Ten wickets
-
అశ్విన్ మాయాజాలం; బ్యాటర్లే కాదు రికార్డులైనా దాసోహం అనాల్సిందే
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన స్పిన్ మాయాజాలంతో విండీస్‌ను ముప్పతిప్పలు పెట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు.. రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు మొత్తంగా 131 పరుగులిచ్చి 12 వికెట్లు తీసి కెరీర్ బెస్ట్ ప్రదర్శన నమోదు చేశాడు. ఈ క్రమంలో అశ్విన్ పలు రికార్డులను బద్దలుకొట్టాడు. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం. ► అశ్విన్‌కు టెస్టుల్లో ఇది 8వ 10 వికెట్ల హాల్. టీమిండియా తరపున అత్యధిక పది వికెట్ల హాల్ అందుకున్న జాబితాలో అనిల్ కుంబ్లేతో కలిసి సంయుక్తంగా ఉన్నాడు. కుంబ్లే కూడా 8సార్లు పది వికెట్ల హాల్ అందుకున్నాడు. ఇక హర్బజన్ సింగ్ ఐదుసార్ల పది వికెట్ల హాల్ సాధించాడు. ► ఇక విదేశాల్లో టీమిండియా తరపున బెస్ట్ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేసిన జాబితాలో అశ్విన్ చోటు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో తొలి స్థానంలో భగవత్ చంద్రశేఖర్(1977లో మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాపై 12/104), ఇర్ఫాన్ పఠాన్(2005లో హరారే వేదికగా జింబాబ్వేపై 12/126), తాజాగా అశ్విన్(2023లో వెస్టిండీస్‌పై 12/131), అనిల్ కుంబ్లే( 2004లో సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాపై 12/279), ఇర్ఫాన్ పఠాన్(2004లో డాకా వేదికగా బంగ్లాదేశ్‌పై 11/96) ఉన్నారు. ► ఇక వెస్టిండీస్‌పై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన టీమిండియా బౌలర్లలో అశ్విన్ నాలుగో స్థానంలో నిలిచాడు. తాజా ప్రదర్శనతో కలిపి అశ్విన్ ఇప్పటివరకు విండీస్‌పై 72 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ కంటే ముందు కపిల్ దేవ్(89 వికెట్లు), మాల్కమ్ మార్షల్(76 వికెట్లు), అనిల్ కుంబ్లే(74 వికెట్లు), శ్రీనివాస్ వెంకటరాఘవన్(68 వికెట్లు) ఉన్నారు. ► ఒక టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడం అశ్విన్‌కు ఇది ఆరోసారి. ఈ జాబితాలో ముత్తయ్య మురళీధరన్ 11 సార్లు ఈ ఫీట్ నమోదు చేసి అగ్రస్థానంలో ఉండగా.. రంగనా హెరాత్ 8సార్లు, సిడ్నీ బార్నెస్ ఆరు సార్లు ఈ ఫీట్ సాధించాడు. 2nd 5-wicket haul in the ongoing Test 👍 34th 5-wicket haul in Test 👌 8th 10-wicket haul in Tests 👏 Well done, R Ashwin 🙌 🙌 Follow the match ▶️ https://t.co/FWI05P4Bnd #TeamIndia | #WIvIND pic.twitter.com/u9dy3t0TAd — BCCI (@BCCI) July 14, 2023 చదవండి: WI Vs IND: మూడు రోజుల్లోనే ముగించారు.. విండీస్‌పై ఇన్నింగ్స్ విజయం -
రికార్డుల అజాజ్..! ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు.. స్పందించిన కుంబ్లే
Ajaz Patel Becomes 3rd Bowler to Pick 10 Wickets in a Test Cricket History: న్యూజిలాండ్ స్పిన్నర్ ఆజాజ్ పటేల్ టెస్ట్ క్రికెట్లో ప్రపంచ రికార్డు సాధించాడు. భారత్‌తో జరిగిన రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో 47 ఓవర్లు వేసిన ఆజాజ్ పటేల్ 119 పరుగులు ఇచ్చి 10 వికెట్లు సాధించాడు. అంతకు ముందు జిమ్ లేకర్, అనిల్ కుంబ్లే ఈ ఘనత సాధించారు. 1956లో ఇంగ్లండ్ బౌలర్ జిమ్ లేకర్ ఆస్ట్రేలియాపై పది వికెట్లు సాధించగా, 1999లో భారత స్పిన్నర్ అనిల్ కుంబ్లే పాకిస్తాన్‌పై 10 వికెట్లు పడగొట్టాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా బ్యాటర్లలో మయాంక్ అగర్వాల్ 150 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక అజాజ్ ఘనతపై స్పందించిన అనిల్ కుంబ్లే.. ‘‘చాలా బాగా బౌలింగ్ చేశావు. వెల్కమ్ టూ క్లబ్’’ అంటూ స్వాగతం పలికాడు. చదవండి: Ind Vs Nz 2nd Test: ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు సాధించిన న్యూజిలాండ్ బౌలర్ #10wickets #AjazPatel #INDvzNZ Retweet ♻️ Like ♥️ pic.twitter.com/cuEIlgFfVZ — Yash Vashisth Tyagi (@vashisthtyagi3) December 4, 2021 Spinner Ajaz Patel smashed all records as he became only the third player in Test cricket history to grab all 10 wickets in an innings#AjazPatel #INDvsNZhttps://t.co/W5QzdjeTvr — CricketNDTV (@CricketNDTV) December 4, 2021 Welcome to the club #AjazPatel #Perfect10 Well bowled! A special effort to achieve it on Day1 & 2 of a test match. #INDvzNZ — Anil Kumble (@anilkumble1074) December 4, 2021 -
Ind Vs Eng: విజయానికి 291 పరుగుల దూరం.. పది పడాలి!
ఓవల్ టెస్టు రసకందాయంలో పడింది. భారత్, ఇంగ్లండ్ జట్లను విజయం ఊరిస్తోంది. టీమిండియా గెలవాలంటే మన బౌలర్లు చివరి రోజు పది వికెట్లు తీయాల్సిందే. ఇంగ్లండ్ విజయానికి మరో 291 పరుగుల దూరంలో ఉంది. టెస్టులో చివరి రోజు 250కు పైగా పరుగులు చేయాలంటే ఏ జట్టుకైనా కష్ట సాధ్యమే. ఈ నేపథ్యంలో నాలుగో టెస్టు ఆఖరి రోజు ఆట ఎన్ని మలుపులు తిరుగుతుందో, విజయం ఎవరివైపు మొగ్గుతుందో ఆసక్తికరంగా మారింది. లండన్: తమ ఖాతాలో మరో విజయం వేసుకొని ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లాలంటే భారత బౌలర్లు నాలుగో టెస్టులో చివరి రోజు సత్తా చాటుకోవాలి. ఆఖరి రోజు మొత్తం 10 వికెట్లు పడగొడితేనే భారత్‌కు విజయం దక్కుతుంది. మరోవైపు ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు కూడా విజయంపై కన్నేసింది. 368 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆదివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 32 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసింది. ఓపెనర్లు బర్న్స్ (31 బ్యాటింగ్; 2 ఫోర్లు), హసీబ్ (43 బ్యాటింగ్; 6 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 148.2 ఓవర్లలో 466 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఇంగ్లండ్‌కు 368 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శార్దుల్ ఠాకూర్ (72 బంతుల్లో 60; 7 ఫోర్లు, 1 సిక్స్) వన్డే తరహా ఇన్నింగ్స్ ఆడగా... వికెట్ కీపర్ రిషభ్ పంత్ (106 బంతుల్లో 50; 4 ఫోర్లు) రాణించాడు. క్రిస్ వోక్స్ 3 వికెట్లు తీశాడు. శార్దుల్ మళ్లీ మెరిశాడు 270/3తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన భారత్‌ను ఇంగ్లండ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ దెబ్బతీశాడు. ఓవర్‌నైట్ స్కోరుకు 26 పరుగులు జతయ్యాక... జడేజా (17; 3 ఫోర్లు), రహానే (0)లను తన వరుస ఓవర్లలో వోక్స్ అవుట్ చేశాడు. కాసేపటికే కెప్టెన్ కోహ్లి (44; 7 ఫోర్లు) మొయిన్ అలీ బౌలింగ్‌లో ఒవర్టన్‌కు క్యాచ్ ఇచ్చాడు. అప్పటికి భారత స్కోరు 312/6 కాగా... ఆధిక్యం 213 పరుగులు. ఈ దశలో క్రీజులోకి వచ్చి న యువ ప్లేయర్లు రిషభ్ పంత్, శార్దుల్ ఠాకూర్ భారత్‌ను సురక్షిత స్థితిలో ఉంచే బాధ్యతను తీసుకున్నారు. వీరిద్దరూ మొదట ఆచితూచిగా ఆడటంతో పరుగుల వేగం మందగించింది. లంచ్ విరామానికి భారత్ స్కోరు 329/6గా ఉంది. లంచ్ తర్వాత శార్దుల్ తన బ్యాట్‌కు పని చెప్పాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆడినంత ధాటిగా కాకపోయినా... ఇక్కడ కూడా స్కోరు బోర్డును పరిగెత్తించాడు. అతడికి పంత్ కూడా తోడవ్వడంతో భారత్ ఆధిక్యం 300 పరుగులు చేరుకుంది. ఈ క్రమంలో శార్దుల్ 65 బంతుల్లో మ్యాచ్‌లో రెండో అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. çఎనిమిదో బ్యాట్స్‌మన్‌గా వచ్చి ఒకే టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 50కిపైగా పరుగులు సాధించిన మూడో భారత క్రికెటర్‌గా శార్దుల్ ఘనతకెక్కాడు. అనంతరం పంత్ కూడా హాఫ్ సెంచరీని అందుకున్నాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 100 పరుగులు జోడించారు. చివర్లో ఉమేశ్ యాదవ్ (25; 1 ఫోర్, 2 సిక్స్‌లు), బుమ్రా (24; 4 ఫోర్లు) నిలబడటంతో ఇంగ్లండ్ ముందు టీమిండియా భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 191; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 290; భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (సి) వోక్స్ (బి) రాబిన్సన్ 127; రాహుల్ (సి) బెయిర్‌స్టో (బి) అండర్సన్ 46; పుజారా (సి) అలీ (బి) రాబిన్సన్ 61; కోహ్లి (సి) ఒవర్టన్ (బి) అలీ 44; జడేజా (ఎల్బీ) (బి) వోక్స్ 17; రహానే (ఎల్బీ) (బి) వోక్స్ 0; పంత్ (సి అండ్ బి) అలీ 50; శార్దుల్ ఠాకూర్ (సి) ఒవర్టన్ (బి) రూట్ 60; ఉమేశ్ యాదవ్ (సి) అలీ (బి) ఒవర్టన్ 25; బుమ్రా (సి) అలీ (బి) వోక్స్ 24; సిరాజ్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (148.2 ఓవర్లలో ఆలౌట్) 466. వికెట్ల పతనం: 1–83, 2–236, 3–237, 4–296, 5–296, 6–312, 7–412, 8–414, 9–450, 10–466. బౌలింగ్: అండర్సన్ 33–10–79–1, రాబిన్సన్ 32–7–105–2, వోక్స్ 32–8–83–3, ఒవర్టన్ 18.2–3–58–1, మొయిన్ అలీ 26–0–118–2, రూట్ 7–1–16–1. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: బర్న్స్ (బ్యాటింగ్) 31; హమీద్ (బ్యాటింగ్) 43; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (32 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 77. బౌలింగ్: ఉమేశ్ 6–2–13–0, బుమ్రా 7–3–11–0, జడేజా 13–4–28–0, సిరాజ్ 6–0–24–0. -
పదికి పది...
భారత టాప్ స్పిన్ బౌలర్‌గా అనిల్ కుంబ్లే అందించిన మరపురాని విజయాలెన్నో. 18 ఏళ్ల కెరీర్లో అతను పడగొట్టిన 956 అంతర్జాతీయ వికెట్లు టీమిండియా గెలుపు ప్రస్థానంలో కీలకపాత్ర పోషించాయి. అయితే ఎన్ని ఘనతలు కుంబ్లే పేరిట ఉన్నా... ‘10 వికెట్ల’ ప్రదర్శన మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. అభిమానులెవరూ మరచిపోలేని మధుర జ్ఞాపకమే. ఒకే ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ అందరినీ పడగొట్టిన భారత దిగ్గజం ఈ రికార్డు సాధించిన రెండో బౌలర్‌గా తన పేరు చరిత్రలో లిఖించుకున్నాడు. పైగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై ఇలాంటి ఘనత నమోదు కావడం మనందరి ఆనందాన్ని రెట్టింపు చేసింది. సొంతగడ్డపై పాకిస్తాన్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత జట్టు అప్పటికే తొలి మ్యాచ్ ఓడిపోయింది. చెన్నైలో గెలుపు అంచుల వరకు వచ్చి చివరకు అనూహ్యంగా 12 పరుగులతో పరాజయంపాలు కావడంతో జట్టు సభ్యులందరినీ షాక్‌కు గురి చేసింది. వారంతా దానినుంచి పూర్తిగా కోలుకోలేదు. ఈ సమయంలో కచ్చితంగా రెండో టెస్టు గెలిచి సిరీస్‌ను సమం చేయాల్సిన స్థితిలో అజహరుద్దీన్ బృందం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో బరిలోకి దిగింది. సాధారణ స్కోర్లే... ఫిబ్రవరి 4, 1999... మన టీమ్‌లో కుంబ్లే, హర్భజన్లు ఉన్నా...పాక్ టీమ్‌లో కూడా సక్లాయిన్ ముస్తాక్, ముస్తాక్ అహ్మద్ రూపంలో ఇద్దరు అత్యుత్తమ స్పిన్నర్లు ఉండటంతో పూర్తి స్థాయి స్పిన్ పిచ్‌ను తయారు చేసేందుకు కూడా బోర్డు వెనుకాడింది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. అజహరుద్దీన్ (67), సదగోపన్ రమేశ్ (60) మినహా అంతా విఫలం కావడంతో తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకే ఆలౌటైంది. అయితే మన బౌలర్లు కూడా చెలరేగడంతో పాక్ 172 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా మనకు 80 పరుగుల ఆధిక్యం దక్కింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో కొంత మెరుగ్గా ఆడి భారత్ 339 పరుగులు చేసింది. రమేశ్ (96), గంగూలీ (62) రాణించారు. పాక్ ముందు 420 పరుగుల లక్ష్యాన్ని ఉంచి భారత్ సవాల్ విసిరింది. మ్యాజిక్ మొదలు... అసాధారణ విజయలక్ష్యమే అయినా పాక్‌కు ఓపెనర్లు సయీద్ అన్వర్ (69), షాహిద్ అఫ్రిది (41) శుభారంభం అందించి ఆశలు రేపారు. 9వ ఓవర్లోనే బౌలింగ్‌కు దిగిన కుంబ్లే తొలి స్పెల్‌లో ఏమాత్రం ప్రభావం చూపలేదు. తొలి వికెట్‌కు సెంచరీ (101) భాగస్వామ్యం నమోదైంది. నాలుగో రోజు లంచ్ విరామం తర్వాత ఒక్కసారిగా ఆట మలుపు తిరిగింది. కెప్టెన్ సూచనతో కుంబ్లే ఎండ్ మార్చి బౌలింగ్ ప్రారంభించాడు. ముందుగా కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అఫ్రిది వెనుదిరగడంతో పాక్ పతనం మొదలుకాగా, తర్వాతి బంతికి ఇజాజ్ అహ్మద్ వికెట్ల ముందు దొరికిపోయాడు. అలా ఒకదాని వెంట మరో వికెట్ పడుతుండటం... అన్నీ కుంబ్లే ఖాతాలోనే చేరుతుండటం జరిగిపోయాయి. కుంబ్లే బంతులను ఆడటంలో పాక్ బ్యాట్స్‌మెన్ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ముస్తాక్ అహ్మద్‌ను 8వ వికెట్‌గా అవుట్ చేసి కుంబ్లే తన గత అత్యుత్తమ బౌలింగ్ రికార్డు (7/59)ను సవరించాడు. అప్పటికే విరామం లేకుండా బౌలింగ్ చేస్తున్న కుంబ్లే బాగా అలసిపోయాడు. అదృష్టవశాత్తూ టీ బ్రేక్ వచ్చేసింది. రసవత్తర డ్రామా... చివరి సెషన్లో వచ్చీ రాగానే సక్లాయిన్ను కూడా పడగొట్టడంతో 9వ వికెట్ అనిల్ ఖాతాలో చేరింది. అప్పుడు జట్టంతా కలిసి కుంబ్లే రికార్డుకు సహకరించాలని సమష్టి నిర్ణయం తీసుకుంది. మరో ఎండ్‌లో బౌలింగ్ చేస్తున్న శ్రీనాథ్‌ను వికెట్‌కు దూరంగా బంతులు వేయాలని కెప్టెన్ సూచించాడు. ఆ సమయంలో మరో బౌలర్‌కు వికెట్ దక్కరాదని జట్టు మొత్తం కోరుకుంది. అటు క్రీజ్‌లో ఉన్న అక్రమ్, వకార్ కూడా కుంబ్లేకు రికార్డు దక్కరాదని ప్రయత్నించారు. శ్రీనాథ్ బౌలింగ్‌లో గుడ్డిగా షాట్లు ఆడి వకార్ అవుటయ్యేందుకు ప్రయత్నించాడు. ఒకదశలో గాల్లో లేచిన బంతిని రమేశ్ దాదాపుగా పట్టేయడంలో అందరి గుండె ఆగినంత పనైంది. రమేశ్‌కు ఆ క్యాచ్ చిక్కకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చివరకు తమలో ఒకరు రనౌటైనా కావాలని కూడా అనుకున్నట్లు అక్రమ్ తర్వాతి రోజుల్లో వెల్లడించాడు. అయితే ఇది ఎక్కువసేపు సాగలేదు. కుంబ్లే వేసిన లెగ్బ్రేక్ను షార్ట్లెగ్లోకి అక్రమ్ ఆడగా... వీవీఎస్ లక్ష్మణ్ క్యాచ్ పట్టేయడంతో చరిత్ర ఆవిష్కృతమైంది. భారత జట్టు శిబిరంలో సంబరాలు అంబరాన్నంటగా... కుంబ్లేను భుజాలపై మోస్తూ సహచరులంతా తమ ఆనందాన్ని పంచుకున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో పాక్ 207 పరుగులకే ఆలౌట్ కావడంతో 212 పరుగులతో గెలిచిన భారత్ 1–1తో సిరీస్‌ను సమంగా ముగించింది. గతంలో ఇంగ్లండ్ బౌలర్ జిమ్ లేకర్ మాత్రమే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు దానిని కుంబ్లే సాధించి చూపించాడు. ఈ 10 వికెట్ల ప్రదర్శనను ఎప్పటికీ గుర్తుకు తెచ్చే విధంగా రిటైర్మెంట్ అనంతరం తన స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీకి ‘టెన్విక్’ అని కుంబ్లే పేరు పెట్టాడు. -
పదికి పది వికెట్లు
కడప స్పోర్ట్స్: దేశవాళీ మహిళల క్రికెట్లో సరికొత్త రికార్డు నమోదైంది. బీసీసీఐ అండర్–19 వన్డే టోర్నీలో భాగంగా కేఎస్ఆర్ఎం కళాశాల మైదానంలో జరిగిన మ్యాచ్‌లో చండీగఢ్ బౌలర్ కశ్వీ గౌతమ్ అద్భుతం చేసింది. ఈ వన్డే ఇన్నింగ్స్‌లో మొత్తం 10 ప్రత్యర్థి వికెట్లను కశ్వీ పడగొట్టి చరిత్ర సృష్టించింది. భారత్ తరఫున టెస్టుల్లో అనిల్ కుంబ్లే, దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో దేబాశిష్ మొహంతి, రంజీ మ్యాచ్‌లో రెక్స్ సింగ్ గతంలో ఒకే ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు పడగొట్టారు. అయితే బోర్డు గుర్తింపు పొందిన ఒక వన్డే మ్యాచ్‌లో ఇలాంటి ఘనత నమోదు కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. చండీగఢ్ కెప్టెన్ కూడా అయిన కశ్వీ ప్రత్యర్థి జట్టు అరుణాచల్ ప్రదేశ్‌ను ఒంటి చేత్తో పడగొట్టింది. 4.5 ఓవర్లు వేసిన ఆమె ఒక ఓవర్ మెయిడిన్ సహా 12 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టింది. తన రెండో ఓవర్ చివరి మూడు బంతుల్లో వికెట్లు తీసి ‘హ్యాట్రిక్’ కూడా సాధించింది. కశ్వీ బౌలింగ్ దెబ్బకు అరుణాచల్ ప్రదేశ్ 25 పరుగులకే కుప్పకూలింది. జట్టులో 8 మంది డకౌట్ కాగా... ముగ్గురు 10, 4, 3 చొప్పున పరుగులు చేశారు. మరో 8 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి. అంతకుముందు 50 ఓవర్లలో 4 వికెట్లకు 186 పరుగులు చేసిన చండీగఢ్ 161 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌లో కూడా కశ్వీ (68 బంతుల్లో 49; 6 ఫోర్లు)నే టాప్ స్కోరర్‌గా నిలిచింది. -
పదికి పది వికెట్లు
హెచ్‌సీఏ వన్డే లీగ్‌లో అరుణ్ భండారి సంచలనం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) స్థానిక లీగ్‌లో హైదరాబాద్ కుర్రాడు అరుణ్ భండారి పదికి పది వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. కాస్మోస్ జట్టుకు చెందిన అరుణ్ భండారి తన అద్వితీయ ప్రదర్శనతో టైమ్ సీసీ బ్యాట్స్‌మెన్‌ను వణికించాడు. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన కాస్మోస్ 40 ఓవర్లలో 7 వికెట్లకు 359 పరుగుల భారీస్కోరు చేసింది. మోహన్ కుమార్ (121), అరుణ్ భండారి (52), అనిల్ (53), రమేష్ (42) రాణించారు. తర్వాత కష్టసాధ్యమైన లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన టైమ్ సీసీ 19 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. అరుణ్ (6-0-30-10) అద్భుతమైన స్పెల్‌తో అదరగొట్టాడు.