IPL 2023: David Warner Mimics Jadeja's Sword Celebration, Fans Reacts - Sakshi
Sakshi News home page

Viral Video: ఎవరు బాగా చేశారు? పాపం మధ్యలో అంపైర్‌ పిచ్చోడయ్యాడు!

Published Sun, May 21 2023 1:02 PM | Last Updated on Sun, May 21 2023 1:18 PM

David Warner Funny Question On His Jadeja Sword Celebration Fans Reacts - Sakshi

వార్నర్‌- జడేజా- ఓ సరదా సన్నివేశం- వైరల్‌ (PC: IPL)

IPL 2023- David Warner- Ravindra Jadeja Viral Video: డేవిడ్‌ వార్నర్‌.. ఈ ఆస్ట్రేలియా ఓపెనర్‌ ఐపీఎల్‌ అభిమానులకు వినోదం పంచడంలో ఎల్లప్పుడూ ముందే ఉంటాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఆడిన సమయంలో టాలీవుడ్‌ స్టార్ల పాటలకు రీల్స్‌ చేస్తూ తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు వార్నర్‌ భాయ్‌.

అనూహ్య పరిస్థితుల్లో.. ఊహించని రీతిలో రైజర్స్‌ను వీడిన వార్నర్‌ ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్నాడు. ఇక రిషభ్‌ పంత్‌ గైర్హాజరీ నేపథ్యంలో ఐపీఎల్‌-2023లో ఢిల్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. బ్యాటర్‌గా సఫలమైన వార్నర్‌.. సారథిగా మాత్రం రాణించలేకపోయాడు. 

బ్యాటర్‌గా సక్సెస్‌.. కెప్టెన్‌గా విఫలం
ఈ సీజన్‌లో 14 ఇన్నింగ్స్‌లో 561 పరుగులు సాధించాడు వార్నర్‌. కానీ ఢిల్లీ ఆడిన 14 మ్యాచ్‌లలో కేవలం ఐదింట గెలవడంతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. ఆదివారం నాటి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో గనుక రైజర్స్‌ గెలిస్తే పదో స్థానంతో ఢిల్లీ సీజన్‌ను ముగించాల్సి వస్తుంది.

వార్నర్‌- జడ్డూ.. వైరల్‌ వీడియో
ఇదిలా ఉంటే.. వార్నర్‌కు ఈ సీజన్‌లో అత్యధిక స్కోరు 86. అది కూడా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో శనివారం నాటి మ్యాచ్‌లో సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌ సందర్భంగా వార్నర్‌- జడేజా మధ్య చోటు చేసుకున్న సరదా సన్నివేశం గుర్తుండే ఉంటుంది. 

ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఐదో ఓవర్‌ సీఎస్‌కే పేసర్‌ దీపక్‌ చహర్‌ వేశాడు. ఈ క్రమంలో ఓవర్‌ మూడో బంతిని వార్నర్‌ కవర్స్‌ దిశగా ఆడి.. సింగిల్‌ పూర్తి చేశాడు. అయితే, అప్పటికే బంతిని అందుకున్న మొయిన్‌ అలీ విసిరిన బంతిని అందుకున్న రహానే వికెట్ల వైపు త్రో చేయాలని చూడగా.. జడ్డూ తనవైపు విసరమంటూ సైగ చేశాడు.

మధ్యలో పాపం అంపైర్‌!
దీంతో బంతిని అందుకున్న జడ్డూ.. మరో సింగిల్‌ తీసేందుకు యత్నించిన వార్నర్‌ను.. ‘‘వికెట్ల మీదకు విసిరేస్తా’’అన్నట్లు సరదాగా బెదిరించగా.. వార్నర్‌ జడ్డూ స్టైల్లో కత్తిసాము చేస్తూ నాకేం భయం లేదన్నట్లు బదులిచ్చాడు. తర్వాత ఇద్దరూ నవ్వుకున్నారు. 

ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ కాగా.. తన ఇన్‌స్టాలో షేర్‌ చేసిన వార్నర్‌.. ‘‘ఎవరు బాగా చేశారు?’’ అంటూ అభిమానులను అడిగాడు. ఇందుకు బదులుగా.. ‘‘మీరద్దరూ సూపర్‌.. మాకు కావాల్సినంత వినోదం. అయితే, మీరేం చేస్తున్నారో అర్థంకాక ఇద్దరి మధ్య అంపైర్‌ పిచ్చోడయ్యాడు’’ అని ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో ఢిల్లీపై 77 పరుగుల తేడాతో గెలుపొందిన చెన్నై ప్లే ఆఫ్స్‌ బెర్తు ఖరారు చేసుకుంది.

చదవండి: MI Vs SRH: ముంబైకి చావోరేవో.. యువ బ్యాటర్‌ రీఎంట్రీ! ఉమ్రాన్‌కు ‘లాస్ట్‌’ ఛాన్స్‌!
 Virat Kohli: ఫ్యాన్స్‌తో పెట్టుకుంటే చుక్కలే! మరోసారి నవీన్‌కు తెలిసొచ్చింది! చెత్తగా.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement