
Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ మోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 పోరులో మోహిత్ శర్మ ఐదు వికెట్లతో చెలరేగాడు. మోహిత్ శర్మ బౌలింగ్ దెబ్బకు ముంబై ఇండియన్స్ 171 పరుగులకు ఆలౌటై 62 పరుగులతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించిది.
ఇక 2.2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన మోహిత్ శర్మ 10 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీయడం విశేషం. ఐపీఎల్ చరిత్రలో ప్లేఆఫ్స్‌లో ఐదు వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా మోహిత్ శర్మ నిలిచాడు. ఇంతకముందు ఆకాశ్ మధ్వాల్(ముంబై ఇండియన్స్).. లక్నోతో మ్యాచ్‌లో ఐదు పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు.
ఇక ఈ సీజన్‌లో డెత్ ఓవర్లలో(16-20 ఓవర్లు) అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మోహిత్ రెండో స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు ఈ సీజన్‌లో మోహిత్ శర్మ 14 వికెట్లు తీయగా.. తొలి స్థానంలో సీఎస్‌కేకు మతీశా పతిరానా(16 వికెట్లు) ఉండగా.. వీరిద్దరి తర్వాత హర్షల్‌పటేల్(ఆర్‌షీబీ) 11 వికెట్లతో ఉన్నాడు.
చదవండి: #SaiSudharsan: రిటైర్డ్ ఔట్.. ఐపీఎల్ చరిత్రలో మూడో ఆటగాడిగా
Comments
Please login to add a commentAdd a comment