List Of Records Broken By Ravichandran Ashwin In Test Series Against West Indies, Know In Details - Sakshi
Sakshi News home page

R Ashwin Test Records: అశ్విన్‌ మాయాజాలం; బ్యాటర్లే కాదు రికార్డులైనా దాసోహం అనాల్సిందే

Published Sat, Jul 15 2023 8:16 AM | Last Updated on Sat, Jul 15 2023 10:02 AM

Look About Records Broken-Ravichandran Ashwin 12 Wickets 1st Test Vs WI - Sakshi

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్‌ 141 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తన స్పిన్‌ మాయాజాలంతో విండీస్‌ను ముప్పతిప్పలు పెట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు.. రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు మొత్తంగా 131 పరుగులిచ్చి 12 వికెట్లు తీసి కెరీర్‌ బెస్ట్‌ ప్రదర్శన నమోదు చేశాడు. ఈ క్రమంలో అశ్విన్‌ పలు రికార్డులను బద్దలుకొట్టాడు. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం.

‍► అశ్విన్‌కు టెస్టుల్లో ఇది 8వ 10 వికెట్ల హాల్‌. టీమిండియా తరపున అత్యధిక పది వికెట్ల హాల్‌ అందుకున్న జాబితాలో అనిల్‌ కుంబ్లేతో కలిసి సంయుక్తంగా ఉన్నాడు. కుంబ్లే కూడా 8సార్లు పది వికెట్ల హాల్‌ అందుకున్నాడు. ఇక హర్బజన్‌ సింగ్‌ ఐదుసార్ల పది వికెట్ల హాల్‌ సాధించాడు. 

‍► ఇక విదేశాల్లో టీమిండియా తరపున బెస్ట్‌ బౌలింగ్‌ ప్రదర్శన నమోదు చేసిన జాబితాలో అశ్విన్‌ చోటు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో తొలి స్థానంలో భగవత్‌ చంద్రశేఖర్‌(1977లో  మెల్‌బోర్న్‌ వేదికగా ఆస్ట్రేలియాపై 12/104), ఇర్ఫాన్‌ పఠాన్‌(2005లో హరారే వేదికగా జింబాబ్వేపై 12/126), తాజాగా అశ్విన్‌(2023లో వెస్టిండీస్‌పై 12/131), అనిల్‌ కుంబ్లే( 2004లో సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాపై 12/279), ఇర్ఫాన్‌ పఠాన్‌(2004లో డాకా వేదికగా బంగ్లాదేశ్‌పై 11/96) ఉన్నారు.

‍► ఇక వెస్టిండీస్‌పై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన టీమిండియా బౌలర్లలో అశ్విన్‌ నాలుగో స్థానంలో నిలిచాడు. తాజా ప్రదర్శనతో కలిపి అశ్విన్‌ ఇప్పటివరకు విండీస్‌పై 72 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్‌ కంటే ముందు కపిల్‌ దేవ్‌(89 వికెట్లు), మాల్కమ్‌ మార్షల్‌(76 వికెట్లు), అనిల్‌ కుంబ్లే(74 వికెట్లు), శ్రీనివాస్‌ వెంకటరాఘవన్‌(68 వికెట్లు) ఉన్నారు.

‍► ఒక టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడం అశ్విన్‌కు ఇది ఆరోసారి. ఈ జాబితాలో ముత్తయ్య మురళీధరన్‌ 11 సార్లు ఈ ఫీట్‌ నమోదు చేసి అగ్రస్థానంలో ఉండగా.. రంగనా హెరాత్‌ 8సార్లు, సిడ్నీ బార్నెస్‌ ఆరు సార్లు ఈ ఫీట్‌ సాధించాడు.

చదవండి: WI Vs IND: మూడు రోజుల్లోనే ముగించారు.. విండీస్‌పై ఇన్నింగ్స్‌ విజయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement