50), స్టోన్మెన్(67) మాత్రమే రాణించడంతో కేవలం 240 పరుగులకే ఆలౌటైంది. సోమర్సెట్ బౌలర్లు జాక్ లీచ్ 6, వాన్ డెర్ మెర్వే 4 వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన సోమర్సెట్కు స్పిన్నర్లు అశ్విన్(6), మోరియార్టీ(4) చుక్కలు చూపించారు. వీరి ధాటికి సోమర్సెట్ రెండో ఇన్నింగ్స్‌లో 69 పరుగులకే చాపచుట్టేసింది. అనంతరం 259 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సర్రే జట్టు కడపటి వార్తలందేసరికి 3 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. క్రీజ్‌లో హషీమ్ ఆమ్లా(24), జేమీ స్మిత్(26) ఉన్నారు. సర్రే గెలుపునకు మరో 178 పరుగుల అవసరం ఉంది. కాగా, ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ముగిశాక టీమిండియా ఆటగాళ్లకు మూడు వారాల విరామం దొరకడంతో వారంతా కుటుంబాలతో కలిసి విహార యాత్రలో ఉన్నారు. అశ్విన్‌కు మాత్రం అనుకోకుండా కౌంటీ జట్టు సర్రే నుంచి ఆహ్వానం అందిండంతో ఆయన వెంటనే జట్టుతో చేరాడు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీసుకు ముందు ఈ కౌంటీ మ్యాచ్ ద్వారా మంచి ప్రాక్టీస్ దొరుకుతుందని భావించిన యాష్.. వెంటనే సర్రే జట్టు ఆహ్వానాన్ని అంగీకరించాడు. -
టీమిండియా స్పిన్నర్ అరుదైన ఘనత.. 11 ఏళ్ల తర్వాత మళ్లీ అలా..
లండన్: టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. 11 ఏళ్ల తర్వాత కౌంటీ క్రికెట్లో తొలి ఓవర్ వేసిన స్పిన్నర్‌గా రికార్డు నెలకొల్పాడు. 2010లో న్యూజిలాండ్ స్పిన్నర్ జీతన్ పటేల్ ఆరంభ ఓవర్ వేయగా.. మళ్లీ ఇన్నాళ్లకు అశ్విన్ ఇన్నింగ్స్ తొలి బంతిని వేశాడు. ఆదివారం సోమర్‌సెట్‌తో జరిగిన కౌంటీ మ్యాచ్‌లో సర్రే తరఫున బరిలోకి దిగిన అశ్విన్.. ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేశాడు. పిచ్ మందకొడిగా ఉండటంతో సర్రే కెప్టెన్ రోరీ బర్న్స్ కొత్త బంతిని అశ్విన్‌కు అప్పజెప్పాడు. తొలిరోజు 28 ఓవర్లు వేసిన అశ్విన్.. 70 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో అశ్విన్ ఎక్కువగా వైవిధ్యం ప్రదర్శించలేదు. పిచ్‌ను దృష్టిలో ఉంచుకొని ఒకే ప్రాంతంలో నిలకడగా బంతులు విసిరి బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తెచ్చాడు. మ్యాచ్ సాగుతున్న కొద్ది బంతి ఎక్కువగా టర్న్ కాకపోవడంతో అశ్విన్ తెలివిగా బౌలింగ్ చేశాడు. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి సోమర్సెట్ 98 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 280 పరుగులు స్కోర్ చేసింది. ఇదిలా ఉంటే, టీమిండియా ఇదే మైదానంలో ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు ఆడనుంది. కాగా, ప్రస్తుతం టీమిండియా సభ్యులకు విరామం దొరకడంతో ఇంగ్లండ్ పరిసరాల్లో కుటుంబ సభ్యులతో పాటు పర్యటిస్తున్నారు. ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ముగిశాక భారత ఆటగాళ్లకు మూడు వారాల విరామం దొరికింది. ఈ మధ్యలో యాష్‌కు అనుకోకుండా సర్రే జట్టు నుంచి ఆహ్వానం అందింది. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీసుకు ఈ కౌంటీ మ్యాచ్ ద్వారా మంచి ప్రాక్టీస్ దొరుకుతుందని భావించిన యాష్.. వెంటనే సర్రే జట్టు ఆహ్వానాన్ని అంగీకరించాడు. కాగా, యాష్‌కు గతంలో నాటింగ్హమ్షైర్, వొర్సెస్టర్‌షైర్ కౌంటీలకు ఆడిన అనుభవం ఉంది. -
ఇది కదా అసలు టెస్టు మజా!
టెస్టు మ్యాచ్ అంటే ఐదు రోజుల్లో ఏమైనా జరుగొచ్చు. ఒక్క సెషన్ చాలు మ్యాచ్ మలుపు తిరగడానికి. ఈ మధ్య కాలంలో అసలుసిసలు టెస్టు మ్యాచ్ మజా లేక క్రికెట్ అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. ఇలాంటి తరుణంలో కౌంటీ క్రికెట్లో అసలు టెస్టు పసందు అభిమానులకు లభించింది. కౌంటీ చాంపియన్ షిప్లో గత 15ఏళ్లుగా ఇలాంటి ఉత్కంఠకరమైన మ్యాచ్‌ను చూడలేదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. సోమర్ సెట్, ల్యాంక్‌షైర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చూసి ఇది కదా అసలు టెస్టు మజా అనుకొని అభిమాని ఉండడు. ఇరుజట్ల మధ్య విజయం దోబూచులాడగా.. చివరికి మ్యాచ్ టైగా ముగిసింది. ల్యాంక్‌షైర్ జట్టు స్పిన్నర్ కేశవ్ మహారాజ్(7/37) అదరగొట్టినా.. జట్టుకు విజయాన్నందించలేదు. 78 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సోమర్ సెట్ పరిస్థితి చావు తప్పి కన్ను లొట్ట పోయినట్టయింది. మహారాజ్ దాటికి ఎనిమిది మంది బ్యాట్‌మెన్ సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. దీంతో సోమర్సెట్ జట్టు ఓటమి గండం నుంచి బయటపడి టైతో మ్యాచ్‌ను ముగించింది. ల్యాంక్‌షైర్ : తొలి ఇన్నింగ్స్ 99 & రెండో ఇన్నింగ్స్ 170 సోమర్ సెట్: తొలి ఇన్నింగ్స్ 192 & రెండో ఇన్నింగ్స్ 77 78 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనలో సోమర్ సెట్ బ్యాటింగ్ పరిస్థితి చూస్తే.. 5-1 (3.1 ఓవర్) 5-2 (3.2) 12-3 ( 4.5) 20-4 (6.1) 23-5 (7.6) 37-6 (12.6) 56-7 (20.5) 64-8 (22.2) 77-9 (24.6) 77 ఆలౌట్ (26.4) -
టీచర్ల వీరంగన్
‘‘చిన్నవాడి చేతిలోన గన్ను... పేలినదా చంపేను నన్ను’’ అంటూ ఆ స్కూలు స్కూలంతా గజగజ వణికిపోయింది. ఇంగ్లండ్‌లోని సోమర్సెట్, ఫ్రోమ్ ప్రాంతంలో ఉన్న సెల్‌వుడ్ అకాడమీ స్కూల్ చాలా స్ట్రిక్ట్ రూల్స్‌తో నడుస్తుంది. ఆ స్కూల్లో జేడాన్ అనే పదేళ్ల కుర్రాడు చదువుతున్నాడు. గత 27న ఆ కుర్రాడు తరగతి గదిలోకి చేతిలో తుపాకీతో ప్రవేశించాడు. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో టీనేజర్లు పిస్తోలుతో వీరంగాలు వేసి, సంచలనం సృష్టించిన నేపథ్యంలో జేడాన్ చేతిలో తుపాకీ చూసిన సెల్‌వుడ్ స్కూల్ టీచర్లు చలి జ్వరం వచ్చినట్టు వణికిపోయారు. ముగ్గురు టీచర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పాఠశాల నుంచి జేడాన్ని సస్పెండ్ చేసేశారు. పోలీసు అధికారులు జేడాన్ ఇంటికి వచ్చి మరీ కౌన్సిలింగ్ నిర్వహించారు. మార్చి 9 దాకా జేడాన్ ఇల్లు విడిచి బయటకు వెళ్లకూడదని ఓ రకంగా హౌజ్ అరెస్ట్ చేశారు. ఈ ఉదంతంతో జేడాన్ తల్లి నటాషా డిప్రెషన్లోకి వెళ్లి మంచమెక్కింది. ఇంతా చేస్తే జేడాన్ తీసుకెళ్లింది బొమ్మ తుపాకీయే. ఈ విషయాన్ని చెప్పిన జేడాన్ సవతి తండ్రి... ‘‘పెద్దగా శబ్దం కూడా చేయని ప్లాస్టిక్ తుపాకీని కారణంగా చూపి ఇంటికి పోలీసులు రావడం, మా అబ్బాయికి కాల్పుల మీద క్లాస్ తీసుకోవడం, స్కూల్ నుంచి సస్పెండ్ చేయడం న్యాయం కాదని, వెంటనే సస్పెన్షన్ ఎత్తేయాలని’’ వేడుకుంటున్నాడు. జేడాన్ గతంలో మంచి ప్రవర్తనకు గాను అవార్డు కూడా అందుకున్నాడని గుర్తు చేస్తున్నాడు. సత్యవర్షి