హెచ్‌సీఏ వన్డే లీగ్‌లో అరుణ్ భండారి సంచలనం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) స్థానిక లీగ్‌లో హైదరాబాద్ కుర్రాడు అరుణ్ భండారి పదికి పది వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. కాస్మోస్ జట్టుకు చెందిన అరుణ్ భండారి తన అద్వితీయ ప్రదర్శనతో టైమ్ సీసీ బ్యాట్స్‌మెన్‌ను వణికించాడు. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన కాస్మోస్ 40 ఓవర్లలో 7 వికెట్లకు 359 పరుగుల భారీస్కోరు చేసింది.
మోహన్ కుమార్ (121), అరుణ్ భండారి (52), అనిల్ (53), రమేష్ (42) రాణించారు. తర్వాత కష్టసాధ్యమైన లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన టైమ్ సీసీ 19 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. అరుణ్ (6-0-30-10) అద్భుతమైన స్పెల్‌తో అదరగొట్టాడు.
పదికి పది వికెట్లు
Published Tue, Dec 29 2015 2:29 AM | Last Updated on Sun, Sep 3 2017 2:42 PM
Advertisement
Advertisement