ఐపీఎల్ 16వ సీజన్‌కు రిషబ్ పంత్ దూరమైన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్‌లో జరిగిన యాక్సిడెంట్‌లో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. పలు సర్జరీల అనంతరం పంత్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్ స్థానంలో డేవిడ్ వార్నర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.
వార్నర్ సారధ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ శనివారం సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో తొలి మ్యాచ్ ఆడింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ పంత్‌ను గుర్తుచేసుకుంటూ అతని జెర్సీని డగౌట్‌లో ప్రదర్శన చేసింది. ''ఈ సమయంలో నువ్వు ఇక్కడ లేకున్నా నీ జ్ఞాపకాలు మాత్రం మాతోనే ఉంటాయి.. మిస్ యూ పంత్.. ఎల్లప్పుడూ మా డగౌట్‌లో.. ఎప్పుడూ మా టీమ్‌లోనే'' అంటూ ఢిల్లీ క్యాపిటల్స్ క్యాప్షన్ జత చేసింది.
అయితే పంత్ జెర్సీని డగౌట్‌లో చూసిన కొంతమంది అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. మిస్ యూ బ్రదర్ అంటూ కొతమంది, ఇంపాక్ట్ ప్లేయర్‌గా పంత్ వచ్చాడంలూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.
తమ కెప్టెన్ లేకుండా ఈ సీజన్‌లో ఆడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ కోచింగ్ స్టాఫ్, ఓనర్లు, ఆటగాళ్లు, అభిమానులు సీజన్ ప్రారంభానికి ముందే రిషబ్ పంత్‌ను కోల్పోయామంటూ బాధపడ్డారు. పంత్‌ను స్టేడియంకు రప్పించేందుకు ప్రయత్నిస్తామని, తద్వారా అభిమానులు, జట్టులో నైతిక స్థైర్యాన్ని పెంచుతామని ఢిల్లీ అధికారులు తెలిపారు. అనుకున్న ప్రకారమే తొలి మ్యాచ్‌కు పంత్ జెర్సీని డగౌట్‌లో ప్రదర్శన చేసింది.
Always in our dugout. Always in our team ❤️💙#YehHaiNayiDilli #IPL2023 #LSGvDC #RP17 pic.twitter.com/8AN6LZdh3l
— Delhi Capitals (@DelhiCapitals) April 1, 2023
చదవండి: అరంగేట్రంలోనే అదుర్స్.. ఐపీఎల్ చరిత్రలో నాలుగో ఆటగాడిగా
Comments
Please login to add a commentAdd a comment