కోహ్లి- గంభీర్ వాగ్వాదం (PC: IPL Twitter)
IPL 2023 LSG Vs RCB: విరాట్ కోహ్లి- గౌతం గంభీర్ వివాదానికి కేంద్ర బిందువైన నవీన్ ఉల్ హక్ తీరుపై కింగ్ అభిమానులు మండిపడుతూనే ఉన్నారు. ఎదుటి వాళ్లను కవ్వించినపుడు.. మనం కూడా వాటిని స్వీకరించే గుణం కలిగి ఉండాలంటూ హితవు పలుకుతున్నారు.
షాహిద్ ఆఫ్రిది, మహ్మద్ అమీర్‌లాంటి వాళ్లతో పెట్టుకున్నా.. ఇపుడు కోహ్లితో గొడవపడితే ఏమవుతుందిలే అని లైట్ తీసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సోషల్ మీడియా వేదికగా కోహ్లి ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. ఇక తాజాగా నవీన్ చేసిన వ్యాఖ్యలపై జాతీయ మీడియాలో వస్తున్న కథనాలు వారికి మరింత కోపం తెప్పిస్తున్నాయి. ‘‘నీకు ఒక రూల్.. ఇతరులకు మరో రూల్ ఉండదన్న విషయం గుర్తుపెట్టుకో’’ అంటూ వార్నింగ్ ఇస్తున్నారు.
ఐపీఎల్-2023లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ సందర్భంగా వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. తొలుత ఆర్సీబీ పేసర్ మహ్మద్ సిరాజ్- నవీన్ మధ్య వాగ్వాదం జరుగగా.. కోహ్లి జోక్యంతో చిన్న గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది.
నవీన్‌తో మొదలైన వివాదం కోహ్లి- గంభీర్ వాగ్వాదం పెట్టుకునేంత వరకు సాగింది. కోహ్లికి సారీ చెప్పి కలిసిపోవాలని లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ చెప్పినా నవీన్ ససేమిరా అన్నాడు. ఇక మ్యాచ్ తర్వాత సోషల్ మీడియా వేదికగా కూడా కోహ్లితో నవీన్ పరోక్ష పోరుకు దిగడం విశేషం.
కోహ్లి తన్ ఇన్‌స్టా పోస్టులో.. ‘‘పైకి కనబడేదంతా నిజం కాదు’’ అన్న అర్థంలో కోట్ షేర్ చేయగా.. నవీన్ సైతం.. ‘‘నువ్వు ఏదైతే పొందేందుకు అర్హుడివో నీకు అదే దక్కుతుంది’’ అంటూ కౌంటర్ ఇవ్వడానికి ట్రై చేశాడు.
ఐపీఎల్ ఆడటానికి మాత్రమే వచ్చాను
ఇక తాజాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాళ్లు నవీన్‌కు సర్దిచెప్పే ప్రయత్నం చేయగా.. ‘‘నేను ఇక్కడికి ఐపీఎల్ ఆడటానికి మాత్రమే వచ్చాను. ఎవరెవరి చేతనో తిట్టించుకోవడానికి కాదు’’ అని కాస్త పొగరుగానే సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో కోహ్లి ఫ్యాన్స్.. ‘‘అందరూ ఆడటానికే వస్తారు. నీ సీనియర్ రషీద్ ఖాన్ ఎప్పటి నుంచో ఐపీఎల్ ఆడుతున్నాడు. కానీ ఇలాంటి వివాదాల జోలికి పోలేదు. వికెట్ తీసినపుడు నువ్వెంతలా సెలబ్రేట్ చేసుకుంటావో.. ఎదుటి వాళ్ల సంబరాలను చూసి కూడా కాస్త ఓర్వడం నేర్చుకో’ అని కామెంట్లు చేస్తున్నారు.
ఇంతకీ ఎవరీ నవీన్ ఉల్ హక్?
ఆఫ్గనిస్తాన్ యువ పేసర్ నవీన్ ఉల్ హక్ 2021లో ఐర్లాండ్‌పై ఆఫ్గాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 7 వన్డేలు ఆడిన నవీన్ 14 వికెట్లు తీశాడు.అఫ్గన్ తరఫున 27 టీ20లు ఆడి 34 వికెట్లు పడగొట్టాడు.
ఈ ఏడాదే ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు. ఐపీఎల్-2023 మినీవేలంలో 23 ఏళ్ల నవీన్‌ను రూ.50లక్షలకు లక్నో సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో నవీన్ 7 వికెట్లు సాధించాడు. కోహ్లితో గొడవ నేపథ్యంలో గత రెండ్రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు.
చదవండి: ధోని కాదు.. డీకే కూడా కాలేడు! ఇలాంటివి సహజం.. మా వల్లే ఒత్తిడిలో కూరుకుపోయి!
కోహ్లి- గంభీర్ గొడవ.. జరిగిందిదే! గౌతం ఆ మాట అనడంతో: ప్రత్యక్ష సాక్షి
Full video mil gyi match ki..#LSGvsRCB #gautamgambhir #ViratGambhirFight #VIRATKOHLI #naveenulhaq #KohliGambhir pic.twitter.com/DVO8S1zCvA
— Sipu 🇮🇳 (@shishpal10np) May 3, 2023
Comments
Please login to add a commentAdd a comment