ఐదేళ్ల తర్వాత రీ ఎంట్రీ.. తొలి మ్యాచ్‌లోనే భయపెట్టాడు! | Mark Wood takes five wickets in Lucknow Super Giants win | Sakshi
Sakshi News home page

IPL 2023- Mark Wood: ఐదేళ్ల తర్వాత రీ ఎంట్రీ.. తొలి మ్యాచ్‌లోనే భయపెట్టాడు!

Published Sun, Apr 2 2023 9:21 AM | Last Updated on Sun, Apr 2 2023 9:36 AM

Mark Wood takes five wickets in Lucknow Super Giants win - Sakshi

Photo Credit : IPL Website

ఐదేళ్ల విరామం తర్వాత ఐపీఎల్‌లో రీ ఎంట్రీ ఇ‍చ్చిన ఇంగ్లండ్‌ స్టార్‌ పేసర్‌ మార్క్‌ వుడ్‌ తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు.  ఐపీఎల్‌-2023లో లక్నో సూపర్‌ జెయింట్స్‌కు వుడ్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌లో జరిగిన మ్యాచ్‌లో వుడ్‌ అద్భుతమైన ప్రదర్శరన కనబరిచాడు. ల‍క్నో విజయంలో వుడ్‌ కీలక పాత్ర పోషించాడు.

ఈ మ్యాచ్‌లో ఈ ఇంగ్లీష్‌ పేసర్‌ ఐదు వికెట్లతో చెలరేగాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 14 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. వుడ్‌ ఢిల్లీ ఓపెనర్‌ పృథ్వీ షా, మిచెల్‌ మార్ష్‌ను అద్భుతమైన బంతులతో క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. కాగా ఐపీఎల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ తరపున ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా వుడ్‌ రికార్డులకెక్కాడు. ఇక ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన జాబితాలో 9వ బౌలర్‌గా నిలిచాడు.

ఇక ఈ మ్యాచ్‌కు ముందు చివరగా 2018 ఐపీఎల్‌ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరపున ఆడాడు. అనంతరం ఐపీఎల్‌-2022 మెగా వేలంలో వుడ్‌ను రూ.7.50 కోట్లకు లక్నో సూపర్‌ జెయింట్స్‌ కొనుగోలు చేసింది. అయితే గాయం కారణంగా గతేడాది ఐపీఎల్‌ సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. అయినప్పటికీ ఐపీఎల్‌-2023 సీజన్‌కు ముందు వుడ్‌ను లక్నో రీటైన్‌ చేసుకుంది. 
చదవండి: IPL 2023: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ఉమేశ్‌ యాదవ్‌.. ఒకే ఒక్కడు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement