West Indies vs India Test Series: వెస్టిండీస్‌తో తొలి టెస్టులో టీమిండియా ఏకపక్ష విజయం సాధించింది. ఆతిథ్య జట్టును ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో మట్టికరిపించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో పర్యాటక భారత జట్టు 1-0తో ముందంజ వేసింది. ఇక ఈ విజయంలో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ది కీలక పాత్ర అనడంలో సందేహం లేదు.
12 వికెట్లు పడగొట్టి
డొమినికా పిచ్‌పై ఆకాశమే హద్దుగా చెలరేగిన అశ్విన్ విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా 12 వికెట్లతో సత్తా చాటి పలు రికార్డులు సృష్టించాడు. ఇక మరో స్పిన్నర్ రవీంద్ర జడేజా సైతం 5 వికెట్లతో రాణించాడు.
రవిచంద్రన్ అశ్విన్
వీరిద్దరి ధాటికి 150 పరుగులకే తొలి ఇన్నింగ్స్ ముగించిన వెస్టిండీస్... రెండో ఇన్నింగ్స్‌లో 130 పరుగులకే చాపచుట్టేసి ఘోర పరాభవం మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఫలితాన్ని విశ్లేషిస్తూ టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తమ గొయ్యి తామే తవ్వుకున్నట్లు
రెండో టెస్టుకు కూడా విండీస్ ఇలాంటి టర్నింగ్ పిచ్‌ను తయారు చేయిస్తే తమ గొయ్యి తామే తవ్వుకున్నట్లు అవుతుందని పేర్కొన్నాడు. ‘‘పోర్ట్ ఆఫ్ స్పెయిన్ మ్యాచ్‌లో వెస్టిండీస్ పిచ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కాస్త డిఫరెంట్‌గా ట్రై చేయాలి.
డొమినికా మాదిరి పిచ్‌ను తయారు చేయించుకుంటే మాత్రం మీ గొయ్యిని మీరే తవ్వుకున్నట్లు అవుతుంది. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై మీకు టీమిండియాను ఓడించే అవకాశమే ఉండదు’’ అని ఈ మాజీ ఓపెనర్ వెస్టిండీస్ క్రికెట్ బోర్డును ఉద్దేశించి కీలక సూచన చేశాడు.
ఎంత పెద్ద తప్పు చేశారో తెలిసేలా చేశాడు
అదే విధంగా.. విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించిన అశ్విన్‌పై ఆకాశ్ చోప్రా ప్రశంసలు కురిపించాడు. వైవిధ్యమైన బౌలింగ్‌తో అదరగొడుతున్నాడని కొనియాడాడు. వెస్టిండీస్‌తో తొలి టెస్టులో లెఫ్టాండర్ అలిక్ అథనాజ్‌ను అవుట్ చేసిన తీరు అద్భుతమని ప్రశంసించాడు.
తన స్పిన్ మాయాజాలంతో విండీస్ చేసిన తప్పేంటో వారికి మరోసారి గుర్తుచేశాడని ఆకాశ్ చోప్రా అశూను ఆకాశానికెత్తాడు. కాగా టీమిండియా- వెస్టిండీస్ మధ్య జూలై 20 నుంచి రెండో టెస్టు ఆరంభం కానుంది.
చదవండి: విరాట్ కోహ్లి అరుదైన ఫీట్.. దెబ్బకు ద్రవిడ్ రికార్డు బద్దలు!
జట్లను ప్రకటించిన బీసీసీఐ.. కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్
Comments
Please login to add a commentAdd a comment