IPL 2023, CSK Vs DC: Who Wins The Battle Of New Delhi? - Sakshi
Sakshi News home page

IPL 2023: ఢిల్లీతో సీఎస్‌కే కీలక పోరు.. గెలిస్తే ప్లే ఆప్స్‌కు! లక్నో కూడా

Published Sat, May 20 2023 7:25 AM | Last Updated on Sat, May 20 2023 9:05 AM

CSK Vs DC: Who Wins The Battle Of New Delhi? - Sakshi

PC: IPL.com

ఐపీఎల్‌-2023లో శనివారం(మే20) కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలుత అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలడనుంది.  మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. కాగా ఈ మ్యాచ్‌ చెన్నైసూపర్‌ కింగ్స్‌కు చాలా కీలకం. చెన్నై ఖాతాలో ప్రస్తుతం 15 పాయింట్లు ఉన్నాయి.

ఢిల్లీ వేదికగా జరిగే తమ చివరి మ్యాచ్‌లో గెలిస్తే చెన్నై 17 పాయింట్లతో, ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. అయితే రెండో స్థానమా, మూడో స్థానమా అనేది రాత్రి జరిగే తర్వాతి మ్యాచ్‌తో ఖరారవుతుంది.

చెన్నై ఓడిపోతే మాత్రం ఆదివారం జరిగే మ్యాచ్‌ల ఫలితాల కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. ఎప్పుడో ప్లే ఆఫ్స్‌కు దూరమైన ఢిల్లీ క్యాపిటల్స్‌ గెలిచినా ఆ జట్టుకు ప్రయోజనం ఏమీ ఉండదు. అయితే సీజన్‌లో ఆఖరి స్థానం నుంచి తప్పించుకునేందుకు ఇదో అవకాశం.

ఇక సాయంత్రం 7:30 గంటలకు ఈడెన్‌గార్డన్స్‌ వేదికగా కోల్‌కతానైట్‌ రైడర్స్‌తో లక్నో సూపర్‌ జెయింట్స్‌ తలపడనుంది. లక్నోకు కూడా ఈ మ్యాచ్‌ చాలా ముఖ్యం. లక్నో ఖాతాలో ప్రస్తుతం 15 పాయింట్లు ఉన్నాయి. కేకేఆర్‌తో మ్యాచ్‌లో గెలిస్తే 17 పాయింట్లతో లక్నో కూడా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించడం ఖాయం.

పైగా చెన్నై మ్యాచ్‌ ముగిసిపోతుంది కాబట్టి ఎంత తేడాతో గెలిస్తే రెండో స్థానం దక్కుతుందనేది కూడా తెలుస్తుంది. ఓడితే చెన్నైలాగే ఆదివారం మ్యాచ్‌ ఫలితాల కోసం ఎదురు చూడక తప్పదు. ఇక కోల్‌కతా సాంకేతికంగా ... గెలిచి 14 పాయింట్లతో చేరడంతో పాటు –0.256 నుంచి రన్‌రేట్‌ను భారీగా మెరుగుపర్చుకొని పోటీలో నిలవడం దాదాపు అసాధ్యం!
చదవండి: #YashasviJaiswal: 600 పరుగులు; జైశ్వాల్‌ చరిత్ర.. తొలి అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement