Photo: IPL Twitter
మూడేళ్ల తర్వాత ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇచ్చిన మోహిత్ శర్మ అదరగొడుతున్నాడు. ఐపీఎల్ 16వ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మోహిత్ శర్మ తాజాగా ఐపీఎల్‌లో వంద వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రిపల్ పటేల్ వికెట్ తీయడం ద్వారా మోహిత్ శర్మ ఈ ఘనత సాధించాడు.
34 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లో 92 మ్యాచ్‌లాడి వంద వికెట్ల మార్క్ అందుకున్న మోహిత్ అత్యంత పెద్ద వయస్కుడిగా రికార్డులకెక్కాడు. ఇక టీమిండియా తరపున వంద వికెట్ల ఫీట్ సాధించిన పదో పేస్ బౌలర్‌గా మోహిత్ నిలిచాడు.
భారత్ తరపున ఐపీఎల్‌లో ఇప్పటివరకు భువనేశ్వర్(161 వికెట్లు), జస్ప్రీత్ బుమ్రా (145 వికెట్లు), ఉమేష్ యాదవ్ (136 వికెట్లు), సందీప్ శర్మ (122 వికెట్లు), మహ్మద్ షమీ (116 వికెట్లు), హర్షల్ పటేల్ (108 వికెట్లు), ఆశిష్ నెహ్రా (106 వికెట్లు), ఆర్ వినయ్ కుమార్ (105 వికెట్లు), జహీర్ ఖాన్ (102 వికెట్లు), మోహిత్ శర్మ (100 వికెట్లు) ఉన్నారు.
100 Wickets for Mohit Sharma in IPL. pic.twitter.com/spovKqvB3T
— CricketGully (@thecricketgully) May 2, 2023
100 wickets and countless memories 🤩
— Gujarat Titans (@gujarat_titans) May 2, 2023
Congratulations, Mohit Sharma!#AavaDe | #TATAIPL 2023 | #GTvDC pic.twitter.com/XVmJzrabmz
చదవండి: గార్గ్ తప్పిదం.. దిక్కుతోచని స్థితిలో వార్నర్ ఔట్!
Comments
Please login to add a commentAdd a comment