Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా మరికొద్ది గంటల్లో సీఎస్‌కే, గుజరాత్ టైటాన్స్ ఫైనల్లో తలపడనున్నాయి. మరి ఫైనల్లో ఎవరు విజేత అనేది ఆసక్తికరంగా మారింది. సీఎస్‌కే ఐదోసారి ఛాంపియన్‌గా నిలిచి ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేస్తుందా లేక గుజరాత్ టైటాన్స్ రెండోసారి టైటిల్ గెలుస్తుందా అనేది చూడాలి.
ఈ విషయం పక్కనబెడితే.. గుజరాత్ టైటాన్స్ హెడ్‌కోచ్ ఆశిష్ నెహ్రా ఫైనల్ మ్యాచ్‌కు ముందు అహ్మదాబాద్‌లోని నరేంద్ర స్టేడియంలో స్కూటీపై చక్కర్లు కొట్టడం వైరల్‌గా మారింది, పైగా నెహ్రాకు తోడుగా స్కూటీపై మోహిత్ శర్మ, రషీద్ ఖాన్‌లు కూడా ఉండడం ఆసక్తి కలిగించింది. కాగా ఈ వీడియోనూ జియో సినిమా స్వయంగా ట్విటర్‌లో షేర్ చేస్తూ.. ''గుజరాత్ టైటాన్స్ ON Their Way To #IPLFinal Like..'' అంటూ క్యాప్షన్ జత చేసింది.
ఇక గుజరాత్ టైటాన్స్‌కు బౌలింగ్ పెద్ద బలం అని చెప్పొచ్చు. పర్పుల్‌క్యాప్ రేసులో గుజరాత్ టైటాన్స్ నుంచే ముగ్గురు బౌలర్లు ఉండడం విశేషం. మహ్మద్ షమీ 28 వికెట్లతో టాప్‌లో ఉండగా.. రషీద్ ఖాన్ 27, మోహిత్ శర్మ 24 వికెట్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. వీడియో చూసిన అభిమానులు.. ''ఆ ఇద్దరు గుజరాత్ టైటాన్స్‌కు బలం.. కాస్త జాగ్రత్త'' అంటూ కామెంట్ చేశారు
#GujaratTitans on their way to the #IPLFinal like... pic.twitter.com/nldijNxMR8
— JioCinema (@JioCinema) May 27, 2023
చదవండి: సీఎస్‌కే ఐదోసారి కొడుతుందా లేక గుజరాత్ డబుల్ ధమాకానా?
Comments
Please login to add a commentAdd a comment