West Indies vs India, 1st Test Day 1: వెస్టిండీస్‌తో తొలి టెస్టులో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దుమ్ములేపుతున్నాడు. తొలి రోజు ఆటలో భాగంగా ఏకంగా 5 వికెట్లు కూల్చి విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. ముందుగా ఓపెనర్లు క్రెగ్ బ్రాత్‌వైట్(20), తగెనరైన్ చందర్‌పాల్(12)లను పెవిలియన్‌కు పంపిన అశూ.. నిలకడ ప్రదర్శించిన అరంగేట్ర బ్యాటర్ అలిక్ అథనాజ్(47)తో పాటు టెయిలెండర్లు అల్జారీ జోసెఫ్(4), వారికన్(1) వికెట్లు పడగొట్టాడు.
అశ్విన్ పాంచ్ పటాకాకు తోడు
అశ్విన్ పాంచ్ పటాకాకు తోడు.. మరో స్పిన్నర్ రవీంద్ర జడేజా మూడు వికెట్లతో రాణించగా.. పేసర్లు సిరాజ్, శార్దూల్ ఒక్కో వికెట్ తీశారు. దీంతో వెస్టిండీస్ 150 పరుగులకే కుప్పకూలింది. ఈ నేపథ్యంలో అశ్విన్ అద్భుత ప్రదర్శన(5/60)ను ఉద్దేశించి టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు.
మనం తప్పు చేశామా?
ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్-2023లో తనను ఆడించకుండా మేనేజ్‌మెంట్ ఎంత పెద్ద తప్పుచేసిందో తెలిసొచ్చేలా చేశాడన్నాడు ఆకాశ్ చోప్రా. భారత్- వెస్టిండీస్ తొలి రోజు ఆటను విశ్లేషిస్తూ తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జట్టు తొలిరోజే 150 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్ ఐదు వికెట్లతో చెలరేగాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో అశ్విన్ ఆడించకుండా మనం తప్పు చేశామా అనే ఫీలింగ్ కలిగించాడు. విండీస్ పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలంగానే ఉంటాయని, వెస్టిండీస్‌తో సిరీస్‌లో రవిచంద్రన్ అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలుస్తాడని నేను ముందుగానే అంచనా వేశాను." అన్నాడు ఆకాశ్ చోప్రా.
అశూ మాదిరే వాళ్లు కూడా
తొలిరోజు మాదిరే అశ్విన్ చెలరేగితే నా మాటలు నిజమవుతాయి’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. ఒకే చోట బంతిని విసురుతూ అశూ మంచి ఫలితాలు రాబడుతున్నాడన్న ఈ కామెంటేటర్.. నాథన్ లియోన్, జడేజా కూడా అతడి మాదిరే బౌలింగ్ చేసే సత్తా కలిగి ఉన్నారని పేర్కొన్నాడు. కాగా మొదటి రోజు ఆటలో విండీస్‌పై పైచేయి సాధించిన టీమిండియా ఆట ముగిసే సమయానికి 80 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్ 40, రోహిత్ శర్మ 30 పరుగులతో క్రీజులో ఉన్నారు.
నంబర్ 1 అశ్విన్
ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్-2023 సందర్భంగా తుది జట్టులో అశ్విన్‌కు చోటు దక్కని విషయం తెలిసిందే. ప్రఖ్యాత ఓవల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో అశూను కాదని.. జడ్డూకు అవకాశమిచ్చారు. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి జడేజా 4 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో అజింక్య రహానే, శార్దూల్ ఠాకూర్ మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో రోహిత్ సేన 209 పరుగుల భారీ తేడాతో ఆసీస్ చేతిలో ఓడి ఘోర పరాభవం మూటగట్టుకుంది. ఇదిలా ఉంటే.. అశ్విన్ గత కొంతకాలంగా టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్1గా కొనసాగుతున్నాడు.
చదవండి: కోహ్లిని టీజ్ చేసిన ఇషాన్ కిషన్.. వీడియో వైరల్
Ind Vs WI: చెలరేగిన అశ్విన్.. అనిల్ కుంబ్లే అరుదైన రికార్డు బద్దలు
Comments
Please login to add a commentAdd a comment