MOhit sharma
-
DC Vs GT: మోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో ఒక స్పెల్(నాలుగు ఓవర్లు)లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా మోహిత్ చెత్త రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్-2024లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో మోహిత్ తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 73 పరుగులు సమర్పించుకున్నాడు.తద్వారా మోహిత్ శర్మ ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత బౌలర్ బసిల్ థంపి పేరిట ఉండేది. ఐపీఎల్-2018 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన బసిల్ థంపి.. ఆర్సీబీతో మ్యాచ్‌లో తన 4 ఓవర్ల కోటాలో 70 పరుగులిచ్చాడు. తాజా మ్యాచ్‌తో థంపిని మోహిత్ అధిగమించాడు.కాగా ఈ మ్యాచ్‌లో 20 ఓవర్ వేసిన మోహిత్ బౌలింగ్‌లో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ 4 సిక్స్‌లు, ఒక ఫోరుతో 31 పరుగులు రాబట్టాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో పంత్(88)తో పాటు అక్షర్ పటేల్(66), స్టబ్స్(26) పరుగులతో రాణించారు. గుజరాత్ బౌలర్లలో సందీప్ వారియర్ 3 వికెట్లు పడగొట్టగా.. నూర్ ఆహ్మద్ ఒక్క వికెట్ పడగొట్టారు. -
అప్పటికప్పుడు ఫలితం తారుమారు.. అంపైర్‌తో గొడవపడ్డ గిల్
రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్ సందర్భంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. థర్డ్ అంపైర్ వ్యవహరించిన తీరుపై విస్మయం వ్యక్తం చేశాడు. తమ విషయంలో ఎందుకిలా జరిగిందంటూ ఫీల్డ్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఐపీఎల్-2024లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్తాన్- గుజరాత్ జట్లు బుధవారం తలపడ్డాయి. టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుని.. రాజస్తాన్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్(24), జోస్ బట్లర్(8)లను తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్(68- నాటౌట్), రియాన్ పరాగ్(76)తో కలిసి రాజస్తాన్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. గుజరాత్ బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. Fifty comes up for SANJU SAM5️⃣0️⃣N 💥#RRvGT #TATAIPL #IPLonJioCinema #IPLinMalayalam pic.twitter.com/Fxlr57hK6L — JioCinema (@JioCinema) April 10, 2024 నిర్ణయం మార్చుకున్న థర్డ్ అంపైర్ ఇదిలా ఉంటే.. రాజస్తాన్ ఇన్నింగ్స్‌లో గుజరాత్ బౌలర్ మోహిత్ శర్మ పదిహేడో ఓవర్ వేశాడు. ఐదో బంతిని అవుట్ సైడ్ ఆఫ్ దిశగా సంధించగా సంజూ షాట్ ఆడబోయి విఫలమయ్యాడు. ఈ క్రమంలో అంపైర్ ఆ బంతిని వైడ్‌గా ప్రకటించాడు. దీంతో కోపోద్రిక్తుడైన గుజరాత్ సారథి శుబ్‌మన్ గిల్ రివ్యూకు వెళ్లాడు. అయితే, తొలుత అది ఫెయిర్ డెలివరీ అని చెప్పిన థర్డ్ అంపైర్.. తర్వాత వైడ్‌గా ప్రకటించాడు. ఫలితంగా రాజస్తాన్ ఖాతాలో అదనపు పరుగు చేరింది. అప్పటికే బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చుకోవడంతో ఆగ్రహంగా ఉన్న గిల్.. ఈ వైడ్ విషయాన్ని తేలిగ్గా తీసుకోలేకపోయాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తూ ఫీల్డ్ అంపైర్ వినోద్ శేషన్‌తో గొడవకు దిగాడు. వైడ్ గురించి చాలా సేపు అతడితో వాదించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. Shubman Gill has grown well as leader ⭐ Loving this version 🩷pic.twitter.com/kaDnJTGX8N — Cricspace (@cricspace69) April 10, 2024 గుజరాత్‌దే పైచేయి.. రాజస్తాన్ జైత్రయాత్రకు బ్రేక్ ఇదిలా ఉంటే.. రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్(72), ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రషీద్ ఖాన్ ధనాధన్ ఇన్నింగ్స్(11 బంతుల్లో 24 నాటౌట్) కారణంగా గుజరాత్.. రాజస్తాన్ విధించిన లక్ష్యాన్ని ఛేదించింది. ఆఖరి బంతికి రషీద్ ఖాన్ ఫోర్ బాదడంతో.. మూడు వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ గెలుపు నమోదు చేసింది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: #Sanju: మాట్లాడలేకపోతున్నా.. అతడి వల్లే ఓటమి.. ఆ ఒక్క బంతి..! RASHID KHAN PUTS A HALT ON RR'S WINNING STREAK 🔥🔥#RRvGT #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/EdbdG9dG8o — JioCinema (@JioCinema) April 10, 2024 -
ఫైనల్ లో జడేజా బాటింగ్ పై సురేష్ రైనా కామెంట్స్
-
మధ్యలో డిస్టర్బ్ చేయడం ఎందుకో? హార్దిక్‌ను ఏకిపారేసిన గావస్కర్..పైగా..
IPL 2023 Final CSK Vs GT- Winner CSK: ‘‘ఆఖరి ఓవర్లో మొదటి 3-4 బంతులు అతడు అద్బుతంగా బౌల్ చేశాడు. కానీ ఏంటో అనూహ్యంగా మధ్యలో హార్దిక్ పాండ్యా వచ్చాడు. అతడితో ఏదో మాట్లాడాడు. నిజానికి ఓ బౌలర్ మంచి రిథమ్, లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తున్నపుడు అతడిని ఎవరూ డిస్టర్బ్ చేయకూడదు. అతడు సరైన దిశలో పయనిస్తున్నపుడు అనవసరంగా సలహాలు ఇవ్వడం ఎందుకు? దూరం నుంచి చూసి మనం.. అతడు అలా బౌల్ చేస్తున్నాడు. ఇలా బౌల్ చేస్తున్నాడు అని విశ్లేషణలు చేస్తూ ఉంటాం. సదరు బౌలర్ ఫామ్‌లో ఉన్నపుడు ఎవరైనా అంత వరకే ఆగిపోవాలి. అంతేగానీ.. అతడి దగ్గరికి వెళ్లి సలహాలు, సూచనలు ఇవ్వడం సరికాదు. పాండ్యా అక్కడికి వెళ్లగానే ఒక్కసారిగా మోహిత్ ముఖమే మారిపోయింది. అతడు బిత్తరచూపులు చూడటం మొదలుపెట్టాడు. ఆ వాటర్ బాటిల్ ఎందుకో’’ అని టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ అన్నాడు. హార్దిక్ పాండ్యా చేసిన పనేమీ బాగా లేదని విమర్శలు గుప్పించాడు. కాగా ఐపీఎల్-2023 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్- గుజరాత్ టైటాన్స్ తలపడిన విషయం తెలిసిందే. వర్షం కారణంగా రిజర్వ్ డే అయిన సోమవారం(మే 29) జరిగిన ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయీస్ పద్ధతిలో సీఎస్కే 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా ఐదోసారి ట్రోఫీ గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలవాలనుకున్న డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ ఆశలపై నీళ్లు చల్లింది. ఇక వర్షం కారణంగా లక్ష్య ఛేదనలో 15 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో గుజరాత్ పేసర్ మోహిత్ శర్మ చేతికి బంతినిచ్చాడు కెప్టెన్ పాండ్యా. అప్పటికి శివం దూబే, రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నారు. ఈ క్రమంలో మొదటి బంతిని పర్ఫెక్ట్ యార్కర్‌గా మలిచిన మోహిత్.. దూబేకు పరుగు తీసే అవకాశం ఇవ్వలేదు. రెండో బాల్ కూడా యార్కరే. ఈసారి దూబే ఒక పరుగు తీయగలిగాడు. ఇక మూడో బంతికి కూడా అద్భుతమైన యార్కర్ సంధించి సీఎస్కే అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. నాలుగో బంతి కూడా సేమ్. ఈ క్రమంలో చెన్నై విజయసమీకరణం 2 బంతుల్లో 10 పరుగులుగా మారింది. జడ్డూ క్రీజులో ఉన్నాడు. ప్రేక్షకుల్లో నరాలు తెగే ఉత్కంఠ. అంతలో హార్దిక్ పాండ్యా వచ్చి మోహిత్‌తో ముచ్చటించాడు. ఆ తర్వాతి బంతిని జడ్డూ సిక్సర్‌గా మలిచాడు. విజయానికి ఒక్క బంతికి నాలుగు పరుగులు కావాల్సిన తరుణంలో జడ్డూ బౌండరీ బాది సీఎస్కేను చాంపియన్‌గా నిలిపాడు.ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ ఆఖరి ఓవర్ హైడ్రామా గురించి ఇండియా టుడేతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. చదవండి: సీఎస్కేకు ఫైనల్లో అడ్వాంటేజ్ అంటూ ట్వీట్! నీకెందుకంత అక్కసు? మరి ముంబై అయితే.. Happy Tears 🥹#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁pic.twitter.com/jf05fszEDA — Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023 -
స్కూటీపై చక్కర్లు; ఆ ఇద్దరు గుజరాత్ బలం.. జాగ్రత్త
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా మరికొద్ది గంటల్లో సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ ఫైనల్లో తలపడనున్నాయి. మరి ఫైనల్లో ఎవరు విజేత అనేది ఆసక్తికరంగా మారింది. సీఎస్కే ఐదోసారి ఛాంపియన్‌గా నిలిచి ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేస్తుందా లేక గుజరాత్ టైటాన్స్ రెండోసారి టైటిల్ గెలుస్తుందా అనేది చూడాలి. ఈ విషయం పక్కనబెడితే.. గుజరాత్ టైటాన్స్ హెడ్‌కోచ్ ఆశిష్ నెహ్రా ఫైనల్ మ్యాచ్‌కు ముందు అహ్మదాబాద్‌లోని నరేంద్ర స్టేడియంలో స్కూటీపై చక్కర్లు కొట్టడం వైరల్‌గా మారింది, పైగా నెహ్రాకు తోడుగా స్కూటీపై మోహిత్ శర్మ, రషీద్ ఖాన్లు కూడా ఉండడం ఆసక్తి కలిగించింది. కాగా ఈ వీడియోనూ జియో సినిమా స్వయంగా ట్విటర్లో షేర్ చేస్తూ.. ''గుజరాత్ టైటాన్స్ ON Their Way To #IPLFinal Like..'' అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక గుజరాత్ టైటాన్స్‌కు బౌలింగ్ పెద్ద బలం అని చెప్పొచ్చు. పర్పుల్‌క్యాప్ రేసులో గుజరాత్ టైటాన్స్ నుంచే ముగ్గురు బౌలర్లు ఉండడం విశేషం. మహ్మద్ షమీ 28 వికెట్లతో టాప్‌లో ఉండగా.. రషీద్ ఖాన్ 27, మోహిత్ శర్మ 24 వికెట్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. వీడియో చూసిన అభిమానులు.. ''ఆ ఇద్దరు గుజరాత్ టైటాన్స్‌కు బలం.. కాస్త జాగ్రత్త'' అంటూ కామెంట్ చేశారు #GujaratTitans on their way to the #IPLFinal like... pic.twitter.com/nldijNxMR8 — JioCinema (@JioCinema) May 27, 2023 చదవండి: సీఎస్కే ఐదోసారి కొడుతుందా లేక గుజరాత్ డబుల్ ధమాకానా? -
#MohitSharma: ఐదు వికెట్లు.. ఫ్లేఆఫ్స్ చరిత్రలో రెండో బౌలర్‌గా
ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ మోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 పోరులో మోహిత్ శర్మ ఐదు వికెట్లతో చెలరేగాడు. మోహిత్ శర్మ బౌలింగ్ దెబ్బకు ముంబై ఇండియన్స్ 171 పరుగులకు ఆలౌటై 62 పరుగులతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించిది. ఇక 2.2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన మోహిత్ శర్మ 10 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీయడం విశేషం. ఐపీఎల్ చరిత్రలో ప్లేఆఫ్స్‌లో ఐదు వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా మోహిత్ శర్మ నిలిచాడు. ఇంతకముందు ఆకాశ్ మధ్వాల్(ముంబై ఇండియన్స్).. లక్నోతో మ్యాచ్‌లో ఐదు పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. ఇక ఈ సీజన్లో డెత్ ఓవర్లలో(16-20 ఓవర్లు) అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మోహిత్ రెండో స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు ఈ సీజన్లో మోహిత్ శర్మ 14 వికెట్లు తీయగా.. తొలి స్థానంలో సీఎస్కేకు మతీశా పతిరానా(16 వికెట్లు) ఉండగా.. వీరిద్దరి తర్వాత హర్షల్‌పటేల్(ఆర్షీబీ) 11 వికెట్లతో ఉన్నాడు. చదవండి: #SaiSudharsan: రిటైర్డ్ ఔట్.. ఐపీఎల్ చరిత్రలో మూడో ఆటగాడిగా -
గుజరాత్లో ఉన్నాను.. నాకిష్టమైన తిండి దొరకదు కదా: మహ్మద్ షమీ
IPL 2023 GT Vs SRH- Mohammed Shami: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్‌బౌలర్ మహ్మద్ షమీ. పవర్ ప్లేలోనే మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. రైజర్స్ ఓపెనర్ అన్మోల్ప్రీత్ సింగ్(5), కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్(10), రాహుల్ త్రిపాఠి (1), హెన్రిచ్ క్లాసెన్ (64) రూపంలో కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. పర్పుల్ క్యాప్ అందుకున్న షమీ టాపార్డర్‌ను కకావికలం చేసిన షమీ.. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి మొత్తంగా 20 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు కూల్చాడు. తద్వారా గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండోసారి ప్లే ఆఫ్స్ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక ఈ మ్యాచ్‌లో అద్బుత ప్రదర్శనతో అదరగొట్టిన షమీ.. పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ఐపీఎల్-2023 సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్‌లలో 23 వికెట్లు తీసిన ఈ టీమిండియా పేసర్.. అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో టాప్‌లో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే.. మ్యాచ్ అనంతరం షమీ.. కామెంటేటర్ రవిశాస్త్రితో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. నువ్వేం తింటావు? గుజరాత్లో ఉన్నాను కదా! నువ్వేమి తింటావు? షమీ అంటూ రవిశాస్త్రి షమీని అడుగగా.. ‘‘గుజరాత్లో ఉన్నాను కదా! నాకు ఏది ఇష్టమో అది తినలేకపోతున్నా!’’ అని సరదాగా బదులిచ్చాడు. దీంతో ఇద్దరూ ఒక్కసారిగా గట్టిగా నవ్వుకున్నారు. కాగా షమీకి బిర్యానీ అంటే ఇష్టం అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌లో తన ఫేవరెట్ బిర్యానీని మిస్ అవుతున్నానంటూ షమీ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. ఇక తన బౌలింగ్ గురించి చెబుతూ.. ‘‘సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌల్ చేయడానికి ప్రయత్నిస్తాను. నా బలం అదే! కొత్త బంతిని వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకుంటా. వాళ్లు సైతం నేటి మ్యాచ్‌లో మిడిల్ ఓవర్లలో మోహిత్ శర్మ అద్భుతం చేశాడు. రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ కూడా తమ వంతు పాత్ర పోషించారు’’ అని మహ్మద్ షమీ చెప్పుకొచ్చాడు. కాగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ సెంచరీ సాధించడంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 188 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన రైజర్స్‌కు గుజరాత్ బౌలర్లు చుక్కలు చూపించారు. షమీ, మోహిత్ శర్మ నాలుగేసి వికెట్లతో చెలరేగగా.. యశ్ దయాల్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. టైటాన్స్ బౌలర్ల విజృంభణతో 154 పరుగులకే పరిమితమైన సన్‌రైజర్స్ ఓటమిపాలై ఐపీఎల్-2023 ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. చదవండి: గెలుపు జోష్‌లో ఉన్న గుజరాత్‌కు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం! ఆరోజు నైట్ పార్టీకెళ్లా.. ఔటయ్యా..! అప్పటి నుంచి: విరాట్ కోహ్లి .@MdShami11 with the new ball is a MOOD 🔥🔥 #TATAIPL | #GTvSRH | @gujarat_titans Relive his lethal start with the ball here 🎥🔽 pic.twitter.com/2Na7SBcDu8 — IndianPremierLeague (@IPL) May 15, 2023 -
రీఎంట్రీ అదుర్స్.. వంద వికెట్ల క్లబ్లో మోహిత్ శర్మ
మూడేళ్ల తర్వాత ఐపీఎల్లో రీఎంట్రీ ఇచ్చిన మోహిత్ శర్మ అదరగొడుతున్నాడు. ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మోహిత్ శర్మ తాజాగా ఐపీఎల్లో వంద వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రిపల్ పటేల్ వికెట్ తీయడం ద్వారా మోహిత్ శర్మ ఈ ఘనత సాధించాడు. 34 ఏళ్ల వయసులో ఐపీఎల్లో 92 మ్యాచ్‌లాడి వంద వికెట్ల మార్క్ అందుకున్న మోహిత్ అత్యంత పెద్ద వయస్కుడిగా రికార్డులకెక్కాడు. ఇక టీమిండియా తరపున వంద వికెట్ల ఫీట్ సాధించిన పదో పేస్ బౌలర్‌గా మోహిత్ నిలిచాడు. భారత్ తరపున ఐపీఎల్లో ఇప్పటివరకు భువనేశ్వర్(161 వికెట్లు), జస్ప్రీత్ బుమ్రా (145 వికెట్లు), ఉమేష్ యాదవ్ (136 వికెట్లు), సందీప్ శర్మ (122 వికెట్లు), మహ్మద్ షమీ (116 వికెట్లు), హర్షల్ పటేల్ (108 వికెట్లు), ఆశిష్ నెహ్రా (106 వికెట్లు), ఆర్ వినయ్ కుమార్ (105 వికెట్లు), జహీర్ ఖాన్ (102 వికెట్లు), మోహిత్ శర్మ (100 వికెట్లు) ఉన్నారు. 100 Wickets for Mohit Sharma in IPL. pic.twitter.com/spovKqvB3T — CricketGully (@thecricketgully) May 2, 2023 100 wickets and countless memories 🤩 Congratulations, Mohit Sharma!#AavaDe | #TATAIPL 2023 | #GTvDC pic.twitter.com/XVmJzrabmz — Gujarat Titans (@gujarat_titans) May 2, 2023 చదవండి: గార్గ్ తప్పిదం.. దిక్కుతోచని స్థితిలో వార్నర్ ఔట్! -
మోహిత్ శర్మ స్టన్నింగ్ క్యాచ్.. ప్రయోగం బెడిసికొట్టింది
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కేకేఆర్ ప్రయోగం వికటించింది. ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు బ్యాటింగ్‌లో ప్రమోషన్ కల్పించి పించ్ హిట్టర్‌గా మూడో స్థానంలో పంపితే అతను మాత్రం డకౌట్ అయ్యాడు. షమీ బౌలింగ్‌లో ఇన్నింగ్స్ ఐదో ఓవర్ నాలుగో బంతిని భారీ షాట్ ఆడే ప్రయత్నంలో మోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే ఇక్కడ మోహిత్ క్యాచ్ హైలెట్‌గా నిలిచింది. మిడాన్ నుంచి వెనక్కి పరిగెత్తిన మోహిత్ శరీరాన్ని విల్లులా ఒంపి డైవ్ చేస్తూ అద్భుతంగా క్యాచ్ తీసుకున్నాడు. దీంతో శార్దూల్ కథ ముగిసింది. అంతకముందే మోహిత్ ఎడమచేతి వేలికి గాయమైంది. ఐస్ ప్యాక్ పెట్టుకొని ఫీల్డింగ్ చేశాడు. గాయాన్ని సైతం లెక్కచేయకుండా స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. శార్దూల్‌కు కలిసి రాని ప్రమోషన్ ఇక శార్దూల్ ఠాకూర్‌కు బ్యాటింగ్‌లో ప్రమోషన్ ఇచ్చిన ప్రతీసారి అతనికి కలిసిరాలేదని చెప్పొచ్చు. తన టి20 కెరీర్లో మూడో స్థానంలో బ్యాటింగ్ రావడం శార్దూల్‌కు ఇదే తొలిసారి. ఇంతకముందు 2021 ఐపీఎల్లో క్వాలిఫయర్‌లో భాగంగా సీఎస్కేతో మ్యాచ్‌లో ఢిల్లీ తరపున నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. అప్పుడు గోల్డెన్ డకౌట్ అయిన శార్దూల్ తాజాగా గుజరాత్‌తో మ్యాచ్‌లో పించ్ హిట్టర్‌గా వచ్చి(మూడోస్థానంలో) డకౌట్‌గా వెనుదిరిగాడు. Mohit Sharma you beauty 🔥🔥 A remarkable catch running backwards to dismiss Shardul Thakur 👏🏻👏🏻#TATAIPL | #KKRvGT pic.twitter.com/QOOS30qusH — IndianPremierLeague (@IPL) April 29, 2023 చదవండి: ట్రాక్‌లో పడాలంటే ఆలు పరోటాలు చేయాల్సిందేనా! -
లక్నో చేజేతులా...
గెలిచే దారిలో ఓటమిని పిలవడం అంటే ఇదే! 19 ఓవర్లలో లక్నో స్కోరు 124/3. ఇంకా 7 వికెట్లున్న జట్టు 6 బంతుల్లో 12 పరుగులు చేస్తే చాలు. పైగా తొలి ఓవర్ నుంచి ఆడుతున్న ఓపెనర్ కేఎల్ రాహుల్ అర్ధసెంచరీ చేసి క్రీజులో ఉన్నాడు. ఆఖరి ఓవర్ మొదటి బంతికి 2 పరుగులు కూడా చేశాడు. 5 బంతుల్లో 10 పరుగులు సులభంగానే కనిపించింది. కానీ మోహిత్ శర్మ వేసిన తర్వాతి 2 బంతులు రాహుల్, స్టొయినిస్‌లను బోల్తా కొట్టించాయి. ఇంకో 2 బంతులకు ఆయుశ్ బదోని, దీపక్ హుడా రనౌటయ్యారు. అంతే ఆఖరి బంతి మిగిలుంది కానీ... టైటాన్స్ గెలిచింది! సమీకరణం 1 బంతికి 8 పరుగులు కాగా... మోహిత్ కనీసం ఒక పరుగైనా ఇవ్వలేదు. దీంతో ఎవరూహించని విజయం గుజరాత్ గూటికి చేరింది. లక్నో: మోహిత్ శర్మ స్వింగ్ (2/17)తో గుజరాత్ టైటాన్స్ కింగ్ అయ్యింది. అనూహ్యంగా ఓటమి కోరల్లోంచి గెలుపు మజిలీకి చేరింది. అలవోకగా గెలవాల్సిన చోట లక్నో సూపర్ జెయింట్స్ వరుస నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు చేజార్చుకొని ఓటమిని పలకరించింది. మొదట గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (50 బంతుల్లో 66; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), వృద్ధిమాన్ సాహా (37 బంతుల్లో 47; 6 ఫోర్లు) రాణించారు. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా, స్టొయినిస్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 128 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (61 బంతుల్లో 68; 8 ఫోర్లు) పోరాటం జట్టును గెలిపించలేకపోయింది. మోహిత్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది. కెప్టెన్ ఇన్నింగ్స్... సాహాతో శుబ్‌మన్ గిల్ (0) ‘ఇంపాక్ట్’ డకౌటైంది. వన్‌డౌన్‌లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా అండతో సాహా బౌండరీలతో టైటాన్స్ స్కోరును కదిలించాడు. ఈ జోడీ పవర్‌ప్లేలో 40 పరుగులు చేసింది. ఆ తర్వాత అడపాదడపా ఫోర్లతో 10 ఓవర్ల దాకా వికెట్‌ను కాపాడుకున్నారు. జట్టు స్కోరు 72 వద్ద సాహాను కృనాల్ పాండ్యా అవుట్ చేయగా... తర్వాత వచ్చిన అభినవ్ (3), విజయ్ శంకర్ (10) నిరాశపరచడంతో పెద్ద స్కోరేం కాలేదు. ఆఖరి ఓవర్లలో హార్దిక్ భారీ సిక్సర్లతో స్కోరు పెంచే ప్రయత్నం చేశాడు. 44 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్న పాండ్యా ఆఖరి ఓవర్లో నిష్క్రమించాడు. రాహుల్ ఒంటరి పోరాటం... లక్నో ముందున్న లక్ష్యం 136 పరుగులు. కష్టమైందో... కఠినమైందో కానే కాదు! ఓపెనింగ్ జోడీ కెప్టెన్ రాహుల్, కైల్ మేయర్స్ (19 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్) పవర్ ప్లేలోనే 53 పరుగులు చేయడంతో లక్ష్యఛేదన సులువుగా సాగింది. మేయర్స్ తర్వాత కృనాల్ పాండ్యా (23 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) అవుటయ్యేసరికే జట్టు 100 పరుగులను దాటింది. నికోలస్ పూరన్ (1) విఫలమైనా... రాహుల్ క్రీజును అట్టిపెట్టుకోవడంతో ఎవరికీ ఏ బెంగా లేదు. రాహుల్ 38 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. ఆఖరి ఓవర్‌కు ముందు 124/3 స్కోరుతో లక్నో పటిష్టంగా ఉంది. కానీ ఆ తర్వాతే మోహిత్ చివరి ఓవర్ అనూహ్యంగా సూపర్ జెయింట్స్‌ను ఓడించింది. కచ్చితత్వం లేని షాట్లతో రాహుల్, స్టొయినిస్ (0)వికెట్లను పారేసుకుంటే... పరుగుల వేటలో ఆయుశ్ బదోని (8), దీపక్ హుడా (2) రనౌటయ్యారు. స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి) హుడా (బి) కృనాల్ 47; గిల్ (సి) బిష్ణోయ్ (బి) కృనాల్ 0; హార్దిక్ పాండ్యా (సి) రాహుల్ (బి) స్టొయినిస్ 66; అభినవ్ (సి) నవీనుల్ హఖ్ (బి) మిశ్రా 3; విజయ్ శంకర్ (బి) నవీనుల్ హఖ్ 10; మిల్లర్ (సి) హుడా (బి) స్టొయినిస్ 6; తెవాటియా (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 135. వికెట్ల పతనం: 1–4, 2–72, 3–77, 4–92, 5–132, 6–135. బౌలింగ్: నవీనుల్ హఖ్ 4–0–19–1, కృనాల్ పాండ్యా 4–0–16–2, అవేశ్ ఖాన్ 3–0–21–0, రవి బిష్ణోయ్ 4–0–49–0, స్టొయినిస్ 3–0–20–2, అమిత్ మిశ్రా 2–0–9–1. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) జయంత్ (బి) మోహిత్ 68; మేయర్స్ (బి) రషీద్ ఖాన్ 24; కృనాల్ (స్టంప్డ్) సాహా (బి) నూర్ అహ్మద్ 23; పూరన్ (సి) హార్దిక్ (బి) నూర్ అహ్మద్ 1; బదోని (రనౌట్) 8; స్టొయినిస్ (సి) మిల్లర్ (బి) మోహిత్ 0; దీపక్ హుడా (రనౌట్) 2; ప్రేరక్ మన్కడ్ (నాటౌట్) 0; రవి బిష్ణోయ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 128. వికెట్ల పతనం: 1–55, 2–106, 3–110, 4–126, 5–126, 6–127, 7–128. బౌలింగ్: షమీ 3–1–18–0, జయంత్ 4–0–26–0, రషీద్ ఖాన్ 4–0–33–1, మోహిత్ శర్మ 3–0–17–2, నూర్ అహ్మద్ 4–0–18–2, హార్దిక్ పాండ్యా 1–0–7–0, రాహుల్ తెవాటియా 1–0–8–0. -
ఒకప్పుడు పర్పుల్ క్యాప్ విన్నర్.. తర్వాత నెట్‌బౌలర్! 6.5 కోట్ల నుంచి 50 లక్షల ధరకు..
From Purple Cap To Net Bowler To IPL Return- Mohit Sharma Comeback Story: ‘‘ఎప్పుడెప్పుడు మైదానంలో అడుగుపెడతానా అన్న ఆతురత ఓవైపు.. చాలా ఏళ్ల తర్వాత పునరాగమనం చేస్తున్నా కదా.. పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో అన్న బెరుకు మరోవైపు.. వెన్ను నొప్పి నుంచి కోలుకున్న తర్వాత గతేడాది దేశవాళీ క్రికెట్ ఆడాను.. అతికొద్ది మందికి మాత్రమే నేను డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్నానని తెలుసు. వారిలో అషూ పా ఒకరు. అషూ పా నాకు కాల్ చేసి జట్టుతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పారు. నాకు కూడా.. ‘‘ఇంట్లో కూర్చుని పెద్దగా చేసేది కూడా ఏం లేదు కదా’’ అని అనిపించింది. అందుకే ఇంట్లో ఖాళీగా ఉండే బదులు జట్టుతో ఉండాలని నిర్ణయించుకున్నా. గతేడాది గుజరాత్ టైటాన్స్ నెట్ బౌలర్‌గా సేవలు అందించా. నెట్ బౌలర్‌గా ఉండటం అవమానకరంగా భావించాల్సిన విషయమేమీ కాదు. పైగా మనకు కావాల్సినంత ఎక్స్పోజర్ దొరుకుతుంది. గుజరాత్ టైటాన్స్‌తో కలిసి పనిచేయడం అద్భుతంగా ఉంది’’ అని టీమిండియా పేసర్ మోహిత్ శర్మ అన్నాడు. ఐపీఎల్లో తన పునరాగమనానికి కారణం ఆశిష్ నెహ్రా భయ్యా అని చెప్పుకొచ్చాడు. అంతా ఆయన వల్లే టైటాన్స్ డ్రెస్సింగ్ రూంలో వాతావరణం ఎంతో బాగుంటుందని కోచ్ నెహ్రా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా సహాయ సహకారాల వల్లే తను అనుకున్నది చేయగలిగానని తెలిపాడు. కాగా గతంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన మోహిత్ శర్మ 2014 సీజన్లో పర్పుల్ క్యాప్ గెలిచాడు. సీఎస్కే తరఫున 16 మ్యాచ్‌లలో 23 వికెట్లు పడగొట్టి ఆ ఏడాది అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. చెన్నైకి ప్రాతినిథ్యం వహిస్తూ తన ప్రతిభను నిరూపించుకున్న ఈ ఫాస్ట్‌బౌలర్ 2015 వరల్డ్‌కప్ జట్టుకు ఎంపికయ్యాడు కూడా! పర్పుల్ క్యాప్ విన్నర్ నుంచి నెట్ బౌలర్‌గా చివరిగా.. 2015లో టీమిండియాకు ఆడిన ఈ హర్యానా బౌలర్ ఐపీఎల్-2020 సీజన్ తర్వాత క్యాష్ రిచ్ లీగ్‌కు కూడా దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో గతేడాది గుజరాత్ టైటాన్స్‌కు నెట్ బౌలర్‌గా ఉన్న మోహిత్ శర్మ.. ఆశిష్ నెహ్రా సూచన మేరకు దేశవాళీ క్రికెట్లో ఆటను కొనసాగించాడు. ఘనంగా పునరాగమనం ఈ క్రమంలో ఐపీఎల్-2023లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌తో గుజరాత్ తరఫున అరంగేట్రం చేస్తూ ఐపీఎల్లో రీఎంట్రీ ఇచ్చాడు. వచ్చీ రాగానే తన సత్తా ఏమిటో మరోసారి నిరూపించుకున్నాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో మొత్తంగా నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన మోహిత్.. 18 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు పంజాబ్ వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ(25), ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ (22)లను అవుట్ చేశాడు. తద్వారా పంజాబ్‌ను తక్కువ స్కోరుకు కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. జట్టు విజయంలో తన వంతు సాయం అందించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అప్పుడు ఆరున్నర కోట్లు.. ఇప్పుడు 50 లక్షలు ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. తన రీఎంట్రీ, విజయం వెనుక ఆశిష్ నెహ్రా సహకారం ఉందంటూ కృతజ్ఞతా భావం చాటుకున్నాడు మోహిత్ శర్మ. కాగా 2016లో 6.5 కోట్ల రూపాయల(కింగ్స్ ఎలెవన్)కు అమ్ముడుపోయిన రైట్ఆర్మ్ మీడియం పేసర్ మోహిత్‌ను.. గుజరాత్ ఈ ఏడాది మినీ వేలంలో 50 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. స్టార్ బౌలర్‌గా భారీ ధర పలికిన మోహిత్.. నెట్ బౌలర్‌గా పనిచేసి ప్రస్తుతం 50 లక్షల ప్లేయర్‌గా మారడం గమనార్హం. ఏదేమైనా గుజరాత్ టైటాన్స్ రూపంలో వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే మోహిత్‌కు పూర్వ వైభవం వచ్చే దాఖలాలు లేకపోలేదు. పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ స్కోర్లు టాస్: గుజరాత్- బౌలింగ్ పంజాబ్: 153/8 (20) గుజరాత్: 154/4 (19.5) విజేత: గుజరాత్ టైటాన్స్.. 6 వికెట్ల తేడాతో గెలుపు చదవండి: కేకేఆర్‌తో మ్యాచ్.. 13 కోట్ల ఆటగాడికి నో ఛాన్స్! సన్‌రైజర్స్ తుది జట్టు ఇదే An impressive Mohit Sharma debut for #GT ✅ An elegant Shubman Gill half-century ✅ A Trademark Tewatia Finish ✅ We have got the #PBKSvGT clash summed up for you 📽️🔽 #TATAIPL pic.twitter.com/RhpipfO2Ze — IndianPremierLeague (@IPL) April 14, 2023 -
హాఫ్ సెంచరీతో చెలరేగిన గిల్.. పోరాడి ఓడిన పంజాబ్
మొహాలి: డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఐపీఎల్ టోర్నీలో తమ ఖాతాలో మూడో విజయాన్ని జమ చేసుకుంది. పంజాబ్ కింగ్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. గుజరాత్ టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 153 పరుగులు సాధించింది. పంజాబ్ జట్టులో ఏ ఒక్కరూ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. నిలదొక్కుకుంటున్న దశలో పెవిలియన్ చేరుకున్నారు. క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా ఆడిన మాథ్యూ షార్ట్ (24 బంతుల్లో 36; 6 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జితేశ్ శర్మ (23 బంతుల్లో 25; 5 ఫోర్లు), స్యామ్ కరన్ (22 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్), షారుఖ్ ఖాన్ (9 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్స్‌లు), రాజపక్స (26 బంతుల్లో 20; 1 ఫోర్) ఫర్వాలేదనిపించారు. గుజరాత్ పేస్ బౌలర్, 2020 తర్వాత మళ్లీ ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మోహిత్ శర్మ 18 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం గుజరాత్ టైటాన్స్ జట్టు 19.5 ఓవర్లలో 4 వికెట్లకు 154 పరుగులు చేసి గెలిచింది. శుబ్‌మన్ గిల్ (49 బంతుల్లో 67; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో గుజరాత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా (19 బంతుల్లో 30; 5 ఫోర్లు), గిల్ ధాటిగా ఆడటంతో గుజరాత్ పవర్‌ప్లేలో 56 పరుగులు సాధించింది. అనంతరం సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా తక్కువ స్కోర్లకే వెనుదిరిగినా... మరోవైపు శుబ్‌మన్ గిల్ గుజరాత్ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. ఆచితూచి ఆడుతూనే అవకాశం దొరికినపుడల్లా బంతిని బౌండరీ దాటించిన గిల్ 40 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. డేవిడ్ మిల్లర్ (18 బంతుల్లో 17 నాటౌట్; 1 ఫోర్)తో కలిసి నాలుగో వికెట్‌కు 42 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. చివరి ఓవర్లో గుజరాత్ విజయానికి 7 పరుగులు అవసరమయ్యాయి. స్యామ్ కరన్ వేసిన ఈ ఓవర్లో తొలి బంతికి మిల్లర్ సింగిల్ తీయగా... రెండో బంతికి గిల్ బౌల్డయ్యాడు. తెవాటియా క్రీజులోకి వచ్చి సింగిల్ తీశాడు. నాలుగో బంతికి మిల్లర్ కూడా సింగిల్ తీశాడు. దాంతో గుజరాత్ విజయానికి చివరి 2 బంతుల్లో 4 పరుగులు కావల్సి రావడంతో కాస్త ఉత్కంఠ నెలకొంది. అయితే ఐదో బంతికి రాహుల్ తెవాటియా (2 బంతుల్లో 5 నాటౌట్; 1 ఫోర్) స్కూప్ షాట్‌తో బంతిని బౌండరీకి తరలించడంతో గుజరాత్ విజయం ఖరారైంది. అంతకుముందు పంజాబ్ జట్టుకు తొలి ఓవర్లోనే దెబ్బ పడింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ ఖాతా తెరవకుండానే షమీ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కెపె్టన్ శిఖర్ ధావన్ (8 బంతుల్లో 8; 2 ఫోర్లు) రెండు ఫోర్లు కొట్టినా భారీ షాట్‌కు యత్నించి నిష్క్రమించాడు. ప్రమాదకరంగా కనిపిస్తున్న షార్ట్‌ను రషీద్ బౌల్డ్ చేయడంతో పంజాబ్ ఇబ్బందుల్లో పడింది. చివర్లో షారుఖ్ ధాటిగా ఆడటంతో పంజాబ్ స్కోరు 150 దాటింది. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రభ్‌సిమ్రన్ సింగ్ (సి) రషీద్ ఖాన్ (బి) షమీ 0; శిఖర్ ధావన్ (సి) జోసెఫ్ (బి) లిటిల్ 8; మాథ్యూ షార్ట్ (బి) రషీద్ ఖాన్ 36; రాజపక్స (సి) గిల్ (బి) జోసెఫ్ 20; జితేశ్ శర్మ (సి) సాహా (బి) మోహిత్ శర్మ 25; స్యామ్ కరన్ (సి) గిల్ (బి) మోహిత్ శర్మ 22; షారుఖ్ ఖాన్ (రనౌట్) 22; హర్‌ప్రీత్ బ్రార్ (నాటౌట్) 8; రిషి ధావన్ (రనౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1–0, 2–28, 3–55, 4–92, 5–115, 6–136, 7–152, 8–153. బౌలింగ్: షమీ 4–0–44–1, జోష్ లిటిల్ 4–0–31–1, అల్జారి జోసెఫ్ 4–0–32–1, రషీద్ ఖాన్ 4–0–26–1, మోహిత్ శర్మ 4–0–18–2. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి) షార్ట్ (బి) రబడ 30; గిల్ (బి) స్యామ్ కరన్ 67; సాయి సుదర్శన్ (సి) ప్రభ్‌సిమ్రన్ సింగ్ (బి) అర్‡్షదీప్ 19; హార్దిక్ పాండ్యా (సి) స్యామ్ కరన్ (బి) హర్‌ప్రీత్ బ్రార్ 8; డేవిడ్ మిల్లర్ (నాటౌట్) 17; రాహుల్ తెవాటియా (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (19.5 ఓవర్లలో 4 వికెట్లకు) 154. వికెట్ల పతనం: 1–48, 2–89, 3–106, 4–148. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–33–1, రబడ 4–0–36–1, హర్‌ప్రీత్ 4–0–20–1, స్యామ్ కరన్ 3.5–0–25–1, రాహుల్ చహర్ 3–0–24–0, మాథ్యూ షార్ట్ 1–0–8–0. ఐపీఎల్లో నేడు కోల్‌కతా vs హైదరాబాద్ (రాత్రి గం. 7:30 నుంచి) స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం -
మూడేళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చిన ధోని నమ్మిన బౌలర్
టీమిండియా క్రికెటర్ మోహిత్ శర్మ ఐపీఎల్లో మూడేళ్ల తర్వాత తొలి మ్యాచ్ ఆడాడు. అయితే సుధీర్ఘ గ్యాప్ తర్వాత ఆడుతున్న మ్యాచ్‌లో మోహిత్ సూపర్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మోహిత్ శర్మ పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. ఒక రకంగా ఇది మంచి కమ్‌బ్యాక్ అని చెప్పొచ్చు. అతను చివరగా 2020 ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఆడాడు. ఆ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 45 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. ఇక మోహిత్ శర్మ అనగానే తొలుత గుర్తుకు వచ్చేది 2013 ఐపీఎల్ సీజన్. ఆ సీజన్లో సీఎస్కే తరపున 15 మ్యాచ్‌లు ఆడిన మోహిత్ శర్మ 23 వికెట్లు పడగొట్టాడు. 2013లో సీఎస్కే రన్నరప్‌గా నిలిచినప్పటికి మోహిత్ శర్మ మాత్రం ధోని నమ్మిన బౌలర్‌గా నిలిచాడు. ఆ తర్వాత 2015 వరకుసీఎస్కేకు ఆడిన మోహిత్ 2016-18 వరకు పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత 2018, 2019లో జరిగిన వేలంలో మళ్లీ సీఎస్కేనే దక్కించుకుంది. ఆ తర్వాత 2020 ఐపీఎల్ వేలంలో మోహిత్ శర్మ ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత 2022 ఐపీఎల్లో గుజరాత్ జెయింట్స్ నెట్ బౌలర్‌గా తీసుకుంది. ఇక 2023 మినీ వేలంలో మోహిత్ శర్మను గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. ఓవరాల్‌గా ఐపీఎల్ 88 మ్యాచ్‌లాడిన మోహిత్ శర్మ 122 వికెట్లు పడగొట్టాడు. ఇక 2013లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన మోహిత్ శర్మ టీమిండియా తరపున 26 వన్డేల్లో 31 వికెట్లు, 4 టి20 మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు పడగొట్టాడు. Mohit Sharma, playing his first IPL match since 2020, making his debut for Gujarat, went for just 18 runs from 4 overs by taking 2 wickets. Welcome back, Mohit. pic.twitter.com/ebfOyfKH6A — Johns. (@CricCrazyJohns) April 13, 2023 చదవండి: వచ్చీ రావడంతోనే రికార్డు.. అత్యంత వేగంగా వంద వికెట్లు -
ఒకప్పుడు అత్యధిక వికెట్ల వీరుడు.. ఇప్పుడు నెట్‌బౌలర్‌గా.. షాకింగ్!
ఒకప్పడు ఐపీఎల్లో దుమ్ము దులిపాడు. ప్రత్యర్ధి బ్యాటర్లకు తన బౌలింగ్‌తో చుక్కలు చూపించాడు. ఐపీఎల్-2014లో అత్యధిక వికెట్ల వీరుడు. అతడే టీమిండియా పేసర్ మెహిత్ శర్మ. ఒకప్పుడు స్టార్ బౌలర్‌గా చక్రం తిప్పిన మోహిత్ శర్మ ఇప్పుడు నెట్ బౌలర్‌గా ఎంపికయ్యడంటే ఊహించడానికే కష్టంగా ఉంది. ఐపీఎల్లో కొత్త జట్టుగా అవతరించిన గుజరాత్ టైటాన్స్‌కు నెట్ బౌలర్‌గా మెహిత్ శర్మ ఎంపికైనట్లు తెలుస్తోంది. అతడితో పాటు మరో భారత పేసర్ బరీందర్ స్రాన్ కూడా గుజరాత్ నెట్ బౌలర్‌గా ఎంపికైనట్లు సమాచారం. ఇక ఐపీఎల్-2022 మెగా వేలంలో పాల్గోన్న మెహిత్ శర్మను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. మోహిత్ శర్మ చివరసారిగా ఐపీఎల్-2021 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్‌కు ఆడాడు. ఇక 2014 సీజన్లో 23 వికెట్లు సాధించి పర్పుల్ క్యాప్‌ను కూడా గెలుచుకున్నాడు. ఇప్పటి వరకు 86 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన మోహిత్.. 92 వికెట్లు పడగొట్టాడు. ఇక 2014 టీ20 ప్రపంచకప్, 2015 వన్డే ప్రపంచకప్‌లో భారత్ తరుపున మోహిత్ శర్మ ప్రాతినిధ్యం వహించాడు. కాగా మార్చి 26 నుంచి ఐపీఎల్-2022 ప్రారంభం కానుంది. ఇక ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ తన తొలి మ్యాచ్‌ను మరో కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌తో మార్చి 28న ఆడనుంది. చదవండి: IPL 2022: కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: హార్దిక్ పాండ్యా -
తండ్రైన టీమిండియా క్రికెటర్.. అబ్బాయి పుట్టాడు అంటూ ఎమోషనల్
టీమిండియా క్రికెటర్ మోహిత్ శర్మ తండ్రయ్యాడు. అతడి భార్య శ్వేతా శర్మ సోమవారం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు మోహిత్. ఈ సందర్భంగా పాపాయి చేతిని తమ చేతుల్లోకి తీసుకున్న ఫొటోను షేర్ చేశాడు. ‘‘ఈ ప్రపంచంలోకి నీకు స్వాగతం. మా హృదయాలు సంతోషాలతో నిండిపోయాయి. మా కుమారుడి రాకను తెలియజేసేందుకు మేమెంతో గర్విస్తున్నాం’’అంటూ భావోద్వేగ క్యాప్షన్ జతచేశాడు. ఈ క్రమంలో సెలబ్రిటీలు, నెటిజన్ల నుంచి మోహిత్ శర్మ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా హర్యానాకు చెందిన మోహిత్ శర్మ టీమిండియా తరఫున ఇప్పటి వరకు 26 వన్డేలు, 8 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తంగా 37 వికెట్లు పడగొట్టాడు. చివరిసారిగా 2015లో భారత్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇక ఐపీఎల్లో మొత్తంగా 86 మ్యాచ్‌లు ఆడిన ఈ సీనియర్ బౌలర్.. 92 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక వ్యక్తిగత విషయానికొస్తే.. 2016లో శ్వేతను పెళ్లాడాడు మోహిత్ శర్మ. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వీరు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. చదవండి: IPL 2022 Auction: మెగా వేలానికి తేదీలు ఖరారు చేసిన గవర్నింగ్ కౌన్సిల్... సీవీసీకి గ్రీన్ సిగ్నల్! View this post on Instagram A post shared by Mohitmahipal Sharma (@mohitsharma18) -
మా జట్టు ఈసారి కచ్చితంగా కప్ కొడుతుంది
దుబాయ్ : ఇప్పటివరకు 12 ఐపీఎల్ సీజన్లు జరగ్గా ఢిల్లీ జట్టుకు మాత్రం ఐపీఎల్ టైటిల్ మాత్రం కలగానే మిగిలిపోయింది. 2008లో ప్రారంభమైన మొదటి సీజన్లో ఫ్లేఆఫ్స్ మినహాయిస్తే.. 2018 వరకు ఢిల్లీ జట్టు ప్రదర్శన లీగ్‌లో అంతంతమాత్రంగానే ఉండేది. మధ్యలో 2012లో మరొకసారి ఫ్లేఆఫ్స్‌కు అర్హత సాధించినా అది నామమాత్రంగానే మిగిలింది. కానీ 2019లో ఢిల్లీ క్యాపిటల్స్‌గా పేరు మార్చుకొని శ్రెయాస్ అయ్యర్ సారధ్యంలో ఏడేళ్ల తర్వాత ఫ్లేఆఫ్స్‌కు చేరింది. శిఖర్ ధవన్, రిషభ్ పంత్, పృథ్వీ షా, సందీప్ లమిచ్చానే వంటి ఆటగాళ్లతో పటిష్టంగా కనిపిస్తున్న ఢిల్లీ జట్టులో ఈ ఏడాది రవిచంద్రన్, అజింక్యా రహానేల చేరికతో మరింత బలంగా కనిపిస్తుంది.(చదవండి : ఈసారి ఐపీఎల్ టైటిల్ వారిదే: బ్రెట్ లీ) తాజాగా ఢిల్లీ పేసర్ మోహిత్ శర్మ ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి ఎలాగైనా కప్ కొడుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ' ఇప్పటివరకు ఉన్న ఫలితాలను పక్కనపెడితే.. ఢిల్లీ జట్టు ఎప్పుడు పటిష్టంగానే ఉంది. గతంలో వేరే జట్లకు ఆడినప్పుడు ప్రత్యర్థిగా ఢిల్లీ జట్టును దగ్గర్నుంచి చూశాను. ఇప్పడు మాత్రం ఢిల్లీని తీసిపారేసి జట్టుగా చూడొద్దు.. ఎందుకంటే ఢిల్లీ యువకులతో నిండిన బలమైన జట్టుగా తయారైంది. ఈ రెండేళ్లలో మరింత బలంగా తయారయ్యాం. దీంతో పాటు ఢిల్లీ జట్టుకు రికీ పాంటింగ్ ప్రధాన కోచ్‌గా రావడం.. రేయాన్ హారీస్ బౌలింగ్ కోచ్‌గా ఉండడం.. ఈ సీజన్లో మమ్మల్ని ఫేవరెట్‌గా మార్చాయి.' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ సెప్టెంబర్ 20న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో మొదటిమ్యాచ్‌లో తలపడనుంది. -
ధోని వల్లే అవకాశాలు
భారత జట్టులో చోటుపై పేసర్ మోహిత్ న్యూఢిల్లీ: రంజీల్లో అద్భుత ప్రదర్శన చేసి ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చోటు దక్కించుకున్న పేసర్ మోహిత్ శర్మ అనతి కాలంలోనే జాతీయ జట్టులోనూ మెరిశాడు. ఆసీస్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఇషాంత్ శర్మ స్థానంలో బరిలోకి దిగిన ఈ ఫరీదాబాద్ కుర్రాడు అక్కడా ప్రతిభ చూపి 13 వికెట్లు తీయగలిగాడు. అయితే ఇదంతా కెప్టెన్ ధోని వల్లే జరిగిందని చెబుతున్నాడు. దోని లేకుంటే భారత జట్టు తరఫున ఆడేవాడిని కాదేమో అని అన్నాడు. ‘ఇప్పటిదాకా నాకు లభించిన అవకాశాలన్నీ ధోని పుణ్యమే. అంతర్జాతీయ క్రికెట్లో కొత్తగా అడుగుపెట్టిన ఆటగాడికెవరికైనా కెప్టెన్ మద్దతు అత్యంత అవసరం. అది లేకుంటే రాణించడం సులువు కాదు. ఐపీఎల్‌తో పాటు భారత జట్టులోనూ ధోని నాయకత్వంలోనే ఆడటాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. మైదానం లోపలా.. బయటా అన్ని విషయాల్లోనూ తను సహాయంగా ఉంటాడు. చెన్నై జట్టుతో చేరిన కొత్తలో ధోని నాతో ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. ఇలాంటి స్థితి ఉన్నప్పుడు మనం ఏదో తప్పు చేస్తున్నట్టుగా భావిస్తాం. అయితే తనతో ఒకసారి మాట్లాడేసరికి ఇదంతా భ్రమేనని అనిపించింది. ‘నేను నేరుగా వచ్చి నీతో మాట్లాడితే ఒత్తిడిగా భావించి సరిగా రాణించవు. నీవిప్పటికే రంజీల్లో అద్భుతంగా రాణించి ఇక్కడిదాకా వచ్చావు’ అని ధోని నాతో అన్నాడు. ఓ కొత్త ఆటగాడికి ఇలాంటి మాటలు ఎంతగానో బలాన్నిస్తాయి’ అని 26 ఏళ్ల మోహిత్ అన్నాడు. 2013లో అరంగేట్రం చేసిన తను ఇప్పటిదాకా 20 వన్డేలు, నాలుగు టి20 మ్యాచ్‌లు ఆడాడ -
ముగ్గురు పాస్... ఇషాంత్ ఔట్
