India tour of West Indies, 2023: టీమిండియా ఆటగాళ్లు ఒక్కొక్కరుగా వెస్టిండీస్‌కు చేరుకుంటున్నారు. టెస్టు జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానే సహా పలువురు శుక్రవారమే కరేబియన్ దీవిలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా శనివారం విండీస్‌కు చేరుకున్నట్లు తెలిపాడు.
ఈ సందర్భంగా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, పేసర్ శార్దూల్ ఠాకూర్‌తో కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘‘బార్బడోస్ చేరుకున్నాం’’ అంటూ ఇందుకు క్యాప్షన్ జతచేశాడు. కాగా జూలై 12 నుంచి టీమిండియా- వెస్టిండీస్ మధ్య టెస్టు సిరీస్ మొదలుకానుంది.
రోహిత్, కోహ్లి ఆలస్యంగా!
ఇందుకోసం ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ తర్వాత లభించిన విరామ సమయాన్ని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తమ కుటుంబాలకు కేటాయించారు. దీంతో పారిస్, లండన్‌లలో చక్కర్లు కొడుతున్న ఈ బ్యాటింగ్ స్టార్లు కాస్త ఆలస్యంగా విండీస్‌కు పయనం కానున్నట్లు తెలుస్తోంది.
పాపం వెస్టిండీస్
కాగా డొనిమినికా వేదికగా విండీస్- భారత్‌ల మధ్య తొలి టెస్టు జరుగనుంది. ఇందుకోసం ఆతిథ్య జట్టు ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టింది. క్రెగ్ బ్రాత్‌వైట్ సారథ్యంలోని 18 మంది సభ్యులతో కూడిన జట్టు నెట్స్‌లో శ్రమిస్తోంది. ఇదిలా ఉంటే.. వన్డే ప్రపంచకప్-2023 టోర్నీ రేసు నుంచి వెస్టిండీస్ అధికారికంగా నిష్క్రమించింది.
జింబాబ్వేలోని హరారే వేదికగా సూపర్ సిక్సెస్ దశలో శనివారం జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ చేతిలో ఓడి ఘోర అవమానాన్ని మూటగట్టుకుంది. రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన విండీస్ కనీసం ప్రధాన టోర్నీకి అర్హత సాధించలేక చతికిలపడింది. ఇక క్వాలిఫయర్స్‌లో జూలై 7న ఆఖరి మ్యాచ్ ఆడనున్న విండీస్ ఆటగాళ్లు.. ఆ వెంటనే స్వదేశంలో భారత్‌తో సిరీస్‌కు సిద్ధం కానున్నారు.
వెస్టిండీస్‌తో టెస్టు 'సిరీస్ ఆడనున్న టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ.
వెస్టిండీస్ సన్నాహక జట్టు:
క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), అలిక్ అథనేజ్, జెర్మైన్ బ్లాక్వుడ్, ఎన్క్రుమా బోనర్, తగెనరైన్ చంద్రపాల్, రఖీమ్ కార్న్వాల్, జాషువా డా సిల్వా, షానన్ గాబ్రియేల్, కవెమ్ హాడ్జ్, అకీమ్ జోర్డాన్, జైర్ మెక్అలిస్టర్, కిర్క్ మెకెంజీ, మార్క్వినో మైండ్లీ, అండర్సన్ ఫిలిప్, రేమన్ రీఫర్, కీమర్ రోచ్, జేడెన్ సీల్స్, జోమెల్ వారికన్.
చదవండి: మా ఓటమికి ప్రధాన కారణం అదే.. ఒకవేళ అలా జరిగి ఉంటే: విండీస్ కెప్టెన్
పచ్చగడ్డి.. పులి.. సింహం! అవును.. నువ్వు గాడిదవే! మా కోహ్లి ఎప్పటికీ కింగే!
Touchdown Barbados🛬 pic.twitter.com/netOxNARuY
— Ravindrasinh jadeja (@imjadeja) July 1, 2023
Comments
Please login to add a commentAdd a comment