ఐపీఎల్-2024లో మరోసారి థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఢిల్లీ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఓపెనర్ పృథ్వీ షా వివాదాస్పద రీతిలో ఔటయ్యాడు. ప్రస్తుతం పృథ్వీ షా ఔట్ క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది.
అసలేం జరిగిందంటే?
ఢిల్లీ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన సందీప్ వారియర్ ఐదో బంతిని పృథ్వీ షాకు షార్ట్ పిచ్ డెలివరీని సంధించాడు. ఆ బంతిని పృథ్వీ షా పుల్ షాట్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. కానీ షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతి డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ దిశగా బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ నుంచి నూర్ అహ్మద్ పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేస్తూ అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు.
దీంతో గుజరాత్ ఆటగాళ్లంతా సంబరాల్లో మునిగి తేలిపోయారు. కానీ ఫీల్డ్ అంపైర్‌లు క్లీన్ క్యాచ్ అవునా కాదా అనే సందేహంతో థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. థర్డ్ అంపైర్ పలు కోణాల్లో పరిశీలించి బంతి కింద చేతి వేళ్లు ఉన్నయాని తన నిర్ణయాన్ని ఔట్‌గా ప్రకటించాడు. అయితే రిప్లేలో బంతి గ్రౌండ్‌కు టచ్ అయినట్లు కన్పించినప్పటికి అంపైర్ మాత్రం క్లీన్ క్యాచ్‌గా ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
కామెంటెటర్‌లు ఆకాష్ చోప్రా, పార్థివ్ పటేల్ సైతం క్యాచ్‌ను అందుకునే సమయంలో బంతి నేలను తాకిందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు చెత్త అంపైరింగ్.. అది క్లియర్‌గా నాటౌట్ అని కామెంట్లు చేస్తున్నారు.
Woah 🔥🔥
Noor Ahmad holds on to a sharp catch in the deep as #DC lose both their openers!
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #DCvGT pic.twitter.com/8zmIDwCdf2— IndianPremierLeague (@IPL) April 24, 2024
Comments
Please login to add a commentAdd a comment