రోసియు (డొమినికా): భారత సీనియర్ స్పిన్నర్ అశ్విన్ (7/71) స్పిన్ వలలో విండీస్ బ్యాటర్లు విలవిలలాడారు. దీంతో తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్, 141 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ టెస్టు మొదలైనప్పటి నుంచి ప్రతి రోజు, ప్రతి సెషన్‌లో కూడా భారత్ హవానే కొనసాగింది. దీంతో మూడే రోజుల్లో రోహిత్ సేన మ్యాచ్‌ను ముగించి కొత్త ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యటీసీ)కు ఘనంగా శ్రీకారం చుట్టింది. శుక్రవారం 27/2 స్కోరు వద్ద టీ విరావనికి వెళ్లిన వెస్టిండీస్ ఆఖరి సెషన్‌లో మిగతా 8 వికెట్లను కోల్పోయింది.
రెండో ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు 50.3 ఓవర్లలో 130 పరుగులకే కుప్పకూలింది. కరీబియన్ గడ్డపై శుభారంభం చేసిన భారత్ రెండు టెస్టుల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో నిలింది. రెండో టెస్టు ఈ నెల 20 నుం పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరుగుతుంది. ఆఖరి సెషన్ కాదు...అశ్విన్ సెషన్! వన్నె తగ్గని వెటరన్ స్పిన్నర్ మాయాజాలానికి ఆఖరి సెషన్ కాస్తా అశ్విన్ సెషన్‌గా వరింది. టీ బ్రేక్ తర్వాత అతని స్పిన్ ఉచ్చులో విండీస్ క్కుకుంది.
ఈ సెషన్లో పడిన 8 వికెట్లలో 6 వికెట్లు అశ్విన్‌వే కావడం విశేషం. అలిక్ అతనజ్ (28; 5 ఫోర్లు), హోల్డర్ (20 నాటౌట్; 1 సిక్స్) కొద్ది సేపు నిలవగలిగారు. లోయర్ ఆర్డర్‌లో అల్జారి జోసెఫ్ (13) నుం... కార్న్‌వాల్ (4), కీమర్ రోచ్ (0), ఆఖరి వికెట్ వారికన్ (18) వరకు వరుస నాలుగు వికెట్లు అశ్విన్ బౌలింగ్‌లోనే పడ్డాయి. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన అశ్విన్ ఈ టెస్టులో మొత్తం 12 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
కుంబ్లే సరసన
ఒక టెస్టులో అశ్విన్ పది వికెట్ల ఘనత నమోదు చేయడం ఇది ఎనిమిదో సారి. భారత బౌలర్లలో అనిల్ కుంబ్లే (8)ను అతను సమం చేశాడు. తొలి టెస్టులోనే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన ఎనిమిదో భారత క్రికెటర్ యశస్వి. అతనికంటే ముందు ప్రవీణ్ అమ్రే, ఆర్పీ సింగ్, అశ్విన్, ధావన్, రోహిత్, పృథ్వీ షా, శ్రేయస్ ఈ ఫీట్ సాధించారు.
చదవండి Rohit Sharma: అరంగేట్రంలో వాళ్లిద్దరు అలా! ఇషాన్ ఇలా! అందుకు కారణం చెప్పిన రోహిత్
Comments
Please login to add a commentAdd a comment