ముగ్గురు పాస్... ఇషాంత్ ఔట్
జట్టులో మోహిత్ శర్మ
రోహిత్, భువీ, జడేజా ఫిట్
అడిలైడ్: ప్రపంచకప్‌కు ముందు భారత్‌కు ఊహిం చని ఎదురుదెబ్బ తగిలింది. మోకాలి గాయంతో బాధపడుతున్న సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ ఫిట్‌నెస్ పరీక్షలో విఫలమయ్యాడు. శనివారం నిర్వహించిన ఈ ఫిట్‌నెస్ టెస్టులో రోహిత్, భువనేశ్వర్, రవీంద్ర జడేజా మాత్రం పాసయ్యారు. మెల్‌బోర్న్‌లో బాక్సింగ్ డే టెస్టు ఆడిన ఇషాంత్ ఆ తర్వాత మళ్లీ బరిలోకి దిగలేదు. ఫిట్‌నెస్‌ను పరీ క్షించేందుకు ముక్కోణపు సిరీస్‌లో జనవరి 26న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యా చ్‌లో అతన్ని తీసుకున్నారు.
కానీ వర్షం వల్ల మ్యాచ్ రద్దుకావడంతో ఇషాంత్‌కు బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. తర్వాత ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు తాను ఫిట్‌నెస్‌తో లేనని చెప్పి తప్పుకున్నాడు. దీంతో ఒక్కసారిగా ఈ ఢిల్లీ పేసర్ ఫిట్‌నెస్‌పై అనుమానాలు రేకెత్తాయి. ప్రస్తుతం ఇషాంత్ స్థానంలో మోహిత్ శర్మను జట్టులోకి తీసుకున్నారు. ‘ఇషాంత్ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. ప్రపంచకప్ వరకు అతను కోలుకోవడం కష్టమే. నిబంధనల ప్రకారం మోహిత్‌ను స్టాండ్ బైగా తీసుకున్నాం. ఇషాంత్ త్వరలోనే భారత్‌కు తిరిగొస్తాడు’ అని బీసీసీఐ ఉన్నతాధికారి తెలిపారు.
అయితే ఈ విషయంపై బీసీసీఐ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
మరోవైపు కాలిపిక్క కండరాల గాయంతో బాధపడుతున్న రోహిత్, చీలమండ గాయంతో ఇబ్బం దిపడుతున్న భువనేశ్వర్ పూర్తిస్థాయిలో మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించారు. ఈ ఇద్దరు ఓపెన్ మీడియా సెషన్‌కు కూడా హాజరై తమ ఫిట్‌నెస్‌పై ఉన్న అనుమానాలను తొలగించారు. అయితే భుజం గాయం నుంచి కోలుకున్న జడేజా మాత్రం పరీక్షలో గట్టెక్కినా... వార్మప్ మ్యాచ్‌లో అతని ప్రదర్శనను పూర్తిస్థాయిలో పరిశీలించాలని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది.