IPL 2023, RCB Vs LSG: Avesh Khan reprimanded for code of conduct breach - Sakshi
Sakshi News home page

Avesh Khan: ఓవరాక్షన్‌కు తప్పదు భారీ మూల్యం! ‘ఆవేశ్‌’ ఖాన్‌కు ఊహించని షాక్‌!

Published Tue, Apr 11 2023 11:34 AM | Last Updated on Tue, Apr 11 2023 11:51 AM

IPL 2023 RCB Vs LSG: Avesh Khan Reprimanded For Code Of Conduct Breach - Sakshi

హెల్మెట్‌ను నేలకేసి కొట్టిన ఆవేశ్‌ ఖాన్‌ (PC: IPL/BCCI)

IPL 2023- Avesh Khan Throws Helmet To Celebrate: ఓటమి తప్పదనుకున్న వేళ అనూహ్యంగా విజయం వరిస్తే.. ఆనందంతో ఎగిరి గంతులేయడంలో తప్పులేదు. కానీ శ్రుతిమించి హద్దులు దాటితే మాత్రం భారీ మూల్యం చెల్లించక తప్పదు. టీమిండియా పేసర్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ బౌలర్‌ ఆవేశ్‌ ఖాన్‌కు ఇలాంటి హెచ్చరికనే జారీ చేశారు ఐపీఎల్‌ నిర్వాహకులు.

చెలరేగిన కోహ్లి, డుప్లెసిస్‌
ఐపీఎల్‌-2023లో భాగంగా బెంగళూరు వేదికగా రాయల్‌ చాలెంజర్స్‌- లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య సోమవారం మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది.

ఫాఫ్‌ డుప్లెసిస్‌ (46 బంతుల్లో 79 నాటౌట్‌; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), విరాట్‌ కోహ్లి (44 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (29 బంతుల్లో 59; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో చెలరేగారు. తొలి వికెట్‌కు కోహ్లితో 96 పరుగులు (69 బంతుల్లో) జోడించిన డుప్లెసిస్, రెండో వికెట్‌కు మ్యాక్స్‌వెల్‌తో 115 పరుగులు (50 బంతుల్లో) జత చేశాడు.

పూరన్‌ మ్యాచ్‌ను లాగేసుకున్నాడు
అనంతరం లక్నో 20 ఓవర్లలో 9 వికెట్లకు 213 పరుగులు సాధించి గెలిచింది. స్టొయినిస్‌ (30 బంతుల్లో 65; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ నికోలస్‌ పూరన్‌ (19 బంతుల్లో 62; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడగా, ఆయుష్‌ బదోని (24 బంతుల్లో 30; 4 ఫోర్లు) కీలక పరుగులు సాధించాడు. ఆఖర్లో బై రూపంలో వచ్చిన పరుగు లక్నో గెలుపును ఖరారు చేసింది.

వైల్డ్‌ సెలబ్రేషన్‌.. ఓవరాక్షన్‌ వద్దు
ఈ నేపథ్యంలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. క్రీజులో ఉన్న ఆవేశ్‌ ఖాన్‌ అయితే మరీ దూకుడుగా ప్రవర్తించాడు. హెల్మెట్‌ నేలకేసి కొట్టి వైల్డ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నాడు. ఈ దృశ్యాలు ఇప్పటికే సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా.. ఆర్సీబీ ఫ్యాన్స్‌ అతడికి చురకలు అంటిస్తున్నారు.

ఆవేశ్‌ ఖాన్‌కు మందలింపు
తాజాగా.. ఐపీఎల్‌ నిర్వాహకులు సైతం మితిమీరి ప్రవర్తించిన ఆవేశ్‌ ఖాన్‌ను మందలిస్తూ ప్రకటన విడుదల చేశారు. ‘‘ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఆవేశ్‌ ఖాన్‌ను మందలింపుగా ఈ ప్రకటన. మిస్టర్‌ ఆవేశ్‌ ఐపీఎల్‌ కోడ్‌లోని 2.2 నిబంధనను అతిక్రమించాడు’’ అని పేర్కొన్నారు. మొదటి తప్పిదం కావున మందలింపుతో సరిపెడుతున్నట్లు వెల్లడించారు.

చదవండి: IPL 2023: కాస్త హుందాగా ప్రవర్తించు గంభీర్‌! మీకు మా కోహ్లి చేతిలో ఉందిలే! 
RCB Vs LSG: ఓటమి బాధలో ఉన్న ఆర్సీబీకి మరో షాక్‌.. భారీ జరిమానా
ఎంత పనిచేశావు కార్తీక్‌.. లేదంటేనా? అయ్యో ఆర్సీబీ! వీడియో వైరల్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement