five wicket innings
-
అశ్విన్ మాయాజాలం; బ్యాటర్లే కాదు రికార్డులైనా దాసోహం అనాల్సిందే
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన స్పిన్ మాయాజాలంతో విండీస్‌ను ముప్పతిప్పలు పెట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు.. రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు మొత్తంగా 131 పరుగులిచ్చి 12 వికెట్లు తీసి కెరీర్ బెస్ట్ ప్రదర్శన నమోదు చేశాడు. ఈ క్రమంలో అశ్విన్ పలు రికార్డులను బద్దలుకొట్టాడు. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం. ► అశ్విన్‌కు టెస్టుల్లో ఇది 8వ 10 వికెట్ల హాల్. టీమిండియా తరపున అత్యధిక పది వికెట్ల హాల్ అందుకున్న జాబితాలో అనిల్ కుంబ్లేతో కలిసి సంయుక్తంగా ఉన్నాడు. కుంబ్లే కూడా 8సార్లు పది వికెట్ల హాల్ అందుకున్నాడు. ఇక హర్బజన్ సింగ్ ఐదుసార్ల పది వికెట్ల హాల్ సాధించాడు. ► ఇక విదేశాల్లో టీమిండియా తరపున బెస్ట్ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేసిన జాబితాలో అశ్విన్ చోటు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో తొలి స్థానంలో భగవత్ చంద్రశేఖర్(1977లో మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాపై 12/104), ఇర్ఫాన్ పఠాన్(2005లో హరారే వేదికగా జింబాబ్వేపై 12/126), తాజాగా అశ్విన్(2023లో వెస్టిండీస్‌పై 12/131), అనిల్ కుంబ్లే( 2004లో సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాపై 12/279), ఇర్ఫాన్ పఠాన్(2004లో డాకా వేదికగా బంగ్లాదేశ్‌పై 11/96) ఉన్నారు. ► ఇక వెస్టిండీస్‌పై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన టీమిండియా బౌలర్లలో అశ్విన్ నాలుగో స్థానంలో నిలిచాడు. తాజా ప్రదర్శనతో కలిపి అశ్విన్ ఇప్పటివరకు విండీస్‌పై 72 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ కంటే ముందు కపిల్ దేవ్(89 వికెట్లు), మాల్కమ్ మార్షల్(76 వికెట్లు), అనిల్ కుంబ్లే(74 వికెట్లు), శ్రీనివాస్ వెంకటరాఘవన్(68 వికెట్లు) ఉన్నారు. ► ఒక టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడం అశ్విన్‌కు ఇది ఆరోసారి. ఈ జాబితాలో ముత్తయ్య మురళీధరన్ 11 సార్లు ఈ ఫీట్ నమోదు చేసి అగ్రస్థానంలో ఉండగా.. రంగనా హెరాత్ 8సార్లు, సిడ్నీ బార్నెస్ ఆరు సార్లు ఈ ఫీట్ సాధించాడు. 2nd 5-wicket haul in the ongoing Test 👍 34th 5-wicket haul in Test 👌 8th 10-wicket haul in Tests 👏 Well done, R Ashwin 🙌 🙌 Follow the match ▶️ https://t.co/FWI05P4Bnd #TeamIndia | #WIvIND pic.twitter.com/u9dy3t0TAd — BCCI (@BCCI) July 14, 2023 చదవండి: WI Vs IND: మూడు రోజుల్లోనే ముగించారు.. విండీస్‌పై ఇన్నింగ్స్ విజయం -
#MohitSharma: ఐదు వికెట్లు.. ఫ్లేఆఫ్స్ చరిత్రలో రెండో బౌలర్‌గా
ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ మోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 పోరులో మోహిత్ శర్మ ఐదు వికెట్లతో చెలరేగాడు. మోహిత్ శర్మ బౌలింగ్ దెబ్బకు ముంబై ఇండియన్స్ 171 పరుగులకు ఆలౌటై 62 పరుగులతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించిది. ఇక 2.2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన మోహిత్ శర్మ 10 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీయడం విశేషం. ఐపీఎల్ చరిత్రలో ప్లేఆఫ్స్‌లో ఐదు వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా మోహిత్ శర్మ నిలిచాడు. ఇంతకముందు ఆకాశ్ మధ్వాల్(ముంబై ఇండియన్స్).. లక్నోతో మ్యాచ్‌లో ఐదు పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. ఇక ఈ సీజన్లో డెత్ ఓవర్లలో(16-20 ఓవర్లు) అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మోహిత్ రెండో స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు ఈ సీజన్లో మోహిత్ శర్మ 14 వికెట్లు తీయగా.. తొలి స్థానంలో సీఎస్కేకు మతీశా పతిరానా(16 వికెట్లు) ఉండగా.. వీరిద్దరి తర్వాత హర్షల్‌పటేల్(ఆర్షీబీ) 11 వికెట్లతో ఉన్నాడు. చదవండి: #SaiSudharsan: రిటైర్డ్ ఔట్.. ఐపీఎల్ చరిత్రలో మూడో ఆటగాడిగా -
చరిత్ర సృష్టించిన మార్క్‌వుడ్.. లక్నో తరపున తొలి బౌలర్‌గా
ఇంగ్లండ్ బౌలర్ మార్క్‌వుడ్ ఐపీఎల్లో బెస్ట్ బౌలింగ్ ప్రదర్శనను నమోదు చేశాడు. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో మార్క్‌వుడ్ ఐదు వికెట్లతో చెలరేగాడు. తద్వారా ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు మార్క్‌వుడ్. ఇప్పటివరకు లక్నో తరపున మోసిన్ ఖాన్(4 వికెట్లు) 2022లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై అత్యుత్తమంగా ఉంది. ఇక టి20 క్రికెట్లోనూ మార్క్‌వుడ్‌కు ఇదే తొలి ఐదు వికెట్లు హాల్ కావడం విశేషం. ఇక ఐపీఎల్లో ఐదు వికెట్ల హాల్ అందుకున్న రెండో ఇంగ్లండ్ బౌలర్‌గా మార్క్‌వుడ్ నిలిచాడు. ఇంతకముందు 2012 ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌కు ఆడిన దిమిత్రి మస్కరెనాస్ 25 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్లో ఐదు వికెట్ల హాల్ నమోదవడం ఇది తొమ్మిదోసారి. ఇంతకముందు సోహైల్ తన్వీర్(2008), బాలాజీ(2008), అమిత్ మిశ్రా(2008), అనిల్ కుంబ్లే(2009), లసిత్ మలింగ(2011), దిమిత్రి మస్కరెనాస్(2012), సునీల్ నరైన్(20212), భువనేశ్వర్(2017).. తాజాగా 2023 ఐపీఎల్లో మార్క్‌వుడ్ ఈ ఘనత అందుకున్నాడు. Mark Wood played 1 match in IPL 2018. Mark Wood missed IPL 2022 due to injury. Mark Wood took a five-wicket haul in IPL 2023. The journey of his cricket career has been tough but his ability to fight & fight to come back is remarkable. pic.twitter.com/OotRPuYUoK — Johns. (@CricCrazyJohns) April 1, 2023 𝗕𝗮𝘁𝘁𝗲𝗿𝘀 𝗹𝗼𝗼𝗸𝘀 𝗮𝘄𝗮𝘆! 😲@MAWood33 gets two in two with his fiery pace 🔥🔥 Follow the match ▶️ https://t.co/086EqX92dA #TATAIPL#TATAIPL | #LSGvDC | @LucknowIPL pic.twitter.com/wuCshhzfMo — IndianPremierLeague (@IPL) April 1, 2023 -
సిరాజ్‌కు ఐదు వికెట్లు.. అరంగేట్రం అదుర్స్
టీమిండియాకు దూరమైన మహ్మద్ సిరాజ్ కౌంటీల్లో వార్విక్షైర్ తరపున అరంగేట్రం చేశాడు. కాగా డెబ్యూ మ్యాచ్‌లోనే సిరాజ్ అదరగొట్టే ప్రదర్శన ఇచ్చాడు. సోమర్‌సెట్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సిరాజ్ ఐదు వికెట్లతో ఆకట్టుకున్నాడు. 24 ఓవర్లు వేసి 82 పరుగులిచ్చి ఐదు వికెట్ల ఫీట్ అందుకున్నాడు. కాగా సిరాజ్ దెబ్బకు సోమర్సెట్ 219 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన వార్విక్షైర్ 196 పరుగులకే కుప్పకూలింది. సిరాజ్ 21 పరుగులు చేసి బ్యాటింగ్‌లోనూ మెరిశాడు. ఇక రెండోరోజు ఆట ముగిసే సమయానికి సోమర్సెట్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 13 పరుగులు చేసింది. సిరాజ్ ఒక వికెట్ తీశాడు. -
అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో తొలి క్రికెటర్‌గా..
అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో పాకిస్తాన్ కెప్టెన్ ఖాసీమ్ అక్రమ్ అరుదైన ఫీట్ సాధించాడు. ఐదో ప్లేఆఫ్ స్థానం కోసం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఖాసీమ్ అక్రమ్.. తొలుత బ్యాటింగ్‌లో 135 పరుగులు.. ఆ తర్వాత బౌలింగ్‌లో 37 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. తద్వారా ప్రపంచకప్‌లో ఒక మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో పాటు బౌలింగ్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో ఐసీసీ ఖాసీమ్ అక్రమ్ ఘనతను తనదైన స్టైల్లో ట్వీట్ చేసింది. అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో సెంచరీతో పాటు ఐదు వికెట్ల ఘనత అందుకున్న తొలి క్రికెటర్‌గా ఖాసీమ్ అక్రమ్ నిలిచాడు. టోర్నమెంట్లో అక్రమ్ తన మార్క్‌ను స్పష్టంగా చూపించాడు.. కంగ్రాట్స్ అని ట్వీట్ చేసింది. చదవండి: Yash Dhull: యశ్ ధుల్ ఒక సంచలనం.. కోహ్లితో ఉన్న పోలికేంటి! ఇక మ్యాచ్ విషయానికి వస్తే పాకిస్తాన్ 238 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 365 పరుగులు చేసింది. కెప్టెన్ ఖాసీమ్ అక్రమ్(80 బంతుల్లో 135 నాటౌట్, 13 ఫోర్లు, 6 సిక్సర్లు), హసీబుల్లా ఖాన్(151 బంతుల్లో 136, 9 ఫోర్లు, 2 సిక్సర్లు), ముహ్మద్ షెహజాద్ 73 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన శ్రీలంక 34.2 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. ఖాసీమ్ అక్రమ్ 37 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. ఇక శనివారం టీమిండియా, ఇంగ్లండ్‌ల మధ్య ఫైనల్ పోరు జరగనుంది. చదవండి: ఆకాశ్ చోప్రా అండర్-19 వరల్డ్ బెస్ట్ ఎలెవెన్.. టీమిండియా నుంచి ఒకే ఒక్కడు View this post on Instagram A post shared by ICC (@icc) -
కుంబ్లే సరసన శార్దూల్.. అరుదైన ఘనత సాధించిన బౌలర్‌గా రికార్డు
IND Vs SA 2nd Test Day 2: దక్షిణాఫ్రికాతో జొహనెస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్ ఐదు వికెట్లతో చెలరేగాడు. రెండో రోజు లంచ్ విరామానికి ముందు స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు పడగొట్టిన అతను.. రెండో సెషన్లోనూ వరుస ఓవర్లలో రెండు వికెట్లు సాధించి తొలిసారి ఐదు వికెట్ల ఘనత సాధించాడు. దీంతో జొహనెస్‌బర్గ్ వేదికగా ఈ ఘనత సాధించిన ఆరో ఇండియన్ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ వేదికపై భారత దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే (6/53) తొలుత ఈ ఫీట్‌ను నమోదు చేయగా, ఆతర్వాత జవగళ్ శ్రీనాథ్ (5/104), శ్రీశాంత్ (5/40), జస్ప్రీత్ బుమ్రా (5/54), మహ్మద్ షమీ (5/29)లు ఈ మార్క్‌ని అందుకున్నారు. తాజాగా శార్దూల్ (5/37) వీరి సరసన చేరాడు. కెరీర్లో ఆరో టెస్ట్ ఆడుతున్న శార్ధూల్‌కి ఇదే తొలి 5 వికెట్ల ఘనత కావడం విశేషం. ఇదిలా ఉంటే, రెండో రోజు ఆటలో శార్ధూల్ చెలరేగడంతో టీమిండియా పట్టుబిగించింది. టీ విరామం సమయానికి 7 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. క్రీజ్‌లో జన్సెన్(2), కేశవ్ మహారాజ్(11) ఉన్నారు. శార్ధూల్‌తో పాటు షమీ(2/52) కూడా రాణించాడు. అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. చదవండి: Ind Vs Sa: అనవసరంగా బలైపోయాం.. కెప్టెన్ రాహుల్ అతడిని వెనక్కి పిలవొచ్చు! -
చెలరేగిన అశ్విన్.. 69 పరుగులకే ప్రత్యర్ధి ఆలౌట్
లండన్: ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2021 ఫైనల్లో తేలిపోయిన టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఇంగ్లండ్ గడ్డపై సత్తాచాటాడు. ప్రస్తుతం కౌంటీ క్రికెట్లో సర్రే తరఫున ఆడుతున్న అశ్విన్ ఒకే ఇన్నింగ్స్‌లో 6 వికెట్లతో చెలరేగాడు. సోమర్‌సెట్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లు వేసిన యాష్.. 6 వికెట్లు తీసి ప్రత్యర్ధి నడ్డి విరిచాడు. అశ్విన్‌కి మరో స్పిన్నర్ డేనియల్ మోరియార్టీ (4 వికెట్లు) తోడవ్వడంతో సోమర్సెట్ 69 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్ ధాటికి ముగ్గురు బ్యాట్స్‌మన్ మాత్రమే రెండంకెల స్కోర్ సాధించగా, జె హిల్డ్రెత్ (14) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే, జులై 11న (ఆదివారం) మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సోమర్సెట్, తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. హిల్డ్రెత్(107) శతకానికి మరో అయిదుగురు ఆటగాళ్లు 40లు సాధించడంతో సోమర్సెట్ తొలి ఇన్నింగ్స్‌లో 429 పరుగులకు ఆలౌటైంది. సర్రే బౌలర్లు జోర్డాన్ క్లార్క్, అమర్ విర్ధి చెరో 3 వికెట్లు పడగొట్టగా, డేనియల్ మోరియార్టీ 2, అశ్విన్, ఆర్ క్లార్క్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సర్రే జట్టులో ఓపెనర్లు రోరీ బర్న్స్(50), స్టోన్మెన్(67) మాత్రమే రాణించడంతో కేవలం 240 పరుగులకే ఆలౌటైంది. సోమర్సెట్ బౌలర్లు జాక్ లీచ్ 6, వాన్ డెర్ మెర్వే 4 వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన సోమర్సెట్కు స్పిన్నర్లు అశ్విన్(6), మోరియార్టీ(4) చుక్కలు చూపించారు. వీరి ధాటికి సోమర్సెట్ రెండో ఇన్నింగ్స్‌లో 69 పరుగులకే చాపచుట్టేసింది. అనంతరం 259 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సర్రే జట్టు కడపటి వార్తలందేసరికి 3 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. క్రీజ్‌లో హషీమ్ ఆమ్లా(24), జేమీ స్మిత్(26) ఉన్నారు. సర్రే గెలుపునకు మరో 178 పరుగుల అవసరం ఉంది. కాగా, ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ముగిశాక టీమిండియా ఆటగాళ్లకు మూడు వారాల విరామం దొరకడంతో వారంతా కుటుంబాలతో కలిసి విహార యాత్రలో ఉన్నారు. అశ్విన్‌కు మాత్రం అనుకోకుండా కౌంటీ జట్టు సర్రే నుంచి ఆహ్వానం అందిండంతో ఆయన వెంటనే జట్టుతో చేరాడు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీసుకు ముందు ఈ కౌంటీ మ్యాచ్ ద్వారా మంచి ప్రాక్టీస్ దొరుకుతుందని భావించిన యాష్.. వెంటనే సర్రే జట్టు ఆహ్వానాన్ని అంగీకరించాడు. -
సహేంద్రకు ఐదు వికెట్లు
► ఎ-3 డివిజన్ రెండు రోజుల లీగ్ సాక్షి, హైదరాబాద్: ఏ-3 డివిజన్ రెండు రోజుల లీగ్ చాంపియన్‌షిప్‌లో ఆక్స్ఫర్డ్ బ్లూస్, క్లాసిక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రా గా ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆక్స్ఫర్డ్ బ్లూస్ జట్టు 54 ఓవర్లలో 160 పరుగులు చేసి ఆలౌటైంది. బ్యాటింగ్‌లో డేవిడ్ శామ్యూల్స్ (30 బంతుల్లో 28; 4 ఫోర్లు), సహేంద్ర (70 బంతుల్లో 28; 2 ఫోర్లు) రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన క్లాసిక్ జట్టును ఆక్స్ఫర్డ్ బౌలర్లు సమర్థంగా నియంత్రించారు. బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో క్లాసిక్ జట్టు 30.4 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది. సహేంద్ర 5 వికెట్లతో రెచ్చిపోయాడు. మరో బౌలర్ వెంకట్ కిరణ్ 4 వికెట్లు పడగొట్టాడు. ఇతర మ్యాచ్‌ల వివరాలు పూల్ ఏ మాంచెస్టర్: తొలి ఇన్నింగ్స్ 461/6 డిక్లేర్డ్, రెండో ఇన్నింగ్స్ 6/2 డిక్లేర్డ్; డెక్కన్ బ్లూస్ తొలి ఇన్నింగ్స్: 182/10 (హర్ష వర్థన్ సింగ్ 72, హర్ష వర్థన్ 48; ఖయ్యూమ్ 4/23, జగదీశ్ నాయుడు 3/44); రెండో ఇన్నింగ్స్: 46/4 (19 ఓవర్లలో ) మ్యాచ్ డ్రా. మహమూద్ సీసీ: తొలి ఇన్నింగ్స్ 205/10, రెండో ఇన్నింగ్స్ 175/1; నిజామ్ కాలేజ్: తొలి ఇన్నింగ్స్ 221/10 (శరత్ 46, అక్షయ్ 33, అన్వేష్ రెడ్డి 64; శ్రీనాథ్ రెడ్డి 3/ 38, సచిన్ శర్మ 3/ 49) మ్యాచ్ డ్రా. నేషనల్: తొలి ఇన్నింగ్స్ 107/9 డిక్లేర్డ్, రెండో ఇన్నింగ్స్ 63/10 (సాయి 7/17); గ్రీన్ టర్ఫ్: తొలి ఇన్నింగ్స్ 99/10, రెండో ఇన్నింగ్స్ 73/2 (సయ్యద్ షబాజుద్దీన్ 30); స్పోర్టివ్: తొలి ఇన్నింగ్స్ 102/9 డిక్లేర్డ్ ( గోపి కృష్ణ రెడ్డి 39; సాయి కృష్ణ 3/15, హరిబాబు 3/29, విన్సెంట్ కుమార్ 3/ 42); ఎస్బీఐ: 252/9 డిక్లేర్డ్ ( రంగనాథ్ 129, మొహమ్మద్ ఆసిఫ్ 3/53, సంజయ్ 3/53), రెండో ఇన్నింగ్స్ 34/4; అగర్వాల్: తొలి ఇన్నింగ్స్ 303/10, రెండో ఇన్నింగ్స్ 151/9 డిక్లేర్డ్ (మహేశ్ 31, సాయి 38, మొహమ్మద్ అబిద్ 4/37); బాలాజీ క్లాట్స్: 208/10 (మొహమ్మద్ ఫయాజ్ 38, విజయ్ 54; సయ్యద్ ఇర్షద్ పాషా 4/39); పూల్ బి హైదరాబాద్ టైటాన్స్: 111/9 డిక్లేర్డ్, రెండో ఇన్నింగ్స్ 65/5 (రవూఫ్ 31); తెలంగాణ 325/9 డిక్లేర్డ్ (రాకేశ్ నాయక్ 209, యశ్ గుప్తా 36);