చెన్నై చమక్
7 వికెట్ల తేడాతో ముంబైపై గెలుపు
రాణించిన మోహిత్ శర్మ, మెకల్లమ్
రోహిత్ సేనకు మూడో ఓటమి
దుబాయ్: మోహిత్ శర్మ (4/14) సంచలన బౌలింగ్... బ్రెండన్ మెకల్లమ్ (53 బంతుల్లో 71 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు)మెరుపు ఇన్నింగ్స్‌తో... ఐపీఎల్-7లో చెన్నై ఖాతాలో మరో విజయం చేరింది. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ధోనిసేన 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది.
దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లకు 141 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (41 బంతుల్లో 50; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీతో మెరిశాడు. అండర్సన్ (31 బంతుల్లో 39; 3 ఫోర్లు, 1 సిక్స్), తారే (19 బంతుల్లో 23; 4 ఫోర్లు) రాణించారు. అండర్సన్, రోహిత్ శర్మ మూడో వికెట్‌కు 64 బంతుల్లో 84 పరుగులు జోడించారు. ఓ దశలో 108/2తో పటిష్ట స్థితిలో ఉన్న ముంబై... మోహిత్ శర్మ ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు (రాయుడు, పొలార్డ్, హర్భజన్) తీయడంతో 19 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు కోల్పోయింది. మోహిత్ శర్మ 4, హిల్ఫెన్హాస్ 2 వికెట్లు తీశారు.
తర్వాత చెన్నై 19 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులు చేసింది. స్మిత్ (22 బంతుల్లో 29; 4 సిక్స్‌లు), డు ప్లెసిస్ (25 బంతుల్లో 20), ధోని (11 బంతుల్లో 14 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) సమయోచితంగా ఆడారు. స్మిత్‌తో కలిసి తొలి వికెట్‌కు 57 పరుగులు జోడించిన మెకల్లమ్... డు ప్లెసిస్‌తో కలిసి మూడో వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. హర్భజన్ 2, ఓజా ఒక్క వికెట్ పడగొట్టారు. మోహిత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ధోని, రోహిత్‌లకు ఇది వందో ఐపీఎల్ మ్యాచ్ కావడం విశేషం.
స్కోరు వివరాలు
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: మైక్ హస్సీ (బి) హిల్ఫెన్హాస్ 1; తారే (సి) రైనా (బి) మోహిత్ 23; అండర్సన్ రనౌట్ 39; రోహిత్ (సి) స్మిత్ (బి) హిల్ఫెన్హాస్ 50; పొలార్డ్ (బి) మోహిత్ 12; రాయుడు (సి) రైనా (బి) మోహిత్ 1; గౌతమ్ నాటౌట్ 7; హర్భజన్ (సి) బి. మెకల్లమ్ (బి) మోహిత్ 0; జహీర్ నాటౌట్ 7; ఎక్స్‌ట్రాలు: 1; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 141.
వికెట్ల పతనం: 1-11; 2-25; 3-109; 4-123; 5-125; 6-127; 7-127
బౌలింగ్: ఈశ్వర్ పాండే 4-0-21-0; హిల్ఫెన్హాస్ 4-0-39-2; అశ్విన్ 4-0-20-0; మోహిత్ శర్మ 4-0-14-4; రైనా 3-0-32-0; జడేజా 1-0-14-0
చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: డ్వేన్ స్మిత్ (సి) అండర్సన్ (బి) ఓజా 29; బి. మెకల్లమ్ నాటౌట్ 71; రైనా (స్టంప్డ్) గౌతమ్ (బి) హర్భజన్ 1; డు ప్లెసిస్ (స్టంప్డ్) గౌతమ్ (బి) హర్భజన్ 20; ధోని నాటౌట్ 14; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: (19 ఓవర్లలో 3 వికెట్లకు) 142.
వికెట్ల పతనం: 1-57; 2-61; 3-114
బౌలింగ్: ఓజా 4-1-25-1; జహీర్ 4-0-31-0; మలింగ 4-0-22-0; అండర్సన్ 2-0-23-0; హర్భజన్ 4-0-27-2; పొలార్డ్ 1-0-10-0.