photo credit: IPL Twitter
ఐపీఎల్-2023 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మార్క్ వుడ్ నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్ధి బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌లో 9 వికెట్లు పడగొట్టిన వుడ్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఇవాళ (ఏప్రిల్ 10) జరిగిన మ్యాచ్‌లో ఓ ఓవర్‌లో ఏకంగా జెట్ స్పీడ్‌తో బంతులు సంధించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో వుడ్ వేసిన 7 బంతులు (ఓ వైడ్ కలుపుకుని) 150 కిమీకి పైగా వేగంతో బౌల్ చేశాడు.
తొలి బంతి (వైడ్) 150కిమీ వేగంతో వేసిన వుడ్ ఆ తర్వాత బంతులను153, 151, 150, 150, 151.7, 150కిమీల వేగంతో బౌల్ చేశాడు. ఓవర్‌లో ప్రతి బంతి ఇంత వేగంతో బౌల్ చేయడమనేది చాలా అరుదుగా జరుగుతుంది. అయితే ఇటీవలి కాలంలో వుడ్ మాత్రం ప్రతి బంతిని దాదాపు ఇంతే వేయడం బౌల్ చేయడం విశేషం. ఆర్సీబీతో మ్యాచ్‌లో తొలి ఓవర్ నుంచే రాకెట్ వేగంతో బౌలింగ్ చేసిన వుడ్.. తొలి ఓవర్‌లో 14 పరుగులు, రెండో ఓవర్‌లో 5 పరుగులు, మూడో ఓవర్‌లో 9 పరుగులు, నాలుగో ఓవర్‌లో 9 పరుగులు సమర్పించుకుని, నాలుగో ఓవర్‌లో మ్యాక్స్‌వెల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. విరాట్ కోహ్లి (44 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), డుప్లెసిస్ (46 బంతుల్లో 79 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్ (29 బంతుల్లో 59; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో వికెట్ నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. అమిత్ మిశ్రా, మార్క్ వుడ్‌కు తలో వికెట్ దక్కింది. ఛేదనలో ఆదిలోనే వికెట్లు కోల్పోయిన లక్నో.. 11.1 ఓవర్ల తర్వాత సగం వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment