T20 Blast 2022: Batter Smacks Six That Lands Into-Burger Van Viral - Sakshi
Sakshi News home page

T20 Blast 2022: భారీ సిక్సర్‌.. బర్గర్‌ వ్యాన్‌లోకి దూసుకెళ్లిన బంతి

Published Tue, May 31 2022 6:20 PM | Last Updated on Tue, May 31 2022 7:05 PM

T20 Blast Tourney: Batter Smacks Six That Lands Into-Burger Van Viral - Sakshi

టి20 క్రికెట్‌ అంటేనే హిట్టింగ్‌కు మారుపేరు. క్రీజులో ఉన్నంతసేపు బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లు బాదడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. పనిలో పనిగా బ్యాటర్లు కొట్టే సిక్సర్లు ఒకసారి స్టేడియం అవతల పడితే.. మరికొన్ని సార్లు మ్యాచ్‌ చూడడానికి వచ్చే ప్రేక్షకుల తలల పగిలేలా చేశాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిక్సర్‌ మాత్రం కాస్త విచిత్ర పద్దతిలో వెళ్లింది.

ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న టి20 బ్లాస్ట్‌ టోర్నమెంట్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్‌లో బ్యాట్స్‌మెన్లు అవలీలగా భారీ సిక్సర్లు బాదుతున్నారు. తాజాగా మే 30న హాంప్‌షైర్‌, సోమర్‌సెట్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. హాంప్‌షైర్‌ ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌లో జేమ్స్‌ ఫుల్లర్‌ వాండర్‌మెర్వ్‌ బౌలింగ్‌లో మిడ్‌ వికెట్‌ మీదుగా కళ్లు చెదిరే సిక్స్‌ కొట్టాడు. భారీ ఎత్తులో వెళ్లిన సిక్స్‌ నేరుగా స్టాండ్స్‌లో బర్గర్‌ వ్యాన్‌లోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ ప్రేక్షకులు ఎక్కువ లేకపోవడంతో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.

కాగా బర్గర్‌ సర్వ్‌ చేస్తున్న వ్యక్తి వ్యాన్‌లోకి దూసుకొచ్చిన బంతిని చేతిలోకి తీసుకొని ఒక స్టిల్‌ ఇవ్వడం మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే జేమ్స్‌ ఫుల్లర్‌ 42 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌ ఆడినప్పటికి హాంప్‌షైర్‌ 123 పరుగులకే ఆలౌట్‌ అయింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన సోమర్‌సెట్‌ 25 బంతులు మిగిలిఉండగానే ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.  

చదవండి: 'అవమానాలు తట్టుకుని నా భర్త విజయం సాధించాడు.. అందుకే'

ఐదేళ్ల స్నేహం! వివాహ బంధంతో ఒక్కటైన ఇంగ్లండ్‌ మహిళా క్రికెటర్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement