గంభీర్‌తో కోహ్లి, మాక్స్‌వెల్ (PC: IPL/BCCI)
IPL 2023 LSG Vs RCB- #ViratGambhirFight: ‘‘మ్యాచ్ ముగిసిన తర్వాత మేయర్స్, విరాట్ పక్క పక్కనే నడుస్తూ ఏదో మాట్లాడుకుంటూ వెళ్లినట్లు టీవీలో కనిపించింది. తమ పట్ల పదే పదే ఎందుకు అభ్యంతకరంగా ప్రవర్తించావంటూ మేయర్స్.. కోహ్లిని అడిగాడు. అందుకు బదులుగా కోహ్లి.. నువ్వెందుకు నావైపు చూస్తూ ఉన్నావు అని కౌంటర్ ఇచ్చాడు.
అంతకంటే ముందు అమిత్ మిశ్రా.. విరాట్ కోహ్లి.. నవీన్ ఉల్ హక్‌ను పదే పదే తమను టీజ్ చేస్తున్నాడంటూ అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ పరిణామాలన్నిటినీ గౌతం గమనిస్తూనే ఉన్నాడు. పరిస్థితులు చేజారిపోతున్నాయని గ్రహించాడు. అందుకే మేయర్స్‌ను వెనక్కి లాగి.. కోహ్లితో మాట్లాడవద్దని చెప్పాడు. అప్పుడు విరాట్ వెంటనే మాట వదిలేశాడు.
ఆ తర్వాత ఇరువర్గాలు పరిణతి లేకుండా వ్యవహరించిన తీరు అందరికీ తెలిసిందే’’ అంటూ విరాట్ కోహ్లి- గౌతం గంభీర్ వివాదం గురించి నాటి మ్యాచ్‌లో పరిస్థితులను దగ్గరగా చూసిన ప్రత్యక్షసాక్షి ఒకరు పీటీఐతో వ్యాఖ్యానించారు. ఐపీఎల్-2023లో భాగంగా సోమవారం లక్నో సూపర్ జెయింట్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే.
దిగజారుడు ప్రవర్తన
ఆద్యంతం రసవత్తరంగా సాగిన ఈ పోరులో ఆర్సీబీ విజయం సాధించింది. సొంతమైదానంలో లక్నోను ఓడించి చిన్నస్వామి స్టేడియంలో తమకు ఎదురైన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ క్రమంలో ఆర్సీబీ ఆటగాళ్లు ముఖ్యంగా విరాట్ కోహ్లి లక్నో బ్యాటింగ్ సమయంలో దూకుడుగా వ్యవహరించడం.. తర్వాత గంభీర్‌తో గొడవ వివాదానికి దారితీసింది.
సస్పెండ్ చేస్తేనే
దీంతో కొంతమంది కోహ్లికి, మరికొంత మంది గంభీర్‌కు మద్దతుగా నిలుస్తుండగా.. గావస్కర్ వంటి దిగ్గజాలు.. జెంటిల్మన్ గేమ్‌కు మచ్చ తెచ్చిన వీరిద్దరినీ సస్పెండ్ చేయాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వివాద సమయంలో అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షి ఒకరు వార్తా సంస్థ పీటీతో ముచ్చటిస్తూ అక్కడ ఏం జరిగిందో వివరించే ప్రయత్నం చేశారు.
వాళ్లను తిడితే నా ఫ్యామిలీని తిట్టినట్లే
కోహ్లి- గంభీర్ ఎదురుపడిన తర్వాత.. ‘‘కోహ్లిని పిలిచి గౌతం.. ఏంటి? నువ్వసలు ఏం మాట్లాడుతున్నావు? అని అడిగాడు. అందుకు బదులిస్తూ.. ‘‘నేను మిమ్మల్నేమీ అనలేదే! అయినా మధ్యలో మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారు?’’ అని విరాట్ ప్రశ్నించాడు.
అదుపులో పెట్టుకుంటే మంచిది
కోహ్లి మాటలకు గౌతం స్పందిస్తూ.. ‘‘నువ్వు మా జట్టు ఆటగాళ్లను తిడుతున్నావంటే నా కుటుంబంలోని వ్యక్తిని తిట్టినట్లే’’ అని పేర్కొన్నాడు. కోహ్లి కూడా ఏమాత్రం తగ్గకుండా.. అవునా.. అయితే, మీ కుటుంబ సభ్యులను అదుపులో పెట్టుకోండి అని జవాబిచ్చాడు.
తోటి ప్లేయర్లు గొడవ పడుతున్న వీరిద్దరినీ విడదీసే క్రమంలో.. గంభీర్ చివర్లో.. ‘‘అయితే, ఇప్పుడు నేను నీ దగ్గర పాఠాలు నేర్చుకోవాలంటావు!’’ అంటూ కోహ్లిని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు’’ అని సదరు వ్యక్తి కోహ్లి- గంభీర్ మధ్య జరిగిన వాడివేడి సంభాషణ గురించి తెలిపారు.
చదవండి: అత్యుత్తమ గణాంకాలు.. షమీపై సంచలన ఆరోపణలు! అరెస్టు చేయాలంటూ సుప్రీం కోర్టులో
IPL 2023: ఐపీఎల్ జట్టుకు కొత్త కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment