విరాట్ కోహ్లి (PC: RCB/IPL)
Virat Kohli's Savage Response- Sweet Win vs LSG: ‘‘ఒకవేళ నువ్వు ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే.. తిరిగి తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. అలాలేని పక్షంలో ఎదుటివాళ్లకు ఏదో ఒకటి ఇవ్వాలనే సాహసం చేయకూడదు’’ అంటూ టీమిండియా స్టార్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ విరాట్ కోహ్లి తనను విమర్శించిన వాళ్ల నోళ్లు మూయించాడు. లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్‌ను ఉద్దేశించి పరోక్షంగా కౌంటర్ ఇచ్చాడు.
రచ్చ రచ్చ
ఐపీఎల్-2023లో లక్నో వేదికగా కేఎల్ రాహుల్ సేనతో ఆర్సీబీ పోరు నేపథ్యంలో నవీన్ ఉల్ హక్, గంభీర్‌లతో కోహ్లికి వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. చిన్నస్వామి స్టేడియంలో గత మ్యాచ్‌లో గంభీర్ ఆర్సీబీ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి చేసిన సైగకు బదులుగా.. కోహ్లి ప్రేమను పంచాలంటూ తమ కెప్టెన్ డుప్లెసిస్‌కు ముద్దులు విసిరాడు. తమకు మద్దతుగా నిలిచిన ప్రేక్షకులను మరింత ఉత్సాహపరుస్తూ ఆద్యంతం దూకుడు ప్రదర్శించాడు.
ఇక ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 18 పరుగుల తేడాతో లక్నోను ఓడించడంతో ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం డ్రెసింగ్ రూంలో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ తమ అధికారిక ట్విటర్‌లో షేర్ చేసింది.
వాళ్లు మనల్ని ఎంత ఇష్టపడుతున్నారో తెలిసింది
ఇందులో కోహ్లి మాట్లాడిన మాటలు హైలైట్‌గా నిలిచాయి. ‘‘ఇక్కడ మేము విజయం సాధించడం అత్యంత ముఖ్యమైనది. అలాంటి సమయంలో మా సొంత మైదానంలో కంటే కూడా ఇక్కడే(లక్నో) ప్రేక్షకుల నుంచి ఎక్కువ మద్దతు లభించడం విశేషం.
మధుర విజయం
ఈ అనుభూతి ఎంతో బాగుంది. జట్టుగా మనల్ని వాళ్లు ఎంతగా ఇష్టపడుతున్నారో అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. వాళ్లు మనకు పూర్తిగా మద్దతు ఇచ్చారు. నిజంగా ఇది మర్చిపోలేని మధుర విజయం.
మనం సంతోషించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. పట్టుదలగా నిలబడి ప్రతి ఒక్కరు తమ వంతు పాత్ర పోషించిన తీరు అద్భుతం. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో మనం సఫలమయ్యాం’’ అని కోహ్లి స్పూర్తిదాయక ప్రసంగం చేశాడు.
కోహ్లి అత్యుత్తమ వర్షన్ చూశాం కదా!
అదే సమయంలో గంభీర్, నవీన్‌లతో గొడవకు దారి తీసిన పరిస్థితులను పరోక్షంగా ప్రస్తావిస్తూ పనిలో పనిగా గట్టి కౌంటర్ కూడా ఇచ్చిపడేశాడు. ఇక ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మాట్లాడుతూ.. ‘‘విరాట్‌లోని అత్యుత్తమ వర్షన్‌ని చూశాం కదా? అవునా కాదా? నా పని కేవలం మైదానంలో అందరితో కామ్‌గా డీల్ చేయడమే. ఏదేమైనా మన కర్తవ్యాన్ని మనం పూర్తిం చేశాం’’ అంటూ గెలుపు పట్ల సంతోషం వ్యక్తం చేశాడు.
చదవండి: టెస్టుల్లో నంబర్‌వన్‌గా టీమిండియా
నేపాల్ సంచలనం.. ఇండియా, పాకిస్తాన్‌లతో కలిసి! ఇంతకీ టోర్నీ సంగతేంటి?
LSG v RCB, Game Day Dressing Room Reactions
— Royal Challengers Bangalore (@RCBTweets) May 2, 2023
King Kohli reacts to the win, Faf explains the crucial partnership and how Virat’s aggression helps the team, Karn and Hazlewood talk about their performances, before the team sang the victory song. Watch Game Day for more…#PlayBold pic.twitter.com/Jr0kCzYoIa
Comments
Please login to add a commentAdd a comment