PC: IPL Twitter
ఐపీఎల్-2023 ప్లే ఆఫ్స్ బెర్తులు రసవత్తరంగా మారాయి. నేడు (మే 18, ఆర్సీబీ వర్సెస్ సన్‌రైజర్స్), రేపు (మే 19, పంజాబ్, రాజస్థాన్) జరుగబోయే మ్యాచ్‌లతో ప్లే ఆఫ్స్ బెర్తులపై ఓ క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్‌ను పక్కన పెడితే.. ప్లే ఆఫ్స్ రేసులో అనధికారికంగా ఐదు జట్లు (సీఎస్‌కే, లక్నో, ముంబై, ఆర్సీబీ, రాజస్థాన్) ఉన్నాయి.
ఈ ఐదింటిలో మూడు జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటే, రెండు జట్లు లీగ్ నుంచి నిష్క్రమిస్తాయి. ఈ క్రమంలో కొందరు క్రేజీ అభిమానులు ఆర్సీబీ-లక్నో జట్లు ఫైనల్లో తలపడితే మజా ఉంటుందని ఆశిస్తున్నారు. కోహ్లి-గంభీర్‌ల మధ్య వివాదాల నేపథ్యంలో ఇలాంటి ఫైనల్ జరిగితే రసవత్తరంగా ఉంటుందని వారు భావిస్తున్నారు. ఈ రెండు జట్లు ఫైనల్‌కు చేరితే సగటు అభిమానికి కావాల్సినంత మజా దొరుకుతుందని అనుకుంటున్నారు. మరి ఆర్సీబీ-లక్నో జట్లు ఫైనల్‌కు చేరాలంటే తదుపరి జరుగబోయే మ్యాచ్‌ల్లో ఏ జట్లు గెలవాలో ఓ సారి పరిశీలిద్దాం.
- సన్‌రైజర్స్‌పై ఇవాల్టి మ్యాచ్‌లో ఆర్సీబీ గెలవాలి
- రాజస్థాన్‌పై పంజాబ్ గెలవాలి
- సీఎస్‌కేపై ఢిల్లీ గెలవాలి
- కేకేఆర్‌పై లక్నో గెలవాలి
- ముంబైపై సన్‌రైజర్స్ గెలవాలి
- గుజరాత్‌పై ఆర్సీబీ గెలవాలి
అప్పుడు టేబుల్ టాపర్‌గా గుజరాత్ (18), రెండో స్థానంలో లక్నో (17), మూడో ప్లేస్‌లో ఆర్సీబీ (16), నాలుగో స్థానంలో సీఎస్‌కే (15) ఉంటాయి.
ఇదే జరిగితే..
- క్వాలిఫయర్-1లో గుజరాత్-లక్నో (లక్నో గెలవాలి)
- ఎలిమినేటర్‌లో ఆర్సీబీ-సీఎస్‌కే (ఆర్సీబీ గెలవాలి)
- క్వాలిఫయర్-2లో ఆర్సీబీ-గుజరాత్ (ఆర్సీబీ గెలవాలి) తలపడతాయి.
పై పేర్కొన్న విధంగా అన్ని జరిగితే ఐపీఎల్ 2023 ఫైనల్లో లక్నో-ఆర్సీబీ తలపడే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment