టీమిండియా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక అరుదైన ఘనత సాధించాడు. ఇదే టెస్టులో రెండు వికెట్లు తీయడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో 700 వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించిన అశ్విన్ మరో ఘనత కూడా అందుకున్నాడు. మ్యాచ్ ద్వారా తండ్రీ కొడుకులిద్దరినీ టెస్టు క్రికెట్‌లో అవుట్ చేసిన తొలి భారత బౌలర్‌గా అశ్విన్ గుర్తింపు తెచ్చుకున్నాడు.
2011లో తన తొలి టెస్టులో శివ్‌నారాయణ్ చందర్‌పాల్ వికెట్ తీసిన అశ్విన్.. తాజాగా తేజ్‌నరైన్ చందర్‌పాల్‌ను అవుట్ చేశాడు. గతంలో బోథమ్, వసీమ్ అక్రమ్, మిచెల్ స్టార్క్, సైమన్ హార్మర్ ఇలాంటి ఫీట్‌ను నమోదు చేశారు.
ఇయాన్ బోథమ్:లాన్స్ కెయిన్స్, క్రిస్ కెయిన్స్
వసీం అక్రమ్:లాన్స్ కెయిన్స్, క్రిస్ కెయిన్స్
మిచెల్ స్టార్క్: శివనరైన్, తేజ్‌నరైన్ చందర్‌పాల్
సైమన్ హార్మర్: శివనరైన్, తేజ్‌నరైన్ చందర్‌పాల్
ఆర్ అశ్విన్: శివనరైన్, తేజ్‌నరైన్ చందర్‌పాల్
The moment Ravi Ashwin created history!
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 12, 2023
The first Indian to pick the wicket of father (Shivnarine) and son (Tagenarine) in Tests. pic.twitter.com/nvqXhLz0ze
33వ సారి ఐదు వికెట్ల హాల్.. అండర్సన్ రికార్డు బద్దలు
ఇక టెస్టు క్రికెట్‌లో అశ్విన్ ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడం ఇది 33వ సారి. ఈ క్రమంలో ఇంగ్లండ్ స్టార్ జేమ్స్ అండర్సన్‌ను అధిగమించాడు. అండర్సన్ 32 సార్లు ఐదు వికెట్ల హాల్ అందుకున్నాడు. ఇక అశ్విన్ కంటే ముందు ఐదుగురు బౌలర్లు ఎక్కువసార్లు ఐదు వికెట్ల హాల్‌ను అందుకున్నారు. తొలి స్థానంలో ముత్తయ్య మురళీధరన్ 67 సార్లు(133 టెస్టులు), షేన్ వార్న్ 37 సార్లు(145 మ్యాచ్‌లు), రిచర్డ్ హడ్లీ 36 సార్లు(86 మ్యాచ్‌లు), అనిల్ కుంబ్లే 35 సార్లు(132 మ్యాచ్‌లు), రంగనా హెరాత్ 34 సార్లు( 93 మ్యాచ్‌లు) ఉన్నారు.
చదవండి: అశ్విన్ పాంచ్ పటాకా.. ఆకట్టుకున్న జైశ్వాల్, తొలిరోజు టీమిండియాదే
Comments
Please login to add a commentAdd a comment