జట్టులో మోహిత్ శర్మ రోహిత్, భువీ, జడేజా ఫిట్ అడిలైడ్: ప్రపంచకప్‌కు ముందు భారత్‌కు ఊహిం చని ఎదురుదెబ్బ తగిలింది. మోకాలి గాయంతో బాధపడుతున్న సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ ఫిట్నెస్ పరీక్షలో విఫలమయ్యాడు. శనివారం నిర్వహించిన ఈ ఫిట్నెస్ టెస్టులో రోహిత్, భువనేశ్వర్, రవీంద్ర జడేజా మాత్రం పాసయ్యారు. మెల్బోర్న్లో బాక్సింగ్ డే టెస్టు ఆడిన ఇషాంత్ ఆ తర్వాత మళ్లీ బరిలోకి దిగలేదు. ఫిట్నెస్ను పరీ క్షించేందుకు ముక్కోణపు సిరీస్‌లో జనవరి 26న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యా చ్లో అతన్ని తీసుకున్నారు. కానీ వర్షం వల్ల మ్యాచ్ రద్దుకావడంతో ఇషాంత్‌కు బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. తర్వాత ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు తాను ఫిట్నెస్తో లేనని చెప్పి తప్పుకున్నాడు. దీంతో ఒక్కసారిగా ఈ ఢిల్లీ పేసర్ ఫిట్‌నెస్‌పై అనుమానాలు రేకెత్తాయి. ప్రస్తుతం ఇషాంత్ స్థానంలో మోహిత్ శర్మను జట్టులోకి తీసుకున్నారు. ‘ఇషాంత్ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. ప్రపంచకప్ వరకు అతను కోలుకోవడం కష్టమే. నిబంధనల ప్రకారం మోహిత్‌ను స్టాండ్ బైగా తీసుకున్నాం. ఇషాంత్ త్వరలోనే భారత్‌కు తిరిగొస్తాడు’ అని బీసీసీఐ ఉన్నతాధికారి తెలిపారు. అయితే ఈ విషయంపై బీసీసీఐ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు కాలిపిక్క కండరాల గాయంతో బాధపడుతున్న రోహిత్, చీలమండ గాయంతో ఇబ్బం దిపడుతున్న భువనేశ్వర్ పూర్తిస్థాయిలో మ్యాచ్ ఫిట్నెస్ సాధించారు. ఈ ఇద్దరు ఓపెన్ మీడియా సెషన్‌కు కూడా హాజరై తమ ఫిట్‌నెస్‌పై ఉన్న అనుమానాలను తొలగించారు. అయితే భుజం గాయం నుంచి కోలుకున్న జడేజా మాత్రం పరీక్షలో గట్టెక్కినా... వార్మప్ మ్యాచ్‌లో అతని ప్రదర్శనను పూర్తిస్థాయిలో పరిశీలించాలని జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది. -
మీర్పూర్ వన్డేలో భారత్ మెరుపు విజయం
-
4.4 ఓవర్లు.. 4 పరుగులు.. 6 వికెట్లు
మిర్పూర్: స్టువార్ట్ బిన్నీ రికార్డ్ బౌలింగ్ తో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ ను 2-0తో గెల్చుకుంది. రైనా సేన నిర్దేశించిన 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 17.4 ఓవర్లలో 58 పరుగులకు ఆలౌటయింది. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ను 41 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 25.3 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌటయింది. రైనా 27 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. స్వల్ప లక్ష్యాన్ని చేరుకునేందుకు బరిలోకి దిగిన బంగ్లాకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. మొహిత్ శర్మ, స్టువార్ట్ బిన్నీ ధాటికి బంగ్లా బ్యాట్స్‌మెన్ నిలబడలేకపోయారు. ముఖ్యంగా బిన్నీ తన పదునైన బౌలింగ్ తో అత్యుత్తమ గణంకాలు నమోదు చేశాడు. అంతేకాకుండా తక్కువ పరుగులిచ్చి ఎక్కువ వికెట్లు తీసిన భారతీయ బౌలర్ గా రికార్డు సృష్టించాడు. స్టువార్ట్ బిన్నీ 4.4 ఓవర్లలో 4 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. మొహిత్ శర్మ 4 వికెట్లు నేలకూల్చాడు. బంగ్లా ఆటగాళ్లలో మిథున్ అలీ(26), ముష్ఫికర్ రహీం(11) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. నలుగురు డకౌటయ్యారు. స్టువార్ట్ బిన్నీ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందుకున్నాడు. -
చెన్నై చమక్
7 వికెట్ల తేడాతో ముంబైపై గెలుపు రాణించిన మోహిత్ శర్మ, మెకల్లమ్ రోహిత్ సేనకు మూడో ఓటమి దుబాయ్: మోహిత్ శర్మ (4/14) సంచలన బౌలింగ్... బ్రెండన్ మెకల్లమ్ (53 బంతుల్లో 71 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు)మెరుపు ఇన్నింగ్స్‌తో... ఐపీఎల్-7లో చెన్నై ఖాతాలో మరో విజయం చేరింది. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ధోనిసేన 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లకు 141 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (41 బంతుల్లో 50; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీతో మెరిశాడు. అండర్సన్ (31 బంతుల్లో 39; 3 ఫోర్లు, 1 సిక్స్), తారే (19 బంతుల్లో 23; 4 ఫోర్లు) రాణించారు. అండర్సన్, రోహిత్ శర్మ మూడో వికెట్‌కు 64 బంతుల్లో 84 పరుగులు జోడించారు. ఓ దశలో 108/2తో పటిష్ట స్థితిలో ఉన్న ముంబై... మోహిత్ శర్మ ఒకే ఓవర్లో మూడు వికెట్లు (రాయుడు, పొలార్డ్, హర్భజన్) తీయడంతో 19 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు కోల్పోయింది. మోహిత్ శర్మ 4, హిల్ఫెన్హాస్ 2 వికెట్లు తీశారు. తర్వాత చెన్నై 19 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులు చేసింది. స్మిత్ (22 బంతుల్లో 29; 4 సిక్స్‌లు), డు ప్లెసిస్ (25 బంతుల్లో 20), ధోని (11 బంతుల్లో 14 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) సమయోచితంగా ఆడారు. స్మిత్‌తో కలిసి తొలి వికెట్‌కు 57 పరుగులు జోడించిన మెకల్లమ్... డు ప్లెసిస్‌తో కలిసి మూడో వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. హర్భజన్ 2, ఓజా ఒక్క వికెట్ పడగొట్టారు. మోహిత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ధోని, రోహిత్‌లకు ఇది వందో ఐపీఎల్ మ్యాచ్ కావడం విశేషం. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: మైక్ హస్సీ (బి) హిల్ఫెన్హాస్ 1; తారే (సి) రైనా (బి) మోహిత్ 23; అండర్సన్ రనౌట్ 39; రోహిత్ (సి) స్మిత్ (బి) హిల్ఫెన్హాస్ 50; పొలార్డ్ (బి) మోహిత్ 12; రాయుడు (సి) రైనా (బి) మోహిత్ 1; గౌతమ్ నాటౌట్ 7; హర్భజన్ (సి) బి. మెకల్లమ్ (బి) మోహిత్ 0; జహీర్ నాటౌట్ 7; ఎక్స్‌ట్రాలు: 1; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 141. వికెట్ల పతనం: 1-11; 2-25; 3-109; 4-123; 5-125; 6-127; 7-127 బౌలింగ్: ఈశ్వర్ పాండే 4-0-21-0; హిల్ఫెన్హాస్ 4-0-39-2; అశ్విన్ 4-0-20-0; మోహిత్ శర్మ 4-0-14-4; రైనా 3-0-32-0; జడేజా 1-0-14-0 చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: డ్వేన్ స్మిత్ (సి) అండర్సన్ (బి) ఓజా 29; బి. మెకల్లమ్ నాటౌట్ 71; రైనా (స్టంప్డ్) గౌతమ్ (బి) హర్భజన్ 1; డు ప్లెసిస్ (స్టంప్డ్) గౌతమ్ (బి) హర్భజన్ 20; ధోని నాటౌట్ 14; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: (19 ఓవర్లలో 3 వికెట్లకు) 142. వికెట్ల పతనం: 1-57; 2-61; 3-114 బౌలింగ్: ఓజా 4-1-25-1; జహీర్ 4-0-31-0; మలింగ 4-0-22-0; అండర్సన్ 2-0-23-0; హర్భజన్ 4-0-27-2; పొలార్డ్ 1-0-10-0.