చేదు అనుభవం.. తన గోతిని తానే తవ్వుకున్నాడు | Pakistan Bowler Gets Wicket Batter Mistakenly Kicks-Ball Back Stumps | Sakshi
Sakshi News home page

County Championsip: చేదు అనుభవం.. తన గోతిని తానే తవ్వుకున్నాడు

Published Sat, May 21 2022 9:04 AM | Last Updated on Sat, May 21 2022 9:22 AM

Pakistan Bowler Gets Wicket Batter Mistakenly Kicks-Ball Back Stumps - Sakshi

''తన గోతిని తానే తవ్వుకున్నాడు'' అనే సామెత చాలాసార్లే వినుంటారు. తాజాగా ఈ సామెత మనం చెప్పుకోబోయే బ్యాటర్‌కు సరిగ్గా వర్తిస్తుంది. కౌంటీ చాంపియన్‌షిప్‌లో భాగంగా సోమర్‌సెట్‌, హాంప్‌షైర్ మధ్య మ్యాచ్‌ జరిగింది. హాంప్‌షైర్‌ బౌలర్‌ మమ్మద్‌ అబ్బాస్‌ సోమర్‌సెట్‌ ఇన్నింగ్స్‌ 25వ ఓవర్‌ వేశాడు. ఆ ఓవర్‌లో ఒక బంతిని అబ్బాస్‌ గుడ్‌ లెంగ్త్‌తో ఆఫ్‌స్టంప్‌ ఔట్‌సైడ్‌ దిశగా వేశాడు.

క్రీజులో ఉన్న బ్యాటర్‌ టామ్‌ ఎబెల్‌ బంతిని డిఫెన్స్‌ చేద్దామనే ప్రయత్నం చేశాడు. అయితే బంతి రోల్‌ అయి వికెట్ల వైపు వెళ్లడం చూసి దానిని అడ్డుకునే ప్రయత్నంలో తన కాలితో బంతిని తన్నడం.. అది వికెట్లను గిరాటేయడం జరిగిపోయాయి. ఇంకేముంది ఒక రకంగా తనకు తానుగా ఔట్‌ అయిన టామ్‌ ఎబెల్‌.. అనవసరంగా బౌలర్‌కు వికెట్‌ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియలో వైరల్‌గా మారింది. 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సోమర్‌సెట్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. తొలిరోజే 211 పరుగులకే ఆలౌట్‌ అయిన సోమర్‌సెట్‌ ఇన్నింగ్స్‌లో క్రెయిగ్‌ ఓవర్టన్‌(44) టాప్‌ స్కోరర్‌. హాంప్‌షైర్‌ బౌలర్లలో సీన్‌ అబాట్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్‌ అబ్బాస్‌, హాలండ్‌, జేమ్స్‌ పుల్లర్‌ తలా రెండు వికెట్లు తీశారు.

చదవండి: Ravichandran Ashwin: 'రాసిపెట్టుకోండి.. రాజస్తాన్‌ కప్‌ కొట్టబోతుంది..'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement