IPL 2023 LSG Vs RCB: Virat Kohli Cryptic Post After Heated Exchange With Gambhir Goes Viral - Sakshi
Sakshi News home page

#Virat Kohli: షాకిచ్చిన బీసీసీఐ! పైకి కనబడేదంతా నిజం కాదు.. కోహ్లి పోస్ట్‌ వైరల్‌! ఫ్యాన్స్‌ ఫైర్‌

Published Tue, May 2 2023 11:10 AM | Last Updated on Tue, May 2 2023 11:47 AM

IPL 2023: Virat Kohli Cryptic Post After Heated Exchange With Gambhir Viral - Sakshi

వివాదం నేపథ్యంలో లక్నో ఆటగాళ్లతో కోహ్లి (PC: IPL)

IPL 2023- Kohli Vs Gambhir: ఐపీఎల్‌-2023లో లక్నో సూపర్‌ జెయింట్స్‌- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మధ్య సోమవారం నాటి మ్యాచ్‌ ప్రేక్షకులకు మజాను అందించింది. నువ్వా- నేనా అంటూ హోరాహోరీగా సాగిన పోరులో సొంతమైదానంలో తమకు ఎదురైన పరాభవానికి ఆర్సీబీ ఎట్టకేలకు ప్రతీకారం తీర్చుకుంది. ఆద్యంతం నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో డుప్లెసిస్‌ బృందం 18 పరుగుల తేడాతో లక్నోను చిత్తు చేసింది.

126 పరుగులకే ఆర్సీబీ కథ ముగియడంతో సంబరాలు చేసుకున్న లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ఊహించని షాకిచ్చింది. సమష్టి ప్రదర్శనతో.. సూపర్‌జెయింట్స్‌పై గెలుపొందింది. ఇదిలా ఉంటే.. లక్ష్య ఛేదనకు దిగిన లక్నో పరుగుల ఖాతా తెరవక ముందే వికెట్‌ కోల్పోవడంతో ఆర్సీబీ స్టార్లు విరాట్‌ కోహ్లి, డుప్లెసిస్‌ సహా మిగతా ఆటగాళ్లంతా తమదైన శైలిలో సెలబ్రేషన్స్‌ చేసుకున్నారు.

కోహ్లి దూకుడు మామూలుగా లేదు
ఇక ఒక్కో వికెట్‌ పడటం, అద్బుత ఫీల్డింగ్‌తో రనౌట్ల రూపంలో ప్రత్యర్థిని దెబ్బకొట్టడం వంటి పరిణామాల నేపథ్యంలో రన్‌మెషీన్‌ కోహ్లి సంతోషం అంబరాన్నింటింది. చిన్నస్వామి స్టేడియంలో లక్నో గెలుపు తర్వాత ఆ జట్టు మెంటార్‌ గౌతం గంభీర్‌ ఆర్సీబీ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి చేసిన సైగలకు.. కౌంటర్‌ ఇచ్చాడు కోహ్లి.

షాకిచ్చిన బీసీసీఐ
మ్యాచ్‌ ఆద్యంతం ఫుల్‌ ఎనర్జీతో దూకుడుగా కనిపిస్తూ.. ముద్దులు విసురుతూ తనదైన స్టైల్లో రెచ్చిపోయాడు. ఈ క్రమంలో లక్నో ఆటగాడు నవీన్‌ ఉల్‌ హక్‌తో వివాదం, మ్యాచ్‌ అనంతరం గంభీర్‌తో వాగ్వాదం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అనుచిత ప్రవర్తన కారణంగా కోహ్లి, గంభీర్‌లకు.. బీసీసీఐ భారీ జరిమానా రూపంలో పనిష్‌మెంట్‌ ఇచ్చింది.

చూసేదంతా నిజం కాదు
ఈ నేపథ్యంలో కోహ్లి ఇన్‌స్టా పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ‘‘మనం వినే ప్రతీ విషయం ఎవరో ఒకరి అభిప్రాయం మాత్రమే. అదే నిజం కాదు. మనం చూసే ప్రతీది వాస్తవం కాదు. మన దృక్కోణానికి సంబంధించింది మాత్రమే’’ అనే అర్థం ఉన్న కోట్‌ను కోహ్లి షేర్‌ చేశాడు.

గంభీర్‌తో వివాదం అనంతరం విరాట్‌ ఈ మేరకు పోస్ట్‌ పెట్టడం గమనార్హం. కాగా నవీన్‌, గంభీర్‌తో కోహ్లి వివాదం నేపథ్యంలో కింగ్‌ అభిమానులు అతడికి అండగా నిలుస్తుండగా.. మరికొంత మంది మాత్రం కోహ్లి అతి తగ్గించుకుంటే మంచిదంటూ సోషల్‌ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. దీంతో కోహ్లి ఫ్యాన్స్‌ ఘాటు వ్యాఖ్యలతో కౌంటర్‌ ఇస్తూ మండిపడుతున్నారు.

చదవండి: ఎందుకు వస్తున్నాడో తెలియదు.. చెత్త బ్యాటింగ్‌! ఇంకా జట్టులో అవసరమా? తీసిపడేయండి
IPL 2023: ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ వల్ల జరిగిందిదే! అందుకే ఇలా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement