మెల్‍బోర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు గురువారం(డిసెంబర్ 26) నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ బాక్సింగ్ డే టెస్టులో బుమ్రా 6 వికెట్లు పడగొడితే.. 200 టెస్టు వికెట్ల మైలురాయి అందుకుంటాడు.
తద్వారా టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా బుమ్రా నిలుస్తాడు. ఈ జాబితాలో టీమిండియా దిగ్గజ స్పిన్నర్ ఉన్నాడు. అశ్విన్ కేవలం 37 టెస్టుల్లోనే 200 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. ఇక ఇప్పటి వరకు 43 టెస్టులు ఆడిన బుమ్రా 83 ఇన్నింగ్స్‌ల్లో 194 వికెట్లు పడగొట్టాడు.
ప్రస్తుతం బుమ్రా ఉన్న ఫామ్‌కు ఈ ఫీట్ సాధించడం నల్లేరు మీద నడక అని చెప్పాలి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన బుమ్రా.. 21 వికెట్లు పడగొట్టి లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు.
భారత తుది జట్టు(అంచనా)
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), KL రాహుల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్
ఆసీస్ తుది జట్టు
ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్.
Comments
Please login to add a commentAdd a comment