ఇంగ్లండ్ బౌలర్ మార్క్‌వుడ్ ఐపీఎల్ 16వ సీజన్‌లో తన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లు కలిపి ఎనిమిది వికెట్లు పడగొట్టిన మార్క్‌వుడ్.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 14 పరుగులకే ఐదు వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇక సీఎస్‌కేతో మ్యాచ్‌లో లక్నో ఓడిపోయినప్పటికి మార్క్‌వుడ్ విఫలం కాలేదు. సీఎస్‌కే మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు.
Photo: IPL Website
ఈసారి పర్పుల్ క్యాప్(అత్యధిక వికెట్లు) రేసులో తానున్నట్లు స్పష్టం చేశాడు. అయితే మార్క్‌వుడ్ అడుగు ఐపీఎల్‌లో నాలుగేళ్ల క్రితమే పడింది. అప్పట్లో సీఎస్‌కే తరపున ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన మార్క్‌వుడ్ నాలుగు ఓవర్లు వేసి 49 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అంతే ఆ తర్వాత ఐపీఎల్‌లో కనబడకుండా పోయిన మార్క్‌వుడ్‌ను 2022లో లక్నో సూపర్ జెయింట్స్ రూ.7.5 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ మోచేతి గాయంతో గతేడాది సీజన్‌కు దూరమైన మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు కూడా దూరం కావాల్సి వచ్చింది. ఇక ఈ ఏడాది మినీ వేలానికి ముందు మార్క్‌వుడ్‌ను లక్నో రిటైన్ చేసుకుంది.
ఇక మార్క్‌వుడ్.. శుక్రవారం ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో మార్క్‌వుడ్ ఒక చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. 'లక్నోకు నా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నా. గతేడాది ఒక్క మ్యాచ్ ఆడకపోయినప్పటికి లక్నో జట్టు నాపై నమ్మకంతో రిటైన్ చేసుకుంది. అందుకే వారి నమ్మకాన్ని తిరిగి ఇచ్చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. ఈసారి ఆటను ఎంతో ప్రేమిస్తున్నా. కెప్టెన్ కేఎల్ రాహుల్ నాకు మంచి సపోర్ట్ ఇస్తున్నాడు. జట్టు మేనేజ్‌మెంట్ కూడా నా రోల్ విషయంలో క్లియర్‌గా ఉంది. వారు నా నుంచి ఏం కోరుకుంటున్నారో అది ఇస్తున్నా.
ఇక ఇంగ్లండ్ తరపున టి20, వన్డే వరల్డ్‌కప్ ఫైనల్స్ ఆడిన నేను ఐపీఎల్‌లో మాత్రం ఆకట్టుకోలేదు. నాలుగేళ్ల క్రితమే ఐపీఎల్‌లో అవకాశమొచ్చినా నిరూపించుకోవడంలో విఫలమయ్యా. దీంతో క్యాష్ రిచ్ లీగ్ అయిన ఐపీఎల్‌లో నా బిజినెస్ అసంపూర్తిగా ఉండిపోయింది. అందుకే ఈసారి ఐపీఎల్‌లో నేనేంటో నిరూపించుకొని బిజినెస్‌ను పూర్తి చేస్తా'' అంటూ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment