IPL 2023 RCB Vs LSG: టీమిండియా క్రికెటర్, లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ ఆవేశ్ ఖాన్.. ఆర్సీబీతో మ్యాచ్‌లో తన ప్రవర్తన పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. తాను అలా హెల్మెట్ విసిరి ఉండాల్సింది కాదన్నాడు. భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయానని.. ఏదేమైనా అలా అతి చేయడం తప్పేనని అంగీకరించాడు.
కాగా ఐపీఎల్-2023లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తొలిసారి తలపడిన మ్యాచ్‌లో లక్నో అనూహ్య రీతిలో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఓటమి తప్పదు అనుకున్న తరుణంలో ఆఖరి బంతికి బై రూపంలో పరుగు రావడంతో లక్నో జయకేతనం ఎగురవేసింది.
హెల్మెట్ తీసి నేలకేసి కొట్టి
చిన్నస్వామి స్టేడియంలో ఈ దృశ్యాన్ని చూసిన ఆర్సీబీ ఫ్యాన్స్ హృదయాలు ముక్కలు కాగా.. ఆ సమయంలో క్రీజులో ఉన్న ఆవేశ్ ఖాన్ ఓవర్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. హెల్మెట్ తీసి నేలకేసి కొట్టి దూకుడు ప్రదర్శించాడు. దీంతో ఆవేశ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.
సోషల్ మీడియాలో అతడిని దారుణంగా ట్రోల్ చేశారు. ఇక బీసీసీఐ సైతం ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు మందలించింది. మొదటి తప్పిదం కాబట్టి ఈసారికి వదిలేస్తున్నామంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవేశ్ ఖాన్ ఈ విషయంపై స్పందించాడు.
నా ప్రవర్తన వల్ల.. ఆ ఘటన తర్వాత
తాను ఓవరాక్షన్ చేయకుండా ఉండాల్సిందని పశ్చాత్తాపపడ్డాడు. ‘‘హెల్మెట్ విసరడం కాస్త ఓవర్ అయ్యింది. ఈ ఘటన కారణంగా సోషల్ మీడియాలో నాపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. నిజానికి గెలిచామన్న సంతోషంలో నేనలా చేశానే తప్ప ఎవరినీ కించపరచాలన్న ఉద్దేశం నాకు లేదు.
ఆ క్షణంలో అలా జరిగిపోయిందంతే! కానీ మైదానం వీడిన తర్వాతే నేనేం చేశానో నాకు తెలిసి వచ్చింది. ఆ విషయంలో ఇప్పటికీ నేను చింతిస్తున్నాను. అలా ఎందుకు చేశానన్న బాధ వెంటాడుతూనే ఉంది’’ అని ఆవేశ్ ఖాన్ పేర్కొన్నాడు.
కాగా ఐపీఎల్-2023లో ప్లే ఆఫ్స్‌నకు చేరుకున్న లక్నో.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై చేతిలో ఓడి ఇంటిబాట పట్టిన సంగతి తెలిసిందే. ఇక తాజా సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చాంపియన్‌గా నిలవగా.. గుజరాత్ టైటాన్స్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్ గెలవనంత మాత్రాన.. కెప్టెన్సీ నుంచి తొలగిస్తారా? ఇలా చేస్తే..
2011 ప్రపంచకప్ ఫైనల్ ఆడాడు.. ధోని సహచర ఆటగాడు! బస్ డ్రైవర్‌గా.. ఒక్కడే కాదు!
𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗚𝗔𝗠𝗘 🤯🤯🤯@LucknowIPL pull off a last-ball win!
— IndianPremierLeague (@IPL) April 10, 2023
A roller-coaster of emotions in Bengaluru 🔥🔥
Follow the match ▶️ https://t.co/76LlGgKZaq#TATAIPL | #RCBvLSG pic.twitter.com/96XwaYaOqT
Comments
Please login to add a commentAdd a comment