DC Vs GT: రిషబ్ పంత్ విధ్వంసం.. ఏకంగా 8 సిక్స్‌లతో! వీడియో వైర‌ల్‌ | Ruthless Rishabh Pant powers Delhi to 224 vs Gujarat | Sakshi
Sakshi News home page

#Rishabh Pant: రిషబ్ పంత్ విధ్వంసం.. ఏకంగా 8 సిక్స్‌లతో! వీడియో వైర‌ల్‌

Published Thu, Apr 25 2024 6:36 PM | Last Updated on Thu, Apr 25 2024 6:39 PM

Ruthless Rishabh Pant powers Delhi to 224 vs Gujarat - Sakshi

ఐపీఎల్‌-2024లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ విధ్వంసం సృష్టించాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్ గుజరాత్‌ బౌలర్లను  ఊచకోత కోశాడు. అక్షర్ పటేల్‌తో కలిసి స్కోర్ బోర్డును పంత్ పరుగులు పెట్టించాడు. ఆఖరి ఓవర్ వేసిన మొహిత్ శర్మకు అయితే పంత్ చుక్కలు చూపించాడు.

ఢిల్లీ ఇన్నింగ్స్ 20 ఓవర్‌లో పంత్ 4 సిక్స్‌లు, ఒక ఫోరుతో 31 పరుగులు రాబట్టాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో కేవలం 43 బంతులు ఎదుర్కొన్న రిషబ్‌.. 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 88 పరుగులు చేశాడు. అతడి బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన అభిమానులు వరల్డ్‌కప్‌న్‌కు పంత్ రెడీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక  ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో పంత్‌తో పాటు  అక్షర్‌ పటేల్‌(66), స్టబ్స్‌(26) పరుగులతో రాణించారు. గుజరాత్‌ బౌలర్లలో సందీప్‌ వారియర్‌ 3 వికెట్లు పడగొట్టగా.. నూర్‌ ఆహ్మద్‌ ఒక్క వికెట్‌ పడగొట్టారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement