
టీమిండియాకు దూరమైన మహ్మద్ సిరాజ్ కౌంటీల్లో వార్విక్‌షైర్ తరపున అరంగేట్రం చేశాడు. కాగా డెబ్యూ మ్యాచ్‌లోనే సిరాజ్ అదరగొట్టే ప్రదర్శన ఇచ్చాడు. సోమర్‌సెట్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సిరాజ్ ఐదు వికెట్లతో ఆకట్టుకున్నాడు. 24 ఓవర్లు వేసి 82 పరుగులిచ్చి ఐదు వికెట్ల ఫీట్ అందుకున్నాడు. కాగా సిరాజ్ దెబ్బకు సోమర్‌సెట్ 219 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన వార్విక్‌షైర్ 196 పరుగులకే కుప్పకూలింది. సిరాజ్ 21 పరుగులు చేసి బ్యాటింగ్‌లోనూ మెరిశాడు. ఇక రెండోరోజు ఆట ముగిసే సమయానికి సోమర్‌సెట్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 13 పరుగులు చేసింది. సిరాజ్ ఒక వికెట్ తీశాడు.