India vs Australia, 2nd Test: ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఢిల్లీ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి(44) మినహా.. మిగతా కీలక బ్యాటర్లంతా విఫలమైన వేళ నేనున్నానంటూ జట్టును ఆదుకున్నాడు. 115 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా మెరుగైన స్కోరు చేయగలిగింది.
రెండో రోజు ఆటలో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో 262 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్‌ను కట్టడి చేయాలనుకున్న ఆస్ట్రేలియాకు కేవలం ఒక్క పరుగు ఆధిక్యం లభించింది. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం (ఫిబ్రవరి 17) రెండో టెస్టు మొదలైన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్ల విజృంభణతో తొలి రోజే 263 పరుగులు చేసి ఆలౌట్ అయి మొదటి ఇన్నింగ్స్ ముగించింది. ఈ క్రమంలో టీమిండియా శుక్రవారం నాటి ఆట ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 9 ఓవర్లలో 21 పరుగులు చేసింది.
నాథన్ దెబ్బ..
ఈ క్రమంలో శనివారం రెండో రోజు ఆట మొదలెట్టిన టీమిండియా నాథన్ లియోన్ దెబ్బకు వరుసగా ఓపెనర్లు కేఎల్ రాహుల్(17), రోహిత్ శర్మ(32), వన్‌డౌన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా(0) వికెట్లు కోల్పోయింది.
ఈ క్రమంలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లి 84 బంతుల్లో 44 పరుగులు చేయగా.. ఐదో స్థానంలో దిగిన శ్రేయస్ అయ్యర్(4) పూర్తిగా నిరాశపరిచాడు. అయితే, అంపైర్ నిర్ణయానికి కోహ్లి బలైపోవడంతో టీమిండియా కష్టాల్లో పడింది.
అక్షర్-అశూ అద్భుతం
ఈ నేపథ్యంలో రవీంద్ర జడేజా 26 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. శ్రీకర్ భరత్(6) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. ఇలా జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ.. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అక్షర్ బ్యాట్ ఝులిపించాడు. అశ్విన్(37) అతడికి తోడయ్యాడు. వీరిద్దరు కలిసి 100కు పైగా పరుగుల భాగస్వామ్యంతో మెరుగైన ప్రదర్శన చేయడంతో టీమిండియా 262 పరుగులు చేయగలిగింది.
ఇక ఆసీస్ బౌలర్లలో స్పిన్నర్లు నాథన్ లియోన్‌కు అత్యధికంగా ఐదు, టాడ్ మర్ఫీకి రెండు, అరంగేట్ర స్పిన్నర్ కుహ్నెమన్‌కు రెండు, పేసర్ ప్యాట్ కమిన్స్‌కు ఒక వికెట్ దక్కాయి.
చదవండి: IND vs AUS: చెత్త అంపైరింగ్.. కళ్లు కనిపించడం లేదా! కోహ్లిది నాటౌట్.. అంపైర్ నిర్ణయానికి బలి..
బాగా ఆడితే మాకేంటి? ఛీ.. నీతో షేక్‌హ్యాండా? ఘోర అవమానం.. తగిన శాస్తే అంటున్న నెటిజన్లు
Comments
Please login to add a commentAdd a comment