
ఇటీవల ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన భారత క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు వచ్చే నెలలో అమెరికాలో జరిగే మేజర్ లీగ్ క్రికెట్ టి20 టోర్నమెంట్‌లో బరిలోకి దిగనున్నాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాయుడు మేజర్ లీగ్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఐపీఎల్‌లోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యానిదే టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టు.
జూలై 13 నుంచి 30 వరకు జరిగే మేజర్ లీగ్ టోర్నీలో ముంబై ఇండియన్స్ న్యూయార్క్ జట్టు, లాస్ ఏంజెలిస్ నైట్‌రైడర్స్, సియాటెల్ ఒర్కాస్, వాషింగ్టన్ ఫ్రీడమ్, శాన్‌ఫ్రాన్సిస్కో యునికార్న్ జట్లు కూడా పోటీపడనున్నాయి. ఇక ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న అంబటి రాయుడు 204 మ్యాచ్‌ల్లో 4238 పరుగులు చేశాడు.
చదవండి: వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కకపోవడంపై అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment