నెదర్లాండ్స్ ముక్కోణపు టీ20 సిరీస్‌లో ఆతిథ్య జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో కెనడాపై విజయం సాధించిన నెదర్లాండ్స్.. తాజాగా యూఎస్‌ఏను 102 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించింది. నిన్న (ఆగస్ట్ 25) యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్.. మైఖేల్ లెవిట్ (68), స్కాట్ ఎడ్వర్డ్స్ (81 నాటౌట్) మెరుపు అర్ద సెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్ చేసింది. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌లో మ్యాక్స్ ఓడౌడ్ 28, విక్రమ్‌జీత్ సింగ్ 0, జాక్ క్యాచెట్ 14, ర్యాన్ క్లెయిన్ 11 పరుగులు చేసి ఔటయ్యారు. యూఎస్‌ఏ బౌలర్లలో వాన్ స్కాల్‌క్విక్ 3, హర్మీత్ సింగ్, జునోయ్ డ్రైస్డేల్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన యూఎస్‌ఏ.. డచ్ బౌలర్లు విజృంభించడంతో 15.4 ఓవర్లలో 115 పరుగులకు చాపచుట్టేసింది. విక్రమ్‌జీత్ సింగ్ 3, కైల్ క్లెయిన్, పాల్ వాన్ మీకెరెన్, జాక్ క్యాచెట్ తలో 2, ఆర్యన్ దత్ ఓ వికెట్ పడగొట్టి యూఎస్‌ఏ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. యూఎస్‌ఏ ఇన్నింగ్స్‌లో షయాన్ జహంగీర్ (37), ఆరోన్ జోన్స్ (34), మోనాంక్ పటేల్ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఈ సిరీస్‌లో తదుపరి మ్యాచ్ ఇవాళ జరుగనుంది. ఈ మ్యాచ్‌లోనూ యూఎస్‌ఏ, నెదర్లాండ్స్ జట్లే తలపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment