West Indies vs India, 1st Test: వెస్టిండీస్‌తో తొలి టెస్టు సందర్భంగా టీమిండియా వెటరన్ స్పిన్నర్ అరుదైన ఘనత సాధించాడు. దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు భారత జట్టు విండీస్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.
బౌలింగ్ ఎటాక్ ఆరంభించిన సిరాజ్
ఇందులో భాగంగా ఇరు జట్ల మధ్య బుధవారం (జూలై 12) తొలి టెస్టు ఆరంభమైంది. డొమినికా వేదికగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కరేబియన్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్ ఎటాక్ ఆరంభించగా.. తొలి వికెట్‌ను మాత్రం తన ఖాతాలో వేసుకున్నాడు అశ్విన్.
స్పిన్ మాయాజాలంతో
వెస్టిండీస్ ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో అద్భుత బౌలింగ్‌తో తగెనరైన్ చందర్‌పాల్‌ను బోల్తా కొట్టించాడు. తన స్పిన్ మాయాజాలంతో చందర్‌పాల్‌ను బౌల్డ్ చేశాడు. దీంతో విండీస్‌వీ మ్యాచ్‌లో తొలి వికెట్ కోల్పోగా.. అశ్విన్ ఖాతాలో అరుదైన రికార్డు వచ్చి చేరింది.
కాగా తగెనరైన్ చందర్‌పాల్‌ను అవుట్ చేసిన అశూ.. టెస్టుల్లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు బౌల్డ్ చేయడం ద్వారా సాధించిన బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అనిల్ కుంబ్లే పేరిట ఉన్న రికార్డు బ్రేక్ చేశాడు.
కుంబ్లేను అధిగమించి
ఇక దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 94 సార్లు ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను బౌల్డ్ చేయగా.. అశ్విన్.. చందర్‌పాల్ వికెట్‌తో తన నెంబర్‌ను 95గా నమోదు చేశాడు. ఇక మహ్మద్ షమీ 66 సార్లు, కపిల్ దేవ్ 88 సార్లు ప్రత్యర్థి జట్ల బ్యాటర్లను బౌల్డ్ చేశారు. కాగా ఈ మ్యాచ్‌లో అశ్విన్ 17వ ఓవర్ రెండో బంతికి కెప్టెన్ క్రెగ్ బ్రాత్‌వైట్ వికెట్‌ను కూడా పడగొట్టాడు. ఈ క్రమంలో 17 ఓవర్లు ముగిసేసరికి విండీస్ 38 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఇదిలా ఉంటే.. వెస్టిండీస్‌తో తొలి టెస్టు సందర్భంగా ఇషాన్ కిషన్, యశస్వి జైశ్వాల్ అరంగేట్రం చేశారు. ఈ ఇద్దరు లెఫ్టాండ్ బ్యాటర్లలో యశస్వి ఓపెనర్‌గా బరిలోకి దిగనుండగా.. ఇషాన్ వికెట్ కీపర్‌గా సేవలు అందించనున్నాడు. మరోవైపు.. ఇషాన్ రాకతో ఆంధ్ర క్రికెటర్ శ్రీకర్ భరత్‌పై వేటు పడింది.
చదవండి: మార్కు చూపించిన తిలక్ వర్మ.. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో విహారి! ఫైనల్లో జట్టును..
Comments
Please login to add a commentAdd a comment