India vs Australia, 4th Test- Axar Patel Reocrd: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో భారత్ తరఫున అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు.
అదే విధంగా.. టెస్టుల్లో రికార్డుల రాజు, వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను వెనక్కినెట్టాడు ఈ స్పిన్ ఆల్‌రౌండర్. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్‌లో ఆఖరిదైన నాలుగో టెస్టు ఆఖరి రోజు ఆట సందర్భంగా ఈ ఘనత సాధించాడు. అహ్మదాబాద్‌లో ఆసీస్ ఓపెనర్ ట్రవిస్ హెడ్‌ను బౌల్డ్ చేసిన అక్షర్.. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో 50 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు.
బుమ్రా రికార్డు బద్దలు.. అశూ వల్ల కానిది!
ఈ క్రమంలో బుమ్రా రికార్డు బద్దలు కొట్టిన అక్షర్.. అత్యంత తక్కువ బంతుల్లో టెస్టుల్లో 50 వికెట్ల ఘనత సాధించి చరిత్రకెక్కాడు. సెంచరీకి పది పరుగుల దూరంలో ఉన్న హెడ్‌ను అవుట్ చేసి ఈ అరుదైన ఫీట్ నమోదు చేశాడు. కాగా ఆసీస్‌తో నాలుగో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 79 పరుగులు సాధించిన అక్షర్.. జట్టును పటిష్ట స్థితిలో తన వంతు పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఆఖరి టెస్టు డ్రాగా ముగియడంతో సిరీస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది.
టెస్టుల్లో టీమిండియా తరఫున అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్లు
1. అక్షర్ పటేల్- 2205 బంతుల్లో
2. జస్‌ప్రీత్ బుమ్రా- 2465 బంతుల్లో
3. కర్సన్ ఘావ్రి- 2534 బంతుల్లో
4. రవిచంద్రన్ అశ్విన్- 2597 బంతుల్లో .
చదవండి: Kane Williamson: 75 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.. న్యూజిలాండ్ అత్యంత అరుదైన రికార్డు! వారెవ్వా కేన్ మామ
WTC Final- Ind Vs Aus: అప్పుడు అడ్డుకున్న న్యూజిలాండ్.. ఈసారి ఇలా! టీమిండియాకు..
India 🇮🇳 🤝🏻 Australia 🇦🇺
— BCCI (@BCCI) March 13, 2023
The final Test ends in a draw as #TeamIndia win the Border-Gavaskar series 2-1 🏆#INDvAUS pic.twitter.com/dwwuLhQ1UT
Milestone 🚨 - Congratulations @akshar2026 who is now the fastest Indian bowler to take 50 wickets in terms of balls bowled (2205).
— BCCI (@BCCI) March 13, 2023
Travis Head is his 50th Test victim.#INDvAUS #TeamIndia pic.twitter.com/yAwGwVYmbo
Comments
Please login to add a commentAdd a comment