PC: IPL.com
ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ తన స్వదేశానికి వెళ్లిపోయాడు. తన భార్య సారా లోన్స్‌డేల్ బిడ్డకు జన్మనివ్వడంతో వుడ్ ఇంగ్లండ్‌కు పయనం అయ్యాడు.
ఈ నేపథ్యంలో తుది దశ ఐపీఎల్ మ్యాచ్‌లకు వుడ్ దూరం కానున్నాడు. కాగా ఈ టోర్నీ ఆరంభానికి ముందే వుడ్ తన నిర్ణయాన్ని లక్నో ఫ్రాంచైజీకి తెలియజేశాడు. ఇక ఈ విషయాన్ని వుడ్ కూడా సృష్టం చేశాడు. ఈ ఏడాది టోర్నీలో నాలుగు మ్యాచ్‌లు ఆడిన వుడ్ 11 వికెట్లు పడగొట్టాడు.
"నా భార్య పండింటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అందుకే స్వదేశానికి వెళ్లాలి అనుకుంటున్నాను. మళ్లీ కచ్చితంగా తిరిగి రావడానికి ప్రయత్నిస్తాను. నన్ను క్షమించిండి. ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడాను. ఆడిన మ్యాచ్‌ల్లో వికెట్లు కూడా పడగొట్టాను.
లక్నో వంటి ఫ్రాంచైజీలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. నా సహచర ఆటగాళ్లు, మెనెజ్‌మెంట్ అందరూ సపోర్ట్‌గా ఉంటారు. ఈ సీజన్‌లో మా జట్టు మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను" అని లక్నో పోస్ట్ చేసిన వీడియోలో వుడ్ పేర్కొన్నాడు.
ఇక ఇప్పటికే లక్నోకు కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా దూరం కాగా.. ఇప్పుడు వుడ్ కూడా జట్టును వీడడం లక్నో మెనెజ్‌మెంట్‌ను మరింత కలవరపెడుతుంది. ఈ ఏడాది సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన లక్నో ఐదింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.
చదవండి: #Venkatesh Iyer: క్లిష్ట పరిస్థితుల్లో తానున్నాంటూ బాధ్యత తీసుకున్నాడు! సంతోషంగా ఉంది!
Comments
Please login to add a commentAdd a comment