ఐపీఎల్-2023లో పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్ అవకాశాలపై ఢిల్లీ క్యాపిటల్స్ నీళ్లు చల్లింది. బుధవారం ధర్మశాల వేదికగా మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో పంజాబ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఓడించింది. దీంతో పంజాబ్ ప్లేఆఫ్ ఛాన్స్‌లు సన్నగిల్లాయి.
అదే విధంగా ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో ఉన్న ఢిల్లీ.. ఒక స్థానం ఎగబాకింది. ఇక విజయంపై మ్యాచ్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్న్‌ర్ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించినప్పటికీ.. ఫీల్డింగ్‌లో మాత్రం పేలవ ప్రదర్శన కనబరిచాం అని వార్నర్ తెలిపాడు.
"ఈ మ్యాచ్‌లో విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ విజయంలో ప్రతీఒక్కరూ తమ వంతు పాత్ర పోషించారు. దర్మశాల వికెట్ బ్యాటింగ్‌కు అద్బుతంగా ఉంది. ఈ వికెట్ మా హోం గ్రౌండ్‌కు పూర్తి భిన్నం. ఢిల్లీలో ఆడటం చాలా కష్టం. ఢిల్లీలో ఆడిన ప్రతీ మ్యాచ్ మాకు ఛాలెంజింగ్‌గా ఉండేది.
పృథ్వీ తన రిథమ్‌ను తిరిగిపొందినందుకు ఆనందంగా ఉంది. రిలీ రోసౌ కూడా అద్బుతంగా ఆడాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌లో మేము మెరుగైన ప్రదర్శన చేయలేకపోయాం. ఫైనల్‌గా మా ఖాతాలో మరో రెండు పాయింట్లు వచ్చి చేరాయి అని పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో వార్నర్ పేర్కొన్నాడు. ఇక ఢిల్లీ తమ ఆఖరి మ్యాచ్‌లో మే20న అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది.
చదవండి: IPL 2023: చాలా బాధగా ఉంది.. అదే మా ఓటమికి కారణం! ప్రతీ సారి ఇంతే: ధావన్
Comments
Please login to add a commentAdd a comment