DC VS GT: Two Continuous Low Scoring Thrillers In IPL 2023 - Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ 2023లో ఏం జరుగుతోంది..? ఆ రెండు మ్యాచ్‌లు ఫిక్స్‌ అయ్యాయి..!

Published Wed, May 3 2023 7:57 AM | Last Updated on Wed, May 3 2023 8:37 AM

DC VS GT: Two Continuous Low Scoring Thrillers In IPL 2023 - Sakshi

ఐపీఎల్‌-2023లో ఫస్ట్‌ ఆఫ్‌ మ్యాచ్‌లు అయిపోయాక ఒక్కసారిగా భారీ మార్పులు సంభవిస్తున్నాయి. బ్యాటర్లకు స్వర్గధామంగా ఉన్న పిచ్‌లు ఉన్నట్లుండి బౌలర్లకు పెద్ద ఎత్తున సహకరిస్తున్నాయి. బ్యాటర్ల హవా కొనసాగిన మైదానాల్లో బౌలర్లు రాజ్యమేలుతున్నారు. రాజస్థాన్‌ రాయల్స్‌-ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఆయా జట్లు అతి స్వల్ప స్కోర్లను డిఫెండ్‌ చేసుకోగలిగాయి.

అంతకుముందు వరకు పరిస్థితి వేరేలా ఉండేది. దాదాపు ప్రతి మ్యాచ్‌లో రెండు జట్లు అలవోకగా 200 స్కోర్‌ను దాటేవి. ఉన్నట్లుండి ఈ మార్పుకు కారణమేంటని అభిమానులు చర్చింకుంటున్నారు. ఆర్సీబీ-లక్నో, ఢిల్లీ-గుజరాత్‌ మ్యాచ్‌లు ఫిక్స్‌ అయ్యాయా అని అనుమానులు వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు మ్యాచ్‌ల్లో బౌలర్లు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారన్నది కాదనలేని సత్యమే అయినప్పటికీ, ఇదే వేదికలపై గతంలో పరుగుల వరద పారిన విషయాన్ని మరచిపోకూడదు.

బ్యాటర్లకు ఓ రేంజ్‌లో సహకరించిన పిచ్‌లు ఒక్కసారిగా స్లో పిచ్‌లుగా మారి బౌలర్ల పిచ్‌లుగా మారాయంటే ఏదో జరుగుతుందని అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. గత రెండు మ్యాచ్‌లు సాగిన వైనం కూడా అభిమానుల అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. పిచ్‌ బ్యాటర్లకు సహకరిస్తుందని అర్ధం వచ్చేలా టాస్‌ గెలిచిన జట్లు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాయి. ఆతర్వాత అతి స్వల్ప స్కోర్లను విజయవంతంగా డిఫెండ్‌ చేసుకున్నాయి.

పైగా ఈ రెండు మ్యాచ్‌ల్లో ఓడిన జట్లు (లక్నో, గుజరాత్‌) హాట్‌ ఫేవరెట్‌ జట్లు. స్వల్ప లక్ష్య ఛేదనలో విధ్వంసకర బ్యాటర్లు ఉన్న జట్లు ఒక్కో పరుగు చేసేందుకు ఆపసోపాలు పడ్డాయి. ఆర్సీబీ-లక్నో మ్యాచ్లో ఇది స్పష్టంగా కనిపించింది. ఈ మ్యాచ్‌లో లక్నో ఓటమిని ముందుగానే ఖరారు చేసి, ప్రజల దృష్టిని మరల్చేందుకు ఐపీఎల్‌ యాజమాన్యం ఉద్దేశపూర్వకంగానే కోహ్లి-నవీన్‌ ఉల్‌ హాక్‌-గంభీర్‌ల డ్రామాను  తెరపైకి తెచ్చిందని కొందరు అభిమానులు అనుకుంటున్నారు.

మరికొందరైతే బెట్టింగ్‌ మాఫియాను ప్రోత్సహించేందుకు తక్కువ  అంచనాలు కలిగిన జట్లను ఐపీఎల్‌ యాజమాన్యమే గెలిపిస్తుందని చర్చించుకుంటున్నారు. క్రికెట్‌ పరిజ్ఞానం, ఐపీఎల్‌ ఫాలో అయిన అనుభవం ఉన్న కొందరైతే, ఏ మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందో ముందే చెప్పేస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా లీగ్‌ సాగబోయే తీరును వారు ముందే పసిగడుతున్నారు. మ్యాచ్‌లు వన్‌ సైడెడ్‌గా సాగితే (బ్యాటర్లకు సహకారం​) కూడా జనాలు చూడరని, బెట్టింగ్‌లు కాసే వారు సులువుగా మ్యాచ్‌ తీరును అంచనా వేయగలుగుతున్నారని ఐపీఎల్‌ యాజమాన్యమే ఇలాంటి స్క్రిప్టెడ్‌ గేమ్స్‌ను ప్లాన్‌ చేస్తుందని ఇంకొందరు ఆరోపిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement