యూఎస్‌ఏ క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా ఆంధ్ర మాజీ క్రికెటర్ విన్సెంట్ వినయ్ కుమార్ ఎంపికయ్యారు. 54 ఏళ్ల విన్సెంట్ త్వరలో నెదర్లాండ్స్‌తో జరుగబోయే సిరీస్ నుంచి యూఎస్‌ఏ అసిస్టెంట్ కోచ్‌గా బాధ్యతలు చేపడతాడు. ప్రస్తుతం యూఎస్‌ఏ హెడ్ కోచ్‌గా ఆసీస్ మాజీ ఆటగాడు స్టువర్ట్ లా ఉన్నాడు. విన్సెంట్ లాతో కలిసి యూఎస్‌ఏ క్రికెట్ అభివృద్ధికి పాటు పడనున్నాడు. యూఎస్‌ఏ అసిస్టెంట్ కోచ్‌గా ఎంపిక కావడంపై విన్సెంట్ ఆనందం వ్యక్తం చేశాడు. యూఎస్‌ఏ క్రికెట్ వృద్ధికి సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.
యూఎస్‌ఏ మున్ముందు పెద్ద జట్లకు షాకిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో యూఎస్‌ఏ మాజీ చాంపియన్ పాకిస్తాన్‌పై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. స్వదేశంలో జరిగిన మెగా టోర్నీలో యూఎస్‌ఏ తమకంటే మెరుగైన జట్లను మట్టికరిపించి సూపర్-8కు అర్హత సాధించింది. మోనాంక్ పటేల్ నేతృత్వంలోని యూఎస్‌ఏ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. యూఎస్‌ఏ టీమ్‌లో మెజార్టీ శాతం భారత మూలాలున్న క్రికెటర్లు ఉన్నారు. గత వరల్డ్‌కప్‌లో సౌరభ్ నేత్రావల్కర్ తదితర ఆటగాళ్లు యూఎస్‌ఏ విజయాల్లో కీలకపాత్ర పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment