DC Vs GT: మోహిత్ శ‌ర్మ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే | Mohit Sharma bowls most expensive IPL spell | Sakshi
Sakshi News home page

IPL 2024 DC Vs GT: : మోహిత్ శ‌ర్మ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే

Published Thu, Apr 25 2024 6:49 PM | Last Updated on Thu, Apr 25 2024 6:51 PM

Mohit Sharma bowls most expensive IPL spell - Sakshi

గుజ‌రాత్ టైటాన్స్ పేస‌ర్ మోహిత్ శ‌ర్మ ఓ చెత్త రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో ఒక స్పెల్‌(నాలుగు ఓవర్లు)లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా మోహిత్ చెత్త రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌-2024లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో మోహిత్‌ తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 73 పరుగులు సమర్పించుకున్నాడు.

తద్వారా మోహిత్‌ శర్మ ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత బౌలర్‌ బసిల్‌ థంపి పేరిట ఉండేది. ఐపీఎల్‌-2018 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరపున ఆడిన బసిల్‌ థంపి.. ఆర్సీబీతో మ్యాచ్‌లో తన 4 ఓవర్ల కోటాలో 70 పరుగులిచ్చాడు. తాజా మ్యాచ్‌తో థంపిని మోహిత్‌ అధిగమించాడు.

కాగా ఈ మ్యాచ్‌లో 20 ఓవర్‌ వేసిన మోహిత్‌ బౌలింగ్‌లో ఢిల్లీ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ 4 సిక్స్‌లు, ఒక ఫోరుతో 31 పరుగులు రాబట్టాడు.  తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో పంత్‌(88)తో పాటు అక్షర్‌ పటేల్‌(66), స్టబ్స్‌(26) పరుగులతో రాణించారు. గుజరాత్‌ బౌలర్లలో సందీప్‌ వారియర్‌ 3 వికెట్లు పడగొట్టగా.. నూర్‌ ఆహ్మద్‌ ఒక్క వికెట్‌ పడగొట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement