యూఎస్‌ఏతో టీ20.. నెదర్లాండ్స్‌ భారీ స్కోర్‌ | Netherlands Scored 217 Runs Vs USA In Tri Series | Sakshi
Sakshi News home page

యూఎస్‌ఏతో టీ20.. నెదర్లాండ్స్‌ భారీ స్కోర్‌

Published Sun, Aug 25 2024 9:15 PM | Last Updated on Mon, Aug 26 2024 9:03 AM

Netherlands Scored 217 Runs Vs USA In Tri Series

నెదర్లాండ్స్‌ ముక్కోణపు టోర్నీలో భాగంగా యూఎస్‌ఏతో ఇవాళ (ఆగస్ట్‌ 25) జరుగుతున్న మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ భారీ స్కోర్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన డచ్‌ టీమ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. 

మైఖేల్‌ లెవిట్‌ (34 బంతుల్లో 68; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ (40 బంతుల్లో 81 నాటౌట్‌; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్దసెంచరీలతో చెలరేగారు. మ్యాక్స్‌ ఓడౌడ్‌ 28, విక్రమ్‌జీత్‌ సింగ్‌ 0, జాక్‌ కాచెట్‌ 14, ర్యాన్‌ క్లెయిన్‌ 11 పరుగులు చేసి ఔటయ్యారు. యూఎస్‌ఏ బౌలర్లలో వాన్‌ స్కాల్విక్‌ 3, డ్రైస్డేల్‌, హర్మీత్‌ సింగ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. కాగా, ఈ ముక్కోణపు టోర్నీలో నెదర్లాండ్స్‌, యూఎస్‌ఏతో పాటు కెనడా జట్లు పాల్గొంటున్నాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement