చరిత్ర సృష్టించిన మార్క్‌వుడ్‌.. లక్నో తరపున తొలి బౌలర్‌గా | IPL 2023: Mark Wood becomes 2nd-England bowler-Bag IPL 5-wicket Haul | Sakshi
Sakshi News home page

IPL 2023: చరిత్ర సృష్టించిన మార్క్‌వుడ్‌.. లక్నో తరపున తొలి బౌలర్‌గా

Apr 1 2023 11:58 PM | Updated on Apr 2 2023 12:01 AM

IPL 2023: Mark Wood becomes 2nd-England bowler-Bag IPL 5-wicket Haul - Sakshi

Photo: IPL Twitter

ఇంగ్లండ్‌ బౌలర్‌ మార్క్‌వుడ్‌ ఐపీఎల్‌లో బెస్ట్‌ బౌలింగ్‌ ప్రదర్శనను నమోదు చేశాడు. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో మార్క్‌వుడ్‌ ఐదు వికెట్లతో చెలరేగాడు. తద్వారా ఐపీఎల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ తరపున ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు మార్క్‌వుడ్‌.  ఇప్పటివరకు లక్నో తరపున మోసిన్‌ ఖాన్‌(4 వికెట్లు) 2022లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై అత్యుత్తమంగా ఉంది.

ఇక టి20 క్రికెట్‌లోనూ మార్క్‌వుడ్‌కు ఇదే తొలి ఐదు వికెట్లు హాల్‌ కావడం విశేషం. ఇక ఐపీఎల్‌లో ఐదు వికెట్ల హాల్‌ అందుకున్న రెండో ఇంగ్లండ్‌ బౌలర్‌గా మార్క్‌వుడ్‌ నిలిచాడు. ఇంతకముందు 2012 ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌కు ఆడిన దిమిత్రి మస్కరెనాస్‌ 25 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు.

ఇక ఐపీఎల్‌లో ఐదు వికెట్ల హాల్‌ నమోదవడం ఇది తొమ్మిదోసారి. ఇంతకముందు సోహైల్‌ తన్వీర్‌(2008), బాలాజీ(2008), అమిత్‌ మిశ్రా(2008), అనిల్‌ కుంబ్లే(2009), లసిత్‌ మలింగ(2011), దిమిత్రి మస్కరెనాస్‌(2012), సునీల్‌ నరైన్‌(20212), భువనేశ్వర్‌(2017).. తాజాగా 2023 ఐపీఎల్‌లో మార్క్‌వుడ్‌ ఈ ఘనత అందుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